తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Fry: ఆంధ్రా స్టయిల్‌లో చికెన్ ఫ్రై, ఒక్కసారి టేస్టే చేస్తే ఆపై ఒక్క ముక్క కూడా వదలరు!

Chicken Fry: ఆంధ్రా స్టయిల్‌లో చికెన్ ఫ్రై, ఒక్కసారి టేస్టే చేస్తే ఆపై ఒక్క ముక్క కూడా వదలరు!

Galeti Rajendra HT Telugu

20 October 2024, 11:30 IST

google News
  • Andhra Chicken Fry: మీరు చాలా రకాలు చికెన్ ఫ్రై తిని ఉండొచ్చు. కానీ.. ఆంధ్రా స్టయిల్‌లో సంప్రదాయ చికెన్ ఫ్రైని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? సింపుల్‌గా ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. 

చికెన్ ఫ్రై
చికెన్ ఫ్రై

చికెన్ ఫ్రై

ఆదివారం వచ్చిందంటే.. నాన్ వెజ్ ప్రియులు కొత్త తరహాలో రుచులను ఆస్వాదించాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారికి ఈరోజు ఆంధ్రా స్టయిల్‌లో చికెన్ ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ చేయించండి. పప్పు, సాంబారు, రసంతో కలిపి ఈ చికెన్ ఫ్రైని తినవచ్చు. దోశ, పుల్కా, చపాతితో కలిసి తింటే ఈ ఫ్రై రుచి మరింత పెరుగుతుంది.

కావలసిన పదార్థాలు:

  • చికెన్ – 1 కేజీ
  • నూనె – 5 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయలు – 3 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  • పచ్చి మిర్చీలు – 3 (మీడియం సైజులో కట్ చేసుకోవాలి)
  • ధనియాలు – 1 టేబుల్ స్పూన్
  • ఎండు మిర్చి- 4 (మీడియం సైజ్)
  • మిరియాలు – 1/2 టీ స్పూన్
  • యాలకులు– 2
  • లవంగాలు – 4
  • దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క
  • సోంపు – 1/2 టీ స్పూన్
  • జీలకర్ర – 1/2 టీ స్పూన్
  • పసుపు – 1/2 టీ స్పూన్
  • కారం పొడి – 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి- 1/2 టీ స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా

చికెన్ ఫ్రై తయారీ విధానం

 

  • ఒక కేజీ స్కిన్ లెస్ చికెన్ తీసుకోవాలి. విత్ బోన్ తీసుకుంటే ఫ్రై రుచి బాగుంటుంది
  • చికెన్‌ను శుభ్రంగా కనీసం 3-4 సార్లు కడగాలి
  • అనంతరం హోల్స్ ఉన్న గిన్నెలో ఆ ముక్కలు వేసి వాటర్ పోయి డ్రై అయ్యే వరకు ఉండాలి
  • ఆ తర్వాత ఆ ముక్కల్లో పసుపు, కారంపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
  • పదార్థాలతో బాగా కలిపిన ముక్కల్ని కనీసం 25-30 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే.. కలర్‌ఫుల్‌గానే కాదు ఫ్రై టేస్టీగా కూడా వస్తుంది.

టేస్టీ పొడిని ప్రిపేర్

  • స్టవ్ వెలిగించుకుని దానిపై పాన్ పెట్టి... అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ మిరియాలు, నాలుగు లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అర టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫేంలో కనీసం 2 నిమిషాలు వేయించాలి.
  • ఒకవేళ పొరపాటున మంట ఎక్కువ పెడితే ఇవి మాడిపోతాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి.
  • ఆఖరిగా ఎండు మిర్చిని తుంచి అందులో వేసి ఒక నిమిషం వేయించాలి. పొరపాటున మీరు మొదట్లోనే ఎండు మిర్చి వేస్తే మాడిపోతాయి.
  • ఈ పదార్థాలన్నీ తీసుకుని కొద్దిగా రాళ్ల ఉప్పుతో కలిపి మిక్సీలో వేసి  పౌడర్‌లా కాకుండా కాస్త గరుకుగా ఉండేలా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి.

చికెన్ ఫ్రై తయారీ

  • స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. అందులో ఐదు టేబుల్ స్పూన్ నూనె వేయాలి
  • నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చీ ముక్కల్ని వేసి కనీసం 2 నిమిషాలు తక్కువ మంటతో వేయించాలి.
  • ఆ తర్వాత తాజాగా ఉన్న కరివేపాకును వేయాలి
  • చికెన్ ముక్కలను వేసి కనీసం 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి తక్కువ తక్కువ మంటతో ఓ 10 నిమిషాలు వేయించాలి.
  • మీకు అడుగంటుతున్నట్లు అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసినా ఓకే
  • చికెన్ బాగా వేగిన తర్వాత అందులో మూడు పచ్చి మిర్చీ ముక్కలు, కాస్త కరివేపాకు వేయాలి.
  • ఆ తర్వాత మనం ఆల్రెడీలో మిక్సీలో పొడి చేసిన పదార్థాల పొడిని ఈ చికెన్ ముక్కలపై వేసి వేయించాలి.
  • మంటని తక్కువగా పెట్టుకుని కనీసం 1-2 నిమిషాలు వేయిస్తే చాలు. 
  • ఆఖర్లో కొత్త మీర వేసి ఒక నిమిషం అలా వేయించి స్టవ్ ఆపేస్తే ఆంధ్రా స్టయిల్ చికెన్ ఫ్రై రెడీ.

ఈ చికెన్ ఫ్రైలో నిమ్మరసం పిండి, ఉల్లిపాయతో కలిపి తింటే.. జీవితంలో రుచిని మర్చిపోలేరు. ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా, లేదా స్పెషల్ రోజుల్లో కూడా ఈ ఫ్రైను మీరు ట్రై చేసి వారిని సర్‌ప్రైజ్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం