తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oral Sex Safety Tips । ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్.. సురక్షిత మార్గాలు ఇవిగో!

Oral Sex Safety Tips । ఓరల్ సెక్స్‌తో గొంతు క్యాన్సర్.. సురక్షిత మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

02 May 2023, 21:35 IST

    • Oral Sex Safety Tips: ఓరల్ సెక్స్ సమయంలో నోటిలోకి వచ్చిన ద్రవాలను ఉమ్మివేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆడవారైన, మగవారైనా ఎలాంటి సులభమైన సురక్షిత విధానాలను అవలబించాలో చూడండి.
Oral Sex can cause throat cancer
Oral Sex can cause throat cancer (istock)

Oral Sex can cause throat cancer

Oral Sex Safety Tips: శృంగారం సంతృప్తిగా సాగటానికి అనేక మార్గాలు ఉన్నాయి, శృంగారం చేయడం వలన ఒత్తిడి తగ్గటం మొదలుకొని, అనుబంధం బలపడటం వరకు అనేక సామాజిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సురక్షిత మార్గంలో శృంగారం చేయడం ఇక్కడ కీలకం. ఆరోగ్యకరమైన సెక్స్ లైఫ్ ఉండాలంటే అసురక్షితమైన, అసహజమైన శృంగారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఓరల్ సెక్స్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓరల్ సెక్స్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే సమయంలో లైంగిక సంక్రమణ వ్యాధుల (Sexually Transmitted Diseases) ముప్పు పొంచి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

New Broom Tips : కొత్త చీపురుతో ఇంట్లోకి దుమ్ము రావొచ్చు.. అందుకోసం సింపుల్ టిప్స్

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

ఓరల్ సెక్స్ చేసేటపుడు పురుషుడు లేదా స్త్రీ తన భాగస్వామి జననావయవాలను నోటితో చూషించే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో వీర్యం, యోని ద్రవాలు, రక్తం, మూత్రం, మలం, చనుబాలు మొదలైన ద్రవాలన్ని నోటి గుండా వెళ్తుంటాయి. ఇది ఒకరి నుండి మరొకరికి సంక్రమించే లైంగిక అంటువ్యాధులు (STIలు) సంక్రమించటానికి కారణం అవుతుంది. హెర్పెస్, గోనేరియా, క్లామిడియా, సిఫిలిస్, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వంటి లైంగిక వ్యాధులను కలిగించే ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియాలు ఇరువురి శరీరాలలోకి మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది.

ఓరల్ సెక్స్ (Oral Sex) ఇప్పుడు గొంతు క్యాన్సర్‌కు (Throat Cancer) ప్రధాన ప్రమాద కారకంగా ఉంది. కొన్ని దేశాల్లో ధూమపానం, మద్యపానంతో సంభవించే క్యాన్సర్ రకాల కంటే ఓరల్ సెక్స్ చేయడం వలన సోకిన క్యాన్సర్ కేసులే ఎక్కువ ఉన్నాయి. UKలోని టాన్సిల్స్ కోసం శస్త్ర చికిత్స చేసుకున్న 80 శాతం మంది తమ జీవితంలో ఓరల్ సెక్స్‌ను ఎక్కువగా అభ్యసించిన వారే. బాధితుల్లో ఎక్కువగా స్త్రీలు ఉండటం గమనార్హం. ఈ భయంకరమైన ధోరణి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV)తో ముడిపడి ఉంది, ఇది గర్భాశయ క్యాన్సర్‌కు కూడా ప్రధాన కారణం.

గర్భాశయ క్యాన్సర్‌ను (cervical cancer in women) నివారించడానికి చాలా దేశాల్లో యువతులకు HPV టీకాను వేస్తున్నారు. నోటిలో HPV సంక్రమణను నివారించడంలో కూడా ఈ టీకా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతున్నారు. యూకె, ఆస్ట్రేలియా, యూఎస్‌తో సహా అనేక దేశాలలో స్త్రీ, పురుషులకు HPV టీకాను సిఫారసు చేస్తున్నారు. అయినప్పటికీ సురక్షిత విధానాలలో నోటి సెక్స్ చేయడమే సమర్థవంతమైన మార్గంగా చెబుతున్నారు. నోటిసెక్స్ చేయడానికి సురక్షితమైన మార్గాలు ఏమిటో ఇక్కడ చూడండి.

Tips for Safe Oral Sex- Men and Women- సురక్షితమైన మార్గాలు

ఓరల్ సెక్స్ సమయంలో నోటిలోకి వచ్చిన ద్రవాలను ఉమ్మివేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది లైంగిక సంక్రమణకు అడ్డుకట్టవేయదు. శృంగారంలో 'కిందకు' వెళ్లేముందు ఆడవారైన, మగవారైనా ఎలాంటి సులభమైన సురక్షిత విధానాలను అవలబించాలో చూడండి.

కండోమ్ వాడకం: స్త్రీ ఓరల్ సెక్స్ సమయంలో పురుషుడు కండోమ్ ధరించాలి, తద్వారా స్త్రీ శరీరంలోకి మగవారి ద్రవాలు ప్రవేశించే ప్రమాదం ఉండదు. ఇది ఇరువురికి సురక్షితమైన మార్గం. ఇప్పుడు కండోమ్ లలో చాలా రకాల ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎంచుకొని ఆ ఫ్లేవర్ ను ఆస్వాదించవచ్చు.

లాటెక్స్ కవచం: దీనిని డెంటల్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఇది సన్నని షీట్‌లో తయారు చేసిన రబ్బరు పాలు వంటి పదార్థం. స్త్రీ తన యోని లేదా పాయువుపై ఉపయోగించవచ్చు. ఇది ధరించడం వలన పురుషుడి నాలుక, స్త్రీ జననేంద్రియాల మధ్య సన్నని అడ్డంకిని సృష్టిస్తుంది. అందువల్ల, లైంగికంగా సంక్రమించే వ్యాధుల బారిన పడే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

నోటి సెక్స్‌లో పాల్గొనే ముందు సరైన రక్షణను ఉపయోగించడం, పరిశుభ్రతను పాటించడం మంచిది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడానికి సందేహించకండి.

తదుపరి వ్యాసం