తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Telugu Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా సింపుల్ గా చెప్పేయండి

Telugu hanuman jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా సింపుల్ గా చెప్పేయండి

Gunti Soundarya HT Telugu

01 June 2024, 6:42 IST

google News
    • Telugu hanuman jayanti 2024: ఉత్తర భారతదేశంలో హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణమి తిథి రోజు జరుపుకుంటారు. కానీఈ దక్షిణ భారతీయులు మాత్రం వైశాఖ మాసం దశమి తిథిన జరుపుకుంటారు. ఈ ఏడాది తెలుగు వారి హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీ వచ్చింది. 
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు (pinterest)

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Telugu hanuman jayanti 2024: కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి చైత్రమాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే దక్షిణ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి ప్రదేశాలలో హనుమాన్ జయంతిని వైశాఖ మాసం దశమి తిథి రోజు జరుపుకుంటారు .ఈ ఏడాది వైశాఖ మాసం దశమి తిథి జూన్ 1 శనివారం వచ్చింది. 

చైత్ర మాసం పౌర్ణమి రోజు నుంచి ఆంజనేయుడి భక్తులు హనుమాన్ దీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు దీక్ష ఉంటారు. హనుమాన్ జయంతి రోజు దీక్షను విరమిస్తారు. ఈ సమయంలో చాలా నిష్టగా ఉంటూ నియమాలు పాటిస్తారు. హనుమంతుడు శ్రీరాముడిని కలిసిన రోజు జ్ఞాపకార్థంగా హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సందర్భంగా మీ ప్రియమైన వారికి హనుమంతుడి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వారికి ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. మీకోసం కొన్ని సింపుల్ కోట్స్ ఇస్తున్నాం. 

ఎల్లవేళలా హనుమంతుడిని మన హృదయాలలో ఉంచుకుందాం. ఆయన మనల్ని దుఃఖ సాగరాన్ని దాటించి ఆనందంలో ముంచేత్తుతాడు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

హనుమాన్ జయంతి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

హనుమంతుడు బలం, అసమానమైన భక్తి, నిస్వార్థమైన సేవకు ప్రతీక. శ్రీరాముడికి అత్యంత గొప్ప భక్తుడు. ఆయన ఆశీర్వాదాలు మీకు లభించాలని కోరుకుంటూ  హ్యాపీ హనుమాన్ జయంతి. 

శ్రీరాముడి పరమ భక్తుడు హనుమాన్ జయంతి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయన దివ్య ఆశీర్వాదాలు కురిపించుగాక. 

తెలుగు హనుమాన్ జయంతి మీకు శుభం, ఆశీర్వాదాలు కలిసి ఇవ్వాలని కోరుకుంటున్నాను.

సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితం కోసం హనుమంతుడి బోధనలు, అడుగుజాడలను అనుసరించాలని నేను కోరుకుంటున్నాను.

మీ చర్యలు స్వచ్ఛంగా నిస్వార్ధంగా ఉండనివ్వండి. మీరు ఎల్లప్పుడూ కుటుంబానికి బలంగా మారాలి.  హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా పవనపుత్ర హనుమంతుడిని ప్రార్థిద్దాం. మన జీవితాల్లో విజయం సాధించడానికి ఆయన ఆశీస్సులు కోరుకుందాం. మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. జై హనుమాన్.

హనుమాన్ జయంతి సందర్భంగా జీవితంలో ప్రతికూలతలు, బెదిరింపుల నుండి మిమ్మల్ని రక్షించడానికి హనుమాన్ జీ మీతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 

ఈ హనుమాన్ జయంతి వేడుకలు మీ జీవితంలో మరింత సంతోషాన్ని, సానుకూలతను తీసుకురావాలి. మీకు ఎల్లప్పుడూ హనుమంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. 

ఆపద మపహార్తారం దాతారం సర్వసంపదాం 

లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్

ఈ శ్లోకం చెప్పి మీ ప్రియమైన వారికి హనుమంతుడి ఆశీర్వాదాలు కలగాలని కోరుకోవచ్చు. 

పవనపుత్ర హనుమంతుడు బ్రహ్మచారి, బలవంతుడు మీకు ఒంటరిగా ఉండేందుకు జ్ఞానాన్ని, ఆరోగ్యంగా ఉండేందుకు శారీరక బలాన్ని, మీ జీవితాన్ని ప్రేమించడానికి దైవం పట్ల అంకితభావంతో ఉండేందుకు ఆధ్యాత్మికతను ప్రసాదించుగాక అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

హనుమంతుడి ఆశీస్సులతో మీరు జీవితంలో మీ లక్ష్యాలను వెంటనే సాధించాలి. మీ కలలను వెంటనే నిజం చేసుకోండి .హ్యాపీ హనుమాన్ జయంతి.

ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ 

సర్వశత్రు సంహారాయ సర్వరోగ హరాయ 

సర్వవసీకరణాయ రామదూతాయ స్వాహా

ఈ హనుమాన్ జయంతి సందర్భంగా పవనపుత్ర హనుమంతుని ప్రార్థించి మన జీవితాల్లో విజయం ఇవ్వమని ఆయన దీవెనలు కోరుకుందాం. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జీ మీకు జీవితంలో విజయం సాధించేందుకు ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మీ జీవితంలో ఆనందం విజయం కీర్తి అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను

 

తదుపరి వ్యాసం