తెలుగు న్యూస్  /  Lifestyle  /  Make Your Children Healthy And Strong, Here Are The Best Iron-rich Food

Iron-Rich Food । పిల్లలు బలహీనంగా ఉన్నారంటే ఐరన్ లోపం కావచ్చు, ఇవి తినిపించండి!

HT Telugu Desk HT Telugu

01 December 2022, 15:03 IST

    • Iron-Rich Food for Children: పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, అన్నింటిని ఏరుకుంటూ తింటారు. కాబట్టి వారిలో ఐరన్ లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి.
Iron-Rich Food for kids
Iron-Rich Food for kids (Unsplash)

Iron-Rich Food for kids

పిల్లలు పెరిగేకొద్దీ వారి ఎదుగుదలకు శరీరానికి ఇనుము అవసరం. పిల్లలు వారి ఆహారంలో తగినంత మొత్తంలో ఐరన్ తీసుకోవాలి. ఐరన్ లోపం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది. ఫలితంగా ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను తగ్గిస్తుంది. ఇది క్రమంగా రక్తహీనత వంటి ప్రమాదకరమైన వ్యాధిగా మారే అవకాశం ఉంది, ఇది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా తమ శరీరంలో సరైన మోతాదులో ఐరన్ ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఇరన్ లోపం వల్ల పిల్లల్లో (Iron Deficiency in Children) ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇక్కడ చూడండి.

ఎదుగుదల కుంటుపడుతుంది

శరీర ఎదుగుదలకు ఇనుము ఒక ముఖ్యమైన మూలకం. ఇది బలమైన ఎముకలు, కండరాల సరైన అభివృద్ధికి సహాయపడుతుంది. పిల్లలలో ఐరన్ లోపం వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఎనీమియాకు కారణమవుతుంది.

రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది

పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలతో కూడిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. మెరుగైన రోగనిరోధక శక్తి, వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. పిల్లల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి ఇనుము లోపం కారణం. ఇది పిల్లలకు జలుబు లేదా ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

మానసిక ఎదుగుదల తగ్గుతుంది

పిల్లల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసానికి ఇనుము చాలా ముఖ్యం. ఐరన్ లోపం పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిల్లలు ఏకాగ్రత కోల్పోవడంతోపాటు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఇది వారిలో నైపుణ్యాల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది.

అయితే పిల్లల ఆహారంలో ఐరన్ ఎంత మోతాదులో ఉండాలి? వారిలో ఇనుము లోపం తలెత్తకుండా ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలో తెలుసుకుందాం.

హెల్త్ రిపోర్ట్స్ ప్రకారం, 6 నెలల వరకు శిశువులు తమ తల్లి పాల ద్వారానే ఇనుము పొందుతారు. కాబట్టి తల్లి సరైన పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. 1 నుంచి 3 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రతిరోజూ 7 మిల్లీగ్రాముల ఇనుము అవసరం, 4 నుండి 8 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 10 mg ఇనుము అవసరం. 9 నుండి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 8 మి.గ్రా అలాగే 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు 40 మిల్లీ గ్రాములు ఇనుము అవసరం అవుతుంది.

Iron-Rich Food.. ఇనుము ఎక్కువగా లభించే ఆహారాలు

ఇరన్ సమృద్దిగా లభించే ఆహార పదార్థాలు అందివ్వడం ద్వారా పిల్లల్లో ఐరన్ లోపం తలెత్తదు. అవేమిటో ఇక్కడ చూడండి.

ఆకుకూరలు: పిల్లలు ఆహారంలో అన్ని సీజనల్ పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. పాలకూర, మెంతికూర, బ్రకోలీ వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఆహారం కోసం ఇది మంచి ఎంపిక.

మాంసాహారం: ఎర్ర మాంసం, మటన్ లివర్, చేపలు మొదలైనవి ఇనుముకు ఉత్తమ వనరులు. పిల్లల ఆహారంలో ఇనుమును పెంచడానికి రెడ్ మీట్ మంచి ఎంపిక. డాక్టర్ల సలహా మేరకు ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వవచ్చు.

డ్రైఫ్రూట్స్- నట్స్: ఖర్జూర పండ్లు, గుమ్మడి గింజలు, చిక్కుళ్లలో మొదలైన డ్రై ఫ్రూట్స్, నట్స్ లలో ఇరన్ సమృద్ధిగా లభిస్తుంది. స్వచ్ఛమైన 100 శాతం డార్క్ చాక్లెట్ కూడా ఐరన్ కు మంచి మూలం. అయితే ఇవి పిల్లలకు తినిపేంచేపుడు జాగ్రత్త వారి గొంతులో చిక్కుకోవచ్చు. చిన్నచిన్న ముక్కలుగా చేసి తినిపించవచ్చు.