Rahu: మీ జాతకంలో రాహువు ఉన్న ఇంటిని బట్టి కలిగే ఫలితాలు ఇవే-these are the results depending on the house of rahu in your horoscope ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rahu: మీ జాతకంలో రాహువు ఉన్న ఇంటిని బట్టి కలిగే ఫలితాలు ఇవే

Rahu: మీ జాతకంలో రాహువు ఉన్న ఇంటిని బట్టి కలిగే ఫలితాలు ఇవే

Apr 13, 2024, 06:14 PM IST Haritha Chappa
Apr 13, 2024, 06:14 PM , IST

  • మీ జాతకంలో రాహువు ఉన్న ఇంటిని బట్టి అతను మీకు జీవితంలో ఎలాంటి ఫలితలను ఇస్తాడో అంచనా వేయచ్చు. 

రాహు, కేతువులను నీడ గ్రహాలు అంటారు. ఒకరి జాతకంలో రాహువు ఎక్కడ ఉంటాడో, అతనితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో… దాన్ని బట్టి జీవితంలో జరిగే లాభనష్టాలను అంచనా వేస్తారు.

(1 / 14)

మీ జాతక చక్రంలో 3, 6, 10, 11 వ ఇళ్లలో రాహువు ఉంటే, రాహువు ఖచ్చితంగా మీకు అపారమైన ప్రయోజనాలను ఇస్తాడు. 

(2 / 14)

లగ్నంలో రాహువు మొదటి స్థానంలో ఉంటే ఆ జాతకుడు చురుకుగా ఉంటాడు. వీరు తమ పనిలో జాగ్రత్తగా ఉంటారు. యవ్వనంలో పేదరికం ఉంటుంది. 

(3 / 14)

లగ్నం నుండి రాహువు రెండో స్థానంలో ఉంటే కుటుంబంలో గందరగోళం ఏర్పడుతుంది. వీరు ఆహార ప్రియులుగా ఉంటారు. స్త్రీలతో సంబంధం కలిగి ఉంటారు. వీరికి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది.

(4 / 14)

లగ్నం నుండి మూడో స్థానంలో రాహువు ఉన్న వ్యక్తులు ధైర్యవంతులు, సంగీతం పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు, వారు పని చేయడానికి ఇష్టపడతారు, అన్నదమ్ముల బంధంలో సమస్యలు ఉంటాయి.

(5 / 14)

లగ్నం నుండి రాహువు నాల్గవ స్థానంలో ఉంటే విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీరు యవ్వనంలో పేదరికాన్ని ఎదుర్కొంటారు. అయితే మధ్యవయసు తరువాత వీరు సంపదను కూడబెట్టుకుని ఆనందంగా జీవిస్తారు.

(6 / 14)

లగ్నం నుండి ఐదో ఇంట్లో రాహువు ఉంటే దోషం ఏర్పడే అవకాశం ఉంది. కొందరికి ఆడపిల్లలు పుట్టవచ్చు. వీరికి మోసపూరిత ఆలోచనలు ఉంటాయి. ఆస్తి విషయంలో సమస్యలు ఎదురవుతాయి. మానసిక సమస్యలు ఎదురవుతాయి.

(7 / 14)

6వ ఇంట్లో రాహువు ఉన్న వ్యక్తులు వీరులుగా ఉంటారు. వీరు పశువులు, జంతువులకు భయపడతారు.

(8 / 14)

7వ ఇంట్లో రాహువు ఉంటే ఒకరి కంటే ఎక్కువ మంది జీవిత భాగస్వాములను పొందే అవకాశం ఉంది. పురుషుడు అయితే స్త్రీలతో సమస్యలు ఎదురవుతాయి. స్త్రీ అయితే పురుషులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. స్థిరాస్తులు ఉండే అవకాశం ఉంది. 

(9 / 14)

8వ ఇంట్లో రాహువు ఉంటే క్షేత్ర దోషాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయడం వీరికి ఇష్టం. ఆస్తిని పొందడంలో ఇబ్బంది ఉంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

(10 / 14)

రాహువు తొమ్మిదో ఇంట్లో ఉంటే ప్రశాంతత తగ్గుతుంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. వీరికి సమాజంలో మంచి పేరు వస్తుంది. వీరికి రాజకీయ నాయకులు, బడా నాయకులతో సంబంధాలు ఉంటాయి. 

(11 / 14)

రాహువు 10వ ఇంటిలో ఉంటే ధనం కురుస్తుంది. వీరి ఆలోచనలు డబ్బు మీదే ఉంటాయి. వీరికి పని మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. వీరు కొంచెం మూఢనమ్మకాలు కలిగి ఉంటారు. 

(12 / 14)

11వ ఇంట్లో రాహువు ఉంటే వాహన యోగం ఉంటుంది. వీరికి హేతుబద్ధమైన ఆలోచనలు ఉంటాయి. లాటరీలు, పందాలు, షేర్ మార్కెట్ విభాగాల్లో డబ్బు వస్తుంది. 

(13 / 14)

12వ ఇంట్లో రాహువు ఉంటే జీవితాన్ని బాగా ఆస్వాదిస్తారు. అయితే వీరికి ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పరోక్షంగా ఆదాయం పొందవచ్చు. 

(14 / 14)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు