SagguBiyyam Pakodi: సాయంత్రం స్నాక్ గా సగ్గుబియ్యం పకోడీలు, క్రంచీగా నోరూరిస్తా
19 April 2024, 15:30 IST
- SagguBiyyam Pakodi: ఆరోగ్యకరమైన ఆహారం సగ్గుబియ్యాన్ని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చు. దీంతో ఒకసారి పకోడీ చేసి చూడండి. ఈ రెసిపీ చాలా సులువు.
సగ్గుబియ్యం పకోడీ
SagguBiyyam Pakodi: సగ్గుబియ్యాన్ని వాడే వారి సంఖ్య తక్కువే. దీంతో ఏం వండాలో నేటి యువతకు తెలియక వాటి వాడకాన్ని తగ్గించారు. నిజానికి సగ్గుబియ్యంతో అనేక టేస్టీ వంటకాలు చేసుకోవచ్చు. దీంతో సగ్గుబియ్యం పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చెప్పాము. సాయంత్రం పూట స్నాక్‌గా వీటిని వండుకొని చూడండి. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతాయి. వీటిని చేయడం చాలా సులువు.
సగ్గుబియ్యం పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం - ఒక కప్పు
పెరుగు - అర కప్పు
ఉల్లిపాయలు - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
కరివేపాకులు తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నీళ్లు - అరకప్పు
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
జీలకర్ర - అర స్పూను
సగ్గుబియ్యం పకోడీ రెసిపీ
1. సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలో పెరుగు, నీళ్లు వేసి నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి.
3. అవి మెత్తగా నానాక అదనపు నీటిని తీసేయాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి.
6. నూనె వేడెక్కాక ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
7. వాటిని తీసి టిష్యూ పేపర్ పై వేసుకోవాలి. టిష్యూ పేపర్ అదనపు నూనెను పీల్చేస్తుంది.
8. అంతే టేస్టీ సగ్గుబియ్యం పకోడీ రెడీ అయినట్టే.
9. సాధారణ పకోడీతో పోలిస్తే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.
10. ఒక్కసారి వీటిని చేసుకుని చూడండి. ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం.
సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. సగ్గుబియ్యంలో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం శరీరానికి అందే కేలరీలు కూడా తక్కువగాన ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవే.