AC Side Effects: ఎండలకు తట్టుకోలేక ఏసీలో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే మీకు ఈ చెడు ప్రభావాలు తప్పవు
22 May 2024, 10:35 IST
- AC Side Effects: ఎండలు పెరిగిపోయాయి. అందరూ ఏసీ రూముల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఎక్కువ గంటల పాటు ఏసీ రూముల్లో ఉండే వారికి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఏసీ వల్ల సైడ్ ఎఫెక్టులు
AC Side Effects: వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఎక్కువమంది ఏసీలను వాడుతున్నారు. అయితే ఏసీలో ఎక్కువ గంటల పాటు ఉండటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం తప్పదని చెబుతున్నారు నిపుణులు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండకు తట్టుకోలేక ఏసీలలో గడుపుతున్నవారు ఎక్కువమందే. వీరి ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. ఆ ప్రభావాన్ని మీరు గుర్తించలేరు కూడా. ఏసీ మీ ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావాలు చూపిస్తుందో తెలుసుకోండి.
చర్మం పొడిబారడం
ఎక్కువగా ఏసీలో ఉండే వారిలో గాలిలో తేమశాతం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం, కళ్లు పొడిబారే సమస్య మొదలవుతుంది. చర్మం పొడిగా మారడం, దురదగా అనిపించడం, చికాకుగా అనిపించడం జరుగుతుంది. అలాగే కళ్ళు కూడా పొడిగా మారి మండుతూ ఉంటాయి. చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. గదిలో తేమ తగ్గడం వల్ల ఈ అసౌకర్యం కలుగుతుంది.
కీళ్ల నొప్పులు
కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఏసీలలో ఎక్కువ సమయం ఉండకూడదు. ఎందుకంటే అవి కండరాలు ఉన్న దృఢంగా మారుస్తుంది కీళ్ల నొప్పులను ఎక్కువ చేస్తుంది. ఎలాంటి సమస్యలు లేని వారు కూడా ఏసీలు అధికంగా ఉండడం వల్ల ఆ చల్లని గాలి కండరాలను కీళ్లు దృఢంగా మారేలా చేస్తుంది. కండరాలకు కీలక రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి.
అంటువ్యాధుల ప్రమాదం
ఏసీని చాలా పరిశుభ్రంగా వాడాలి. ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. డక్ట్ తరచూ తనిఖీ చేస్తూ ఉండాలి. అందులో సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. కలుషితాలను పీల్చడం వల్ల అంటు వ్యాధులు అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
శ్వాస వ్యవస్థలో సమస్యలు
ఏసీని అధికంగా ఉపయోగించే వారికి త్వరగా దుమ్ము, ధూళి శ్వాస వ్యవస్థలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో అలెర్జీలకు కారణమవుతాయి. ఆస్తమా వంటివి త్వరగా వస్తాయి. ముఖ్యంగా శ్వాస కోసం అనారోగ్యాలతో బాధపడేవారు ఏసీలు ఎక్కువ కాలంపాటూ వాడకూడదు. వెంటిలేషన్ సరిగా లేని కారణంగా ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారణం అవుతుంది.
తలనొప్పి
ఏసీ రూమ్‌లో ఎక్కువ గంటల పాటు గడపడం వలన తలనొప్పి, అలసట వంటివి వస్తాయి. ఇక్కడే ఉంటే చల్లటి గాలి రక్తనాళాలను బిగుసుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల మెదుడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. తలనొప్పి రావడం మొదలవుతుంది. అంతేకాదు వ్యక్తులు త్వరగా అలసిపోయినట్టు ఫీల్ అవుతారు. ఏ పని చేయకపోయినా కూడా వారిలో తీవ్ర అలసట కనిపిస్తుంది.
ఏసీ ఉపయోగించేవారు మరీ చల్లగా ఉండేలా ఉష్ణోగ్రతను పెట్టుకోకండి. ఒక మోస్తరు ఉష్ణోగ్రత ఉండేలా చేసుకోండి. 26 ఉష్ణోగ్రత పెట్టుకోవడం మంచిది. అంతకన్నా తగ్గితే మాత్రం వాతావరణం పొడిగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు ఏసీలోని ఫిల్టర్లను క్లీన్ చేస్తూ ఉండండి. ఏసీలో ఉన్నా కూడా కచ్చితంగా నీటిని తాగుతూ ఉండండి.
టాపిక్