తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vegetable Haleem । వెజిటెబుల్ మిల్లెట్ హాలీమ్.. మాంసం తినని వారికి శాకాహార రెసిపీ!

Vegetable Haleem । వెజిటెబుల్ మిల్లెట్ హాలీమ్.. మాంసం తినని వారికి శాకాహార రెసిపీ!

HT Telugu Desk HT Telugu

14 April 2023, 19:30 IST

google News
    • Vegetable Haleem Recipe: మీకు హలీమ్ తినాలని ఉన్నా, మాంసాహారం తినడం ఇష్టం లేదా? అయితే ఇక్కడ ప్రముఖ చెఫ్ అందించిన శాకాహార హలీమ్ రెసిపీ ఉంది చూడండి.
Vegetable Haleem Recipe
Vegetable Haleem Recipe (Unsplash)

Vegetable Haleem Recipe

Ramadan 2023 Recipes: ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతుంది, ఈ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉన్న అందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. ఉదయం సూర్యోదయానికి ముందు ఉపవాసం ఉంటారు, మళ్లీ సూర్యస్తమయం తర్వాతే ఉపవాసం విడిచి ఆహారం భుజిస్తారు. ఈ రంజాన్ మాసంలో ప్రతీరోజు సాయంత్రం ఇఫ్తార్ విందుతో తమ ఉపవాసం విడుస్తారు. ఈ సమయంలో మంచి బలవర్థకమైన ఆహారాన్ని తీసుకుంటారు.

రంజాన్ నెలలో అందరికీ అనేక రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీచోటా హలీమ్ వంటకాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తారు. సాధారణంగా హలీమ్ అనేది మాంసాహార వంటకం. చికెన్, మటన్ మొదలైన మాంసాలకు గోధుమ ధాన్యాలను కలిపి దీనిని వండుతారు. అయితే మీరు మాంసంతో చేసే హలీమ్ ఇష్టపడకపోతే శాకాహార హలీమ్ కూడా తినొచ్చు. ITC హోటెల్స్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ మనీషా భాసిన్ శాకాహార హలీమ్ రెసిపీని HT లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు. ఈ హలీమ్ రెసిపీని మరింత ఆరోగ్యకరంగా మార్చేందుకు దీనిలో గోధుమలకు బదులుగా మిల్లెట్లని ఉపయోగించారు. ఈ మిల్లెట్లు గ్లూటెన్ రహితమైనవే కాకుండా ఫైబర్, ప్రోటీన్ , ఇతర ముఖ్యమైన పోషకాలను సమృద్ధిగా ఉంటాయి, మంచి శక్తిని అందిస్తాయి. ఇఫ్తార్‌కు ఇది కచ్చితంగా అనువైన ఆహారం. మీరు ఈ మిల్లెట్ వెజ్ హలీమ్ రుచి చూడాలనుకుంటే ఈ కింద రెసిపీ ఇచ్చాం, చూడండి.

Vegetable Millet Haleem Recipe కోసం కావలసినవి

  • జొన్న మిల్లెట్ (జొన్నలు) 1 కప్పు
  • పనసకాయ: 2 కప్పులు
  • మినపపప్పు ¼ కప్పు
  • శనగపప్పు: ¼ కప్పు
  • నీరు: 5 కప్పులు
  • పాలు: 3 కప్పులు
  • పసుపు పొడి: ½ tsp
  • జీలకర్ర: ¼ tsp
  • అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
  • కారం: 1 tsp
  • ధనియాల పొడి : ½ tsp
  • మొత్తం గరం మసాలా: 1 tsp
  • జీడిపప్పు: ½ కప్పు
  • వేయించిన ఉల్లిపాయ ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు
  • నూనె: 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు
  • రుచికి తగినంత ఉప్పు

శాకాహార మిల్లెట్ హలీమ్ తయారీ విధానం

తయారీకి ముందు జొన్నలను అలాగే పప్పు ధాన్యాలను కడిగి వేర్వేరుగా నానబెట్టండి

1. ముందుగా జాక్‌ఫ్రూట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి మెరినేట్ చేయండి.

2. అనంతరం మెరినేట్ చేసిన జాక్‌ఫ్రూట్‌ను మీడియం మంటపై నూనెలో ఉడికినంత వరకు వేయించాలి.

3. ఇప్పుడు ఒక పాన్‌లో నీరు, పాలు, ఇతర మసాలా దినుసులు, నానబెట్టిన పప్పులు, జొన్నలు వేసి ఉడికించాలి.

4. జీడిపప్పు కూడా వేయండి, నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు ఉడికించాలి. ఆనంతరం ఈ మిశ్రమాన్ని మందపాటి పేస్ట్‌గా రుబ్బుకోవాలి.

6. మరొక లాగాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించండి, ఉడికించిన పప్పు మిల్లెట్ పేస్ట్ జోడించండి.

7. మసాలా పొడులను వేసి రుచిని సర్దుబాటు చేయండి, మిశ్రమం చిక్కగా మారేలా పాలు కలిపి చిన్న మంటపై ఉడికించాలి.

8. చివరగా వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి కలపండి. వంటకం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.

అంతే వెజ్ హలీమ్ రెడీ. పైనుంచి వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పుదీనా, తరిగిన పచ్చిమిర్చి, నిమ్మకాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయండి.

తదుపరి వ్యాసం