Rahu transit: 2025 వరకు ఈ రాశుల వారికి రాహువు ఆశీర్వాదాలు.. అన్నింటా ఆదాయమే-grace of rahu till 2025 these zodiac signs get happiness and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Transit: 2025 వరకు ఈ రాశుల వారికి రాహువు ఆశీర్వాదాలు.. అన్నింటా ఆదాయమే

Rahu transit: 2025 వరకు ఈ రాశుల వారికి రాహువు ఆశీర్వాదాలు.. అన్నింటా ఆదాయమే

Gunti Soundarya HT Telugu
May 22, 2024 02:24 PM IST

Rahu transit: నీడ గ్రహంగా భావించే రాహువు 2025 వరకు కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఫలితంగా వీరికి అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది.

2025 వరకు వీరికి రాహువు ఆశీర్వాదాలు
2025 వరకు వీరికి రాహువు ఆశీర్వాదాలు

Rahu transit: అన్ని గ్రహాలలో రాహువు, కేతువును ఛాయా గ్రహాలుగా సూచిస్తారు. నవగ్రహాలలో ఈ రెండు గ్రహలు చాలా ప్రత్యేకమైనవి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు అశుభ స్థానంలో ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

గతేడాది అక్టోబర్ లో రాహువు తిరోగమన దశలో మీన రాశిలోకి ప్రవేశించాడు. 2025, మే నెల వరకు రాహువు మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి మరో ఏడాది పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది.

వృషభ రాశి

2025 వరకు రాహు సంచారం వల్ల లాభాలు పొందే మొదటి రాశి. వృషభ రాశి పదకొండో ఇంట్లో రాహువు సంచరిస్తాడు. ఈ కాలంలో చాలా డబ్బు సంపాదిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అసంపూర్తి పనులు పూర్తి చేయగలుగుతారు. జీవితం ఆనందంతో నిండిపోతుంది. ఈ సమయంలో డబ్బు బాగా ఆదా చేసుకుంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు సులభంగా తీరుస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. దానివల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. కొత్త వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. కెరీర్ కి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మిథున రాశి

రాహువు మీన రాశిలో ఉండటం వల్ల మిథున రాశి వారు విపరీతమైన లాభాలు పొందుతారు . ఈ రాశి తొమ్మిదవ ఇంట్లో రాహువు సంచరిస్తాడు. అందువల్ల అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపార నిమిత్తం విదేశీ పర్యటనకు అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన కాలం. ఖర్చులు తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెరుగుదల ఉంటాయి. జీవితంలో వివిధ రంగాలలో విజయం సాధిస్తారు

వృశ్చిక రాశి

రాహువు వృశ్చిక రాశి ఐదో ఇంట్లో సంచరిస్తాడు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అదృష్టం వెన్నంటే ఉంటుంది. వివిధ రంగాల్లో భారీ విజయాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడుల వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం లభిస్తుంది. వివిధ ప్రాంతాల నుండి ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి .ఈ కాలంలో ఏకాగ్రత, తెలివితేటలు బాగా పెరుగుతాయి.

రాహు అనుగ్రహం పొందే మార్గాలు

రాహువు చెడు ప్రభావాలు వల్ల బాధపడుతున్నట్లయితే ఈ చర్యలు పాటించడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. నీలం రంగు దుస్తులు ధరించాలి. అలాగే ఇంట్లో పెద్దవారని గౌరవించాలి. అనారోగ్యంతో ఉన్నవారికి సేవలు అందించాలి. మద్యం సేవించడం మానుకోవాలి .పెంపుడు జంతువులకు, వీధి కుక్కలకు ఆహారం పెట్టాలి. రాహువుని సంతోషపరిచేందుకు కాలభైరవుడికి పూజలు చేయాలి. అలాగే దుర్గామాతను పూజించాలి. ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించాలి. కాలాష్టమి రోజు దుర్గామాతని స్మరించుకుంటూ ఉపవాసం ఉండటం వల్ల రాహు చల్లని చూపు పొందుతారు.

Whats_app_banner