Hair Care Tips : ఇలాంటి సమయాల్లో జుట్టుకు నూనె అసలు రాయకండి!
29 August 2022, 20:13 IST
- Hair Care Tips : జుట్టుకు నూనె రాయడం వల్ల కుదుళ్ళు బలంగా మారుతాయి. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అయితే కొన్ని సందర్భాలలో జుట్టుకు నూనె రాయకూడదు. ఆ పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం.
Hair Oils
జుట్టు మృదువుగా, ఒత్తుగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కొరుకుంటారు.ఇటీవలి కాలంలో చాలా మంది జుట్టు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో ఇద్దరిలోనూ ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ఆహారం, ఒత్తిడి, వాతావరణం కారణంగానే జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మంది జుట్టు సంరక్షణ కోసం రకారకాల హెయిర్ అయిల్స్ వాడుతుంటారు. హెయిర్ ఆయిల్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది, జుట్టుకు నూనెతో మసాజ్ చేసినప్పుడు, మూలాలకు పోషణ లభిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మసాజ్ చేయకూడదు. ఎలాంటి సమయాల్లో జుట్టుకు అయిల్ రాయకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే జుట్టు సమస్యలు మరింతగా పెరుగుతాయి. జుట్టుకు నూనె రాసుకోకూడని పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయిలీ స్కిన్
మీ స్కాల్ప్ జిడ్డుగా ఉంటే, మీ జుట్టుకు ఎక్కువ నూనె రాయకండి. జిడ్డు చర్మానికి నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. దీని కారణంగా, జుట్టు మునుపటి కంటే ఎక్కువగా విరిగిపోతుంది. ఈ అలవాటును సకాలంలో మార్చుకోకపోతే, జుట్టు ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉంది.
తలపై చుండ్రు
మీ జుట్టు చుండ్రుకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే, నూనె రాసుకోకూడదు. అలాంటి స్థితిలో నూనె రాసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య తీవ్రమవుతుంది.
బొబ్బలు ఉన్నప్పుడు
కొన్నిసార్లు తలపై జుట్టు కింద బొబ్బలు ఉంటాయి. ఈ దశలో జుట్టుకు నూనె రాయడం వల్ల పొక్కులు మరింతగా వ్యాపిస్తాయి. త్వరగా నయం కావడం కూడా కష్టమవుతుంది.
తల స్నానం సమయంలో జుట్టుకు నూనె రాయకూడదు
తల స్నానానికి ముందు ఎల్లప్పుడూ జుట్టుకు నూనె రాయకండి. తల స్నానానికి కనీసం గంట ముందు నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. రాత్రి పమయంలో జుట్టును నూనెతో మసాజ్ చేసి ఉదయం పూట స్నానం చేయడం చాలా మంచిది.
వర్షాకాలం జుట్టు ఆరోగ్యం ఎక్కువగా దెబ్బ తింటుంది. వాతావరణంలో తేమ కారణంగా, జుట్టు విరిగిపోతుంది, కాబట్టి ఈ సీజన్లో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. వర్షాకాలంలో తరచుగా తల స్నానం చేయడం మానుకోండి, ఎందుకంటే ఇలా చేయడం వల్ల తల మీద చర్మం తేమగా, నిర్జీవంగా మారుతుంది. దీంతో ఎక్కువగా రాలుతూ ఉంటుంది.