Parenting Tips : పిల్లల ముందు తల్లిదండ్రులు బట్టలు అస్సలు మార్చుకోవద్దు.. ఇదిగో అసలు నిజాలు
01 June 2024, 18:30 IST
- Parenting Tips : చిన్న పిల్లలే కదా అని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందే బట్టలు మార్చుకుంటారు. కానీ ఇది వారి మనసులో వేరేలాగా స్థిరపడుతుంది. వారికి కూడా ఈ విషయం క్రమశిక్షణగా నేర్పించాలి. బట్టలు మార్చుకునేందుకు వేరే గదిలోకి వెళ్లాలి అని అలవాటు చేయాలి.
తల్లిదండ్రులకు చిట్కాలు
తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఏదైనా ఉత్తమమైనదాన్ని అందించాలని కోరుకుంటారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడాలంటే ఏం చేయాలనే విషయంలో తల్లిదండ్రులకు ఆందోళన ఉండటం సహజం. పిల్లవాడు మంచి వ్యక్తిగా ఎదగడానికి కొన్ని విషయాలు సహాయపడతాయి. పిల్లల ముందు చేయకూడనివి కొన్ని ఉన్నాయి. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి ప్రవర్తన చేయకూడదో తెలుసుకోండి.
ఆరోగ్యకరమైన సరిహద్దులను సృష్టించడం, గోప్యత, ఇతరుల సరిహద్దులను గౌరవించడం గురించి చిన్న వయస్సు నుండి పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. శిశువుల ముందు బట్టలు మార్చుకోవడం అనేది సరైనది కాదు అనేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
బట్టలు మార్చడం
పిల్లల ముందు బట్టలు మార్చడం అంటే వారు వేరేలాగా అర్థం చేసుకుంటారు. ఎంత చిన్నవయసులో ఉన్నా ఇతరుల ముందు బట్టలు మార్చకూడదు అని వారికి నేర్పించాలి. పిల్లలు దాదాపు 2 సంవత్సరాల వయస్సు నుండి వారి పరిసరాలను అర్థం చేసుకోవడం, చూసే వాటిని అనుసరించడం ప్రారంభిస్తారు. చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి మీ శిశువు ముందు బట్టలు మార్చడం మానేయండి.
గోప్యత పట్ల గౌరవం
పిల్లలకు గోప్యత ప్రాముఖ్యతను నేర్చుకోవాలి. ఇతరుల గోప్యతను గౌరవించాలి. ప్రైవేట్ ప్రాంతాల్లో బట్టలు మార్చడం ద్వారా, మీరు వ్యక్తిగత స్థలం, గోప్యత విలువను ప్రదర్శించినట్టుగా వారికి అర్థం అవుతుంది. వారు కూడా అదే ఫాలో అవుతారు.
శరీరం గురించి అవగాహన
బట్టలు మార్చుకునేటప్పుడు వేరే గదిలోకి వెళ్లడం ద్వారా పిల్లలకు వారి శరీరం గురించి అవగాహన వస్తుంది. ఇతరులకు శరీరాన్ని చూపించకూడదు అని నేర్చుకుంటారు. శరీరాన్ని ఎవరు, ఎప్పుడు చూడకుండా ఉండాలని వారు అర్థం చేసుకుంటారు.
గందరగోళం
పెద్దలు తమ ముందు బట్టలు మార్చుకోవడాన్ని చూసినప్పుడు చిన్నపిల్లలు గందరగోళంగా, అసౌకర్యంగా భావించవచ్చు. బయటకు వెళ్లాలా.. లేదంటే అక్కడే ఉండాలా అనేది వారికి అర్థంకాకపోవచ్చు. అదే మీరు వేరే గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటే.. స్పష్టమైన సరిహద్దును గీసిన వారు అవుతారు. ఇది గందరగోళం లేదా అసౌకర్యాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
సరిహద్దులు అర్థమవుతాయి
బట్టలు మార్చుకోవడం అంశంపై సరిహద్దులను సెట్ చేయాలి. దీని వలన పిల్లలు కొన్ని ప్రవర్తనలు ప్రైవేట్‌గా ఉంటాయని, పబ్లిక్‌గా ఉండవని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
ప్రత్యామ్నాయ మార్గాలు
పిల్లలు లేని బెడ్‌రూమ్ లేదా బాత్రూమ్ వంటి ప్రైవేట్ ప్రాంతంలో బట్టలు మార్చుకోవడానికి ఎంచుకోండి.
బట్టలు మార్చుకునేటప్పుడు పెద్దలకు గోప్యత అవసరమని పిల్లలకు వివరించండి. మీరు కూడా అలానే చేయమని వారిని ప్రోత్సహించండి.
పిల్లలకు గోప్యత, ఇతరుల సరిహద్దుల పట్ల గౌరవం నేర్పడం వారి సామాజిక, భావోద్వేగ అభివృద్ధికి చాలా అవసరం. తగిన ప్రవర్తన ఎలా ఉండాలో వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. తద్వారా చిన్న వయస్సు నుండే ముఖ్యమైన అంశాలను నేర్చుకోవడంలో పిల్లలకు ఈ విషయాలు సహాయపడతాయి.
ఇలాంటివి చిన్న విషయాలే కదా అని చాలా మంది తల్లిదండ్రులు లైట్ తీసుకుంటారు. కానీ పిల్లల ఎదుగుదలలో ఇలాంటి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. వారి ఆలోచన విధానాలను సరిగా ఉంచేందుకు తప్పకుండా పైన చెప్పిన విషయాన్ని తల్లిదండ్రులు పాటించాలి.