నిమ్మకాయ ప్రకృతి ప్రసాదించిన గొప్ప కానుకలలో ఒకటి. అయితే నిమ్మ ఆకుల్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.
By Anand Sai Oct 15, 2024
Hindustan Times Telugu
నిమ్మ ఆకులు కూడా ఆరోగ్యానికి మంచివని మీకు తెలుసా? నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
బ్లడ్ ప్రెజర్ బీపీని కంట్రోల్ చేయడంలో నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో హెర్బల్ టీ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
చర్మ సంబంధిత సమస్యల చికిత్సలో నిమ్మ ఆకులు కూడా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగితే చర్మవ్యాధులు నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారికి కూడా నిమ్మ ఆకులు చాలా ఉపయోగపడతాయి. నిమ్మ ఆకులతో చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మ ఆకు టీ ఉపయోగపడుతుంది. ఆకులను వేడి నీటిలో నానబెట్టి, ఆ నీటిని క్రమం తప్పకుండా త్రాగాలి.
నిమ్మ ఆకులను మజ్జిగలో కలుపుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యలు కూడా నిమ్మ ఆకులను తొలగిస్తాయి. నిమ్మ ఆకులను పేస్ట్‌లా చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
కొత్తి మీరను ప్రతి కూరలో వేస్తుంటాం. ఇది వంట రుచిని పెంచుతుంది. కొత్తి మీరలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కొత్తి మీర ఆకులను తాజాగా ఉంచుకునేందుకు ఈ 6 చిట్కాలు ఫాలో అవ్వండి.