Morning Routine for Winter: ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. మీ రోజుని యాక్టివ్ చేసుకోండి
23 November 2022, 20:00 IST
- Morning Routine for Winter : ఉదయాన్నే లేచి.. పనులు చేయాలంటే చాలా బద్ధకిస్తారు కొంతమంది. దీనివల్ల పనులు ఆలస్యం అవుతాయి. అంతేకాకుండా మీరు చాలా లేజీగా ఉంటారు. మీరు కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లైతే.. కొన్ని సింపుల్ చిట్కాలతో మీ రోజుని ప్రారంభిస్తే.. అది మిమ్మల్ని డే అంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది.
మార్నింగ్ రొటీన్
Morning Routine for Winter : చలికాలంలో ఉదయాన్నే నిద్రలేవడం అంటే సాహసమనే చెప్పాలి. నిద్రలేచిన తర్వాతైనా యాక్టివ్‌గా ఉంటామా అంటే.. అది కూడా కష్టమే. ఎందుకంటే ఈ చలి మనల్ని మరింత లేజీగా చేస్తుంది. అయితే ఉదయాన్నే మీ మానసిక స్థితిని ప్రకాశవంతం చేసి.. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందు రోజు రాత్రి మీ రోజు ప్రారంభించండి
మీరు పడుకునే ముందు.. రేపు ఏమి చేస్తే బాగుంటుంది.. ముందుగా ఏమి చేయాలి అనే వాటిగురించి.. ఆలోచించుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ పనులు చేయాలంటే.. ముందే నోట్స్ రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఉదయాన్నే ఎక్కువగా ఆలోచనల్లో మునిగిపోకుండా.. అనుకున్నపనిని.. షెడ్యూల్ ప్రకారంచేసే అవకాశముంటుంది. ఏ పని కూడా మరచిపోరు. ఇది మీ లక్ష్యాల నుంచి మీ దృష్టి మరల్చకుండా ఉండేలా చేస్తుంది. తద్వారా మీరు మీ పనిపై ఎక్కువ ఫోకస్ చేయగలుగుతారు. దీనివల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
ఉదయాన్నే ఫోన్‌ని చెక్ చేయకండి..
ఈ రోజుల్లో.. స్మార్ట్‌ఫోన్‌లు లేనిదే రోజు స్టార్ట్ అవ్వడం లేదు.. కంప్లీట్ అవ్వడం లేదు. అంతగా అలవాటు అయిపోంది. అయితే ఈ తరుణంలో మీరు మీ ఉదయాన్ని స్మార్ట్‌ఫోన్‌తో స్టార్ట్ చేయకండి. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో మనల్ని డిస్టర్బ్ చేసే చాలా కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఉదయాన్నే ఫోన్ చూస్తే.. దానిని వదలించుకుని పనులు ప్రారంభించడం అంత సులువేమి కాదు. ఆ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే టైమ్ ఎప్పుడవుతుందో కూడా తెలియదు. కాబట్టి మీ ఉదయాన్ని పర్ఫెక్ట్గా ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఫోన్‌కి దూరంగా ఉండండి.
ఒక గ్లాసు నీరు తాగండి..
రాత్రంతా నీరు లేకపోతే.. మీ శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ఇది మన జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. కాబట్టి.. ఉదయాన్నే ఓ గ్లాస్ మంచి నీరు తాగండి. నిద్రలేచాక.. యాక్టివ్‌గా ఉండడంలో ఇబ్బంది పడేవారికి ఈ సింపుల్ ట్రిక్ బాగా సహాయపడుతుంది. మీలో మరింత ఉత్సాహం నింపుకునేందుకు.. గోరువెచ్చని నీళ్లను కూడా తీసుకోవచ్చు.
ఎండ అవసరం..
సూర్యరశ్మి ఆరోగ్యానికి, శ్రేయస్సుకు అనేక విధాలుగా అవసరం. కాబట్టి.. ప్రతిరోజూ ఉదయాన్నే.. సూర్యుడిని క్రమం తప్పకుండా చూడండి. ఇది మీలోని అంతర్గత గడియారాన్ని సమకాలీకరిస్తుంది. అంతేకాకుండా ఇది మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే హ్యాపీగా నిద్రలేచేలా సహాయం చేస్తుంది.
కాబట్టి మీరు మేల్కొన్న వెంటనే కిటికీని తెరవడానికి లేదా ఎండలో బయట తిరగడానికిి ప్రయత్నించండి. ఇది మీరు సహజంగా తాజాగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.
మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయండి..
మీరు మీ ఉదయపు కాలకృత్యాలను పూర్తి చేసిన వెంటనే వ్యాయామం చేయడం ద్వారా మీ సిరల్లో రక్తం ప్రవహిస్తుంది. దానికోసం మీరు మీ శరీరాన్ని స్ట్రెచ్ చేయడం లేదా యోగా చేయవచ్చు. ఇవి మీ శరీరానికి శక్తినివ్వడమే కాకుండా.. మీ బాడీని యాక్టివ్ చేస్తాయి. ఇది మీరు రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.
అంతేకాకుండా ఇది మీ కండరాలను సడలిస్తుంది. ముందు రోజు రాత్రి అతిగా నిద్రపోవడం లేదా ఇబ్బందికరమైన స్థితిలో పడుకున్నా.. ఏమైనా టెన్షన్ లేదా నొప్పి ఉన్నా.. ఇలా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల తగ్గుతాయి.