తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sitaphal Kheer: టేస్టీ సీతాఫలం పాయసం, ఇది చలికాలంలో తినాల్సిన స్వీట్ రెసిపీ

Sitaphal Kheer: టేస్టీ సీతాఫలం పాయసం, ఇది చలికాలంలో తినాల్సిన స్వీట్ రెసిపీ

Haritha Chappa HT Telugu

28 November 2024, 17:30 IST

google News
    • Sitaphal Kheer: సీతాఫలాలు చలికాలంలోనే అధికంగా దొరుకుతాయి. ఈ సీతాఫలాలతో ఒకసారి పాయసం చేసి చూడండి... ఎంత టేస్టీగా ఉంటుందో.
సీతాఫలం పాయసం రెసిపీ
సీతాఫలం పాయసం రెసిపీ

సీతాఫలం పాయసం రెసిపీ

సీతాఫలాలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. మెత్తటి గుజ్జుతో ఉండే ఈ సీతాఫలాలను ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. చలికాలంలోనే సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. వీటిని సీజనల్ ఫ్రూట్ గా చెప్పుకోవచ్చు. సీజనల్ ఫ్రూట్స్ కూరగాయలు కచ్చితంగా ఆయా సీజన్లలో తినాల్సిందే. చలికాలంలో దొరికే సీతాఫలంతో పాయసాన్ని తయారు చేయండి. ఇది ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. ఒక్కసారి చేశారంటే ఇది ఎంత సులువు మీకే అర్థమవుతుంది. శీతాకాలంలోనే స్వీట్ రెసిపీ మన జిహ్వ చాపల్యాన్ని తీర్చుతుంది.

సీతాఫలం పాయసం రెసిపీకి కావాల్సిన పదార్థాలు

సీతాఫలాలు - రెండు

పాలు - అర లీటరు

పంచదార - నాలుగు స్పూన్లు

కుంకుమపువ్వు - నాలుగు రేకులు

బాదం తరుగు - రెండు స్పూన్లు

యాలకుల పొడి - చిటికెడు

సగ్గుబియ్యం - అరకప్పు

నెయ్యి - ఒక స్పూను

సీతాఫలం పాయసం రెసిపీ

1. సీతాఫలంలోని తెల్ల గుజ్జును వేరుచేసి పక్కన పెట్టుకోవాలి. సీడ్స్ ని తీసి బయట పడేయాలి.

2. అలాగే సగ్గుబియ్యాన్ని వేడి వేడి నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యి వేయాలి.

4. ఆ నెయ్యిలో బాదం తరుగును వేసి రంగు మారే వరకు వేయించాలి.

5. ఇప్పుడు అందులోనే వేడి నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసివేయాలి.

6. ఒకసారి కలుపుకొని అర లీటర్ పాలను కూడా వేసి బాగా కలపాలి.

7. చిన్న మంట మీద ఈ మొత్తం మిశ్రమాన్ని ఉడికించాలి.

8. ఈ మిశ్రమం కాస్త చిక్కగా అవుతున్నప్పుడు పంచదారని వేసి బాగా కలుపుకోవాలి.

9. అందులోనే యాలకుల పొడి, కుంకుమ పువ్వులు కూడా వేసి బాగా కలపాలి.

10. ఆ తర్వాత సీతాఫలం గుజ్జును అందులో వేసి గరిటెతో మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి.

11. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని చల్లారాక తింటే రుచి అదిరిపోతుంది.

12. ఈ సీతాఫలం పాయసం ఎంతో రుచిగా ఉంటుంది.

13. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది. అతిధులు వచ్చినప్పుడు వండి వడ్డించండి. వారికి ఇది కొత్త రుచిని తెలియజేస్తుంది.

సీజనల్ ఫ్రూట్ అయినా సీతాఫలం చలికాలంలోనే ఎక్కువగా కాస్తుంది. కాబట్టి దీన్ని కచ్చితంగా తినాలి. దీనిలో చలికాలంలో మనల్ని కాపాడే పోషకాలు ఉంటాయి. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను నియంత్రిస్తుంది. మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది. చలికాలంలో ఏదైనా ఆహారం జీర్ణం అవడం కష్టంగా ఉంటుంది. అందుకే సీజనల్ ఫ్రూట్ అయినా సీతాఫలం తింటే ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది. అలాగే పొట్టలోని గట్ బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడేందుకు కూడా ఇది సహాయపడుతుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఏ ఆహారం తిన్న అందులోని పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. కాబట్టి సీతాఫలాలను ఆహారంలో భాగం చేసుకోండి.

తదుపరి వ్యాసం