Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు-carrot paratha recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

Haritha Chappa HT Telugu

Carrot Paratha: అల్పాహారంలో క్యారెట్ పరాటా మంచి బలవర్ధకమైన ఆహారం. ఈ రెసిపీ చేయడం కూడా సులువు. పోషకాలు నిండిన ఈ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్యారెట్ పరాటాలు ఒకసారి ప్రయత్నించి చూడండి.

క్యారెట్ పరాటా రెసిపీ

Carrot Paratha: క్యారెట్ పరాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన అల్పాహార వంటకాలలో ఇది ఒకటి. దీన్ని చేయడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. పిల్లలు, పెద్దలు... ఇద్దరూ ఇష్టంగా దీన్ని తింటారు.ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి అత్యవసరం.

క్యారెట్ పరాటా రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యారెట్ తురుము - రెండు కప్పులు

గోధుమపిండి - నాలుగు కప్పులు

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపడినంత

కొత్తిమీర తరుగు - అరకప్పు

అల్లం తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ తరుగు - అరకప్పు

పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను

నెయ్యి - తగినంత

క్యారెట్ పరాటా రెసిపీ

1. క్యారెట్లు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర... అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో గోధుమపిండి వెయ్యాలి.

3. రుచికి సరిపడా ఉప్పును కలుపుకోవాలి.

4. ఇప్పుడు తురిమిన క్యారెట్లు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

5. అలాగే నీరు కలిపి చపాతీ పిండిలా వచ్చేలా కలుపుకోవాలి.

6. ఇప్పుడు ఈ మిశ్రమం నుండి చిన్న భాగాన్ని తీసుకొని గుండ్రంగా బంతిలా చేసి ఒత్తుకోవాలి.

7. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి.

8. నెయ్యి వేడెక్కాక ఒత్తుకున్న చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి.

9. అంతే క్యారెట్ పరాటా రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

క్యారెట్ ను తరచూ తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకునే శక్తి క్యారెట్ కు ఉంది. అలాగే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ దీనిలో పుష్కలంగా ఉంటుంది. క్యారెట్‌ని ప్రతిరోజు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు కంటిచూపు మెరుగవుతుంది. ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు వంటివి కూడా తగ్గుతాయి. కాబట్టి క్యారెట్‌ను ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది.