తెలుగు న్యూస్ / ఫోటో /
Weight Loss Tips: పసుపును ఇలా వాడితే బరువు తగ్గుతారు.. బెల్లీ ఫ్యాట్ కూడా కనిపించకుండా పోతుంది
Weight Loss Tips: బరువు తగ్గడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. పసుపులోని కర్కుమిన్ శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.
(1 / 7)
Weight Loss Tips: పసుపును ఏళ్ల తరబడి భారతీయ వంటశాలల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పసుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బెల్లీ ఫ్యాట్, బరువు తగ్గడానికి కూడా ఉపయోగించవచ్చు.(shutterstock)
(2 / 7)
Weight Loss Tips: పసుపులోని కర్కుమిన్ కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ శరీరంలో కొవ్వు పెరగకుండా నివారిస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులను తగ్గిస్తాయి.(shutterstock)
(3 / 7)
Weight Loss Tips: బరువు తగ్గాలంటే ఒక కప్పు నీటిని మరిగించి అందులో అర టీస్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ పసుపు టీని కప్పులోకి తీసుకోవాలి. ఈ టీలో నిమ్మకాయ రసం వేసి, గ్రైండ్ చేసిన చిటికెడు నల్ల మిరియాలు కలపాలి. ఈ పసుపు టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెటబాలిజం వేగవంతం అవుతుంది. ఇది కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.(shutterstock)
(4 / 7)
Weight Loss Tips: కొవ్వును తగ్గించడంతో పాటు అనేక ఇతర వ్యాధులకు పసుపు పాలు మేలు చేస్తాయి.పసుపు పాలు తయారు చేసుకోవాలంటే ఒక కప్పు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాలు, తీపి కోసం కొద్దిగా తేనె కలపాలి. ఈ పాలను నిద్రపోయే ముందు తాగడం వల్ల శరీరం రిలాక్స్ అవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.(shutterstock)
(5 / 7)
Weight Loss Tips: పసుపు, అల్లం స్మూతీ తయారు చేయడానికి అర టీస్పూన్ పసుపు, ఒక చిన్న అల్లం ముక్క, నిమ్మరసం, ఒక కప్పు నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు కలపండి. ఈ స్మూతీ మీ రోజుకు ఆరోగ్యకరమైన ఆరంభం అని చెప్పొచ్చు. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.(shutterstock)
(6 / 7)
Weight Loss Tips: పసుపు నీళ్లు శరీరంలో మలినాలను బయటకు పంపించి వేయడం ద్వారా బరువు తగ్గడానికి ఒక సులభమైన మార్గంగా చెప్పొచ్చు. దీన్ని తయారు చేయడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ పసుపు పొడిని మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈ పసుపు నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి, జీర్ణక్రియ మెరుగుపడి కొవ్వును కరిగించుకోవచ్చు.(shutterstock)
ఇతర గ్యాలరీలు