తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pineapple For Hairs : ఈ పైనాపిల్ హెయిర్ మాస్క్‌లతో జుట్టు రాలదు..

Pineapple For Hairs : ఈ పైనాపిల్ హెయిర్ మాస్క్‌లతో జుట్టు రాలదు..

HT Telugu Desk HT Telugu

10 April 2023, 14:00 IST

google News
    • Pineapple Hair Mask : జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి అనేది చాలా మందికి అర్థం కాదు. కొందరు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు ప్రయత్నించినా జుట్టు రాలడం తగ్గదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించాలి.
పైనాపిల్ హెయిర్ మాస్క్‌
పైనాపిల్ హెయిర్ మాస్క్‌

పైనాపిల్ హెయిర్ మాస్క్‌

కొన్నిసార్లు ఖరీదైన షాంపూలు, కండిషనర్ల కంటే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మన జుట్టును ఆరోగ్యంగా(hair health) ఉంచుకోవచ్చు. మీరు పైనాపిల్‌ను హెయిర్ మాస్క్‌(Pineapple hair Mask)గా ఉపయోగించారా? దీన్ని ప్రయత్నించండి. మీ జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

జుట్టు పెరుగుదలకు(Hair Growth) పైనాపిల్ హెయిర్ మాస్క్ ఆరోగ్యకరమైనదిగా ఉంటుంది. వెంట్రుకలు తగ్గితే ముఖం ఎంత అందంగా ఉన్నా.. వెంట్రుకలు ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. జుట్టు రాలినప్పుడు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి.. జుట్టు సమస్యల(Hair Problems) నుంచి బయటపడొచ్చు. అందుకోసం పైనాపిల్ ను వాడండి.

పైనాపిల్ మాస్క్ కావలసినవి ఏంటో తెలుసుకోండి. కప్పు పైనాపిల్ రసం, 1 చెంచా తేనె, 2 చెంచాల కొబ్బరి నూనె/ నువ్వుల నూనె/ పటిక నూనె.. ఈ మూడు పదార్థాలను కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, పైనాపిల్ వాటర్ నుదుటిపై పడకుండా షవర్ క్యాప్ ఉపయోగించండి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టు(Hair)ను కడగాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. ఇలా చేస్తే మీ జుట్టు అందంగా తయారవుతుంది. జుట్టు రాలదు(Hair Loss), జుట్టు పెరుగుతుంది. ఇంకోలా కూడా పైనాపిల్ ను ఉపయోగించుకోవచ్చు.

ఇంకో పైనాపిల్ హెయిర్ మాస్క్ ను తయారు చేయండి. మీరు ఈ హెయిర్ మాస్క్‌(Hair Mask)ని ఉపయోగించిన 2-3 నెలల్లో ఫలితాలను చూస్తారు. కావలసినవి 1 కప్పు పైనాపిల్ రసం, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా పటిక నూనె, 4-5 చుక్కల ద్రాక్షపండు నూనె.., వీటిని మిక్స్ చేసి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడాన్ని కూడా అరికట్టవచ్చు.

మూడో చిట్కాతోనూ ఫలితం బాగుంటుంది. జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. ఈ పైనాపిల్ హెయిర్ మాస్క్ తయారుచేసేందుకు పైనాపిల్స్ 1 కప్పు, పెరుగు 2 చెంచాలు, నూనె 2 చెంచాలు తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి తలకు పట్టిస్తే జుట్టు మూలాలు బలపడతాయి. తద్వారా జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరుగుతుంది.

ఎక్కువ కాలం ఒత్తిడి అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు వస్తాయి. ఈ కారణంగా మీ జుట్టు(Hair)పై ప్రభావం ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను చూస్తారు. క్రమక్రమంగా వెంట్రుకలు(Hairs) తెల్లబడటం మెుదలవుతుంది. ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.

రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం వలన కూడా జుట్టు సమస్యలు(Hair Problems) వస్తాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌(Hair Products)లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

తదుపరి వ్యాసం