Everyday Bad Habits : కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే ఈ అలవాట్లు మానేయండి
Liver Health : మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను మరిచిపోవాలి. చిన్న చిన్న పొరబాట్లు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. కాలేయ ఆరోగ్యం కోసం ఎటువంటి వాటిని వదులుకోవాలో తెలుసుకోవాలి.
మన దైనందిన జీవితంలో కడుపు, గుండె, కళ్లను జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మనం తరచుగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మర్చిపోతుంటాం. మన శరీరంలో ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఈ అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
అయితే మంచి ఆహారం తీసుకోవడంతోపాటుగా కొన్నింటిని నివారించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. లివర్ హెల్త్ పరంగా కొన్ని రోజువారీ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు కాలేయానికి హాని కలిగిస్తాయి. కాలేయం సక్రమంగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే చాలా మంది ఆరోగ్య నిపుణులు మీ కాలేయ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలని సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేయని వారి శరీరం క్రమంగా బలహీనపడుతుంది. అలాగే, అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
మనం రుచి, సంతృప్తి కోసం తరచుగా కొన్ని ఆహారాలను తినడం ప్రారంభిస్తాం, వాటిలో స్వీట్లు, వేయించిన ఆహారాలు, ఆల్కహాల్.. మాంసం ఆహారాలు మొదలైనవి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.
అనారోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తినడం వల్ల కాలేయం దెబ్బతింటుందని మీరు అనుకుంటే, ఇది నిజం కాదు. మనం నిత్య జీవితంలో చేసే కొన్ని తప్పులు కాలేయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మీరు నివారించాల్సిన విషయాలు తెలుసుకోండి.
పగటి పూట నిద్రించే అలవాటు
కొంతమందికి పగటిపూట నిద్రించే చెడు అలవాటు ఉంటుంది. 10 నుండి 20 నిమిషాల పాటు పడుకుంటే ఎటువంటి హాని జరగదు. కానీ పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవడం హానికరం అని నిపుణులు అంటున్నారు. ఇది కాలేయంపై ప్రభావం చూపుతుంది.
రాత్రంతా మేల్కొనే అలవాటు
కొంతమందికి ఆలస్యంగా పని చేయడం లేదా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటు.. అందుకే చాలా ఆలస్యంగా నిద్రపోతారు. ఇది కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉంటే.. గుండెకు కూడా మంచిది కాదు.
చాలా కోపంగా ఉండటం
మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మానసిక ఆరోగ్యానికే కాదు కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. మీ కోపాన్ని తగ్గించుకోవడానికి, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. కోపం వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే కోపాన్ని తగ్గించుకోవాలి.