తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Paratha: ఆలూ పాలక్ పరోటా రెసిపీ ఇది, చాలా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇలా చేసేయండి

Palak Paratha: ఆలూ పాలక్ పరోటా రెసిపీ ఇది, చాలా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu

17 June 2024, 6:00 IST

google News
    • Palak Paratha: చపాతీల కన్నా కూరగాయలు వేసి పరాటాలు చేయడమే ఆరోగ్యకరం. పిల్లలకు పొట్ట నింపుగా కూరగాయలు కూడా చేరుతాయి. ఇక్కడ మేము ఆలూ పాలక్ పరాటా రెసిపీ ఇచ్చాము.
పాలక్ పరాటా రెసిపీ
పాలక్ పరాటా రెసిపీ

పాలక్ పరాటా రెసిపీ

Palak Paratha: చపాతీలైనా, పరాటా అయినా గోధుమ పిండితో చేస్తారు. అయితే పరాటాలో అదనంగా కూరగాయలను లేదా బంగాళాదుంపల వంటి వాటిని జతచేరుస్తారు. ఇక్కడ మేము ఆలూ పాలక్ పరాటా రెసిపీ ఇచ్చాము. అంటే బంగాళదుంప పాలకూరతో చేసే పరాటా రిసిపి ఇది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల ఎక్కువ కాలం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎలా చేయాలో తెలుసుకోండి.

ఆలూ పాలక్ పరాటా రెసిపీకి కావలసిన పదార్థాలు

గోధుమపిండి - ఒకటిన్నర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నెయ్యి - రెండు స్పూన్లు

నీరు - తగినంత

బంగాళదుంపలు - రెండు

పాలకూర తరుగు - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

కారం - ఒక స్పూను

చాట్ మసాలా - ఒక స్పూను

ఆమ్చూర్ పౌడర్ - ఒక స్పూన్

బటర్ - ఒక స్పూన్

ఆలూ పాలక్ పరాటా రెసిపీ

1. బంగాళాదుంపలను బాగా ఉడకబెట్టి చేతితోనే మెదిపి పక్కన పెట్టుకోవాలి.

2. గోధుమపిండిని చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక వెల్లుల్లి వేసి రంగు మారేవరకు వేయించుకోవాలి.

5. అందులోనే తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.

6. మూత పెట్టి ఉడికించుకోవాలి. నీరంతా ఆవిరయ్యేదాకా ఉడికించాలి.

7. అందులోనే చాట్ మసాలా, బంగాళాదుంపలను వేసి బాగా కలుపుకోవాలి.

8. అది మెత్తటి విశ్రమంలాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.

9. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని చేతితోనే కొద్దీ ఒత్తుకోవాలి.

10. మధ్యలో ఒక స్పూను బంగాళదుంప పాలకూర మిశ్రమాన్ని పెట్టి ఆ చపాతీని మడత పెట్టేయాలి.

11. పరోటాలా ఒత్తుకొని స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి పరోటాను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.

12. అంతే టేస్టీ ఆలూ పాలక్ పరాటా రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

13. దీన్ని పిల్లలకు పెట్టడం వల్ల వారికి పాలకూరలోని పోషకాలు, బంగాళాదుంపలను పోషకాలు కూడా చేరుతాయి.

14. సాధారణ చపాతీ కన్నా ఇలా కూరగాయలు కలిసిన పరాటాలు ఆరోగ్యానికి మంచిది.

పరాటాలు చేయడం చాలా సులువు కానీ ఎంతో మంది కష్టమని అనుకుంటారు. ఒకసారి చేసి చూడండి మీకు చాలా సులువుగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

తదుపరి వ్యాసం