తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mustard Oil During Winters। శీతాకాలంలో ఆవనూనెతో అవాక్కయ్యే ప్రయోజనాలు తెలుసా?

Mustard Oil During Winters। శీతాకాలంలో ఆవనూనెతో అవాక్కయ్యే ప్రయోజనాలు తెలుసా?

22 November 2022, 9:19 IST

Mustard Oil During Winters: ఆవ నూనెను మనం అవకాయల్లో, వంటల్లో ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఈ ఆవనూనెను ఉపయోగించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..

  • Mustard Oil During Winters: ఆవ నూనెను మనం అవకాయల్లో, వంటల్లో ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఈ ఆవనూనెను ఉపయోగించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..
శీతాకాలంలో మన ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, సులభంగా అనారోగ్యం బారినపడతాం. ముప్పును నివారించడానికి ఆవనూనె కూడా ఒక ఔషధం.
(1 / 7)
శీతాకాలంలో మన ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, సులభంగా అనారోగ్యం బారినపడతాం. ముప్పును నివారించడానికి ఆవనూనె కూడా ఒక ఔషధం.(Unsplash)
ఆవాల నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దురద, మంట, నొప్పిని నయం చేస్తుంది. ఇది ఇది చెవిలో చేరిన డస్ట్​ను మృదువుగా మార్చి, చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చెవిలో 2-3 చుక్కలు ఆవనూనె వేసుకోవచ్చు.  గొంతు వద్ద, ఛాతీపైన ఆవనూనె రాసుకుంటే గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
(2 / 7)
ఆవాల నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దురద, మంట, నొప్పిని నయం చేస్తుంది. ఇది ఇది చెవిలో చేరిన డస్ట్​ను మృదువుగా మార్చి, చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చెవిలో 2-3 చుక్కలు ఆవనూనె వేసుకోవచ్చు.  గొంతు వద్ద, ఛాతీపైన ఆవనూనె రాసుకుంటే గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.(Unsplash)
చలికాలంలో చర్మం సులభంగా పొడిబారుతుంది. ఆవనూనెను చర్మానికి పట్టించి గంట సేపు అయ్యాక నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, పూర్తిగా హైడ్రేట్ చేస్తుంది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.
(3 / 7)
చలికాలంలో చర్మం సులభంగా పొడిబారుతుంది. ఆవనూనెను చర్మానికి పట్టించి గంట సేపు అయ్యాక నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, పూర్తిగా హైడ్రేట్ చేస్తుంది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.(Unsplash)
ఆవనూనె తలలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆవనూనె తలకు రాసుకుంటే చుండ్రు నశిస్తుంది.
(4 / 7)
ఆవనూనె తలలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆవనూనె తలకు రాసుకుంటే చుండ్రు నశిస్తుంది.(Unsplash)
చలికాలంలో ఎముకలు, కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా వెచ్చని ఆవాల నూనెను మర్దన చేయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.
(5 / 7)
చలికాలంలో ఎముకలు, కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా వెచ్చని ఆవాల నూనెను మర్దన చేయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.(Unsplash)
ఆవాల నూనె క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వంటల్లో ఆవనూనె ఉపయోగిస్తే ప్రయోజనం పొందవచ్చు.
(6 / 7)
ఆవాల నూనె క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వంటల్లో ఆవనూనె ఉపయోగిస్తే ప్రయోజనం పొందవచ్చు.(Pixabay)
ఆవనూనెలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి కొవ్వు ఎక్కువ పెరగదు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
(7 / 7)
ఆవనూనెలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కాబట్టి కొవ్వు ఎక్కువ పెరగదు, గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి