Brain Booster Foods for Kids | పిల్లలకు ఈ ఫుడ్స్ చాలా మంచిది.. ఎందుకంటే..
31 May 2022, 14:57 IST
- పిల్లలు చురుకుగా.. చదువుల్లో తెలివితేటలను కనబరుస్తూ ఉండాలంటే మంచి పేరెంటింగ్ ఉండాలి. దీనితో పాటు.. వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లల్లో శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల సరిగా ఉండాలంటే మంచి ఫుడ్ ఇవ్వాలి. ఇంతకీ పిల్లలకు ఎలాంటి ఫుడ్స్ ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పిల్లలకు ఈ ఫుడ్స్ పెట్టండి..
Brain Booster Foods for Kids | పిల్లలు ప్రతి పనిలో చురుగ్గా పాల్గొంటూ.. మంచి తెలివితేటలు కనబరచాలంటే.. వారిని చదువుకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఆటల్లో కూడా వారు పాల్గొనేలా చేయాలి. ఆటలు అంటే మొబైల్స్‌లో కాదు. బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో ఆడుకోమని వారిని ప్రోత్సాహించాలి. అంతే కాకుండా మెదళ్లకు పని చెప్పే పనులు చేయించాలి. వీటితో పాటు సరైన ఆహారం వారికి అందించాల్సి బాధ్యత తల్లిదండ్రులదే. మంచి ఆహారం తీసుకున్నప్పుడే వారికి బ్రెయిన్ బూస్ట్ అయ్యే అవకాశముంది. అయితే కొన్ని ఆహారాలను వారి డైట్లో కచ్చితంగా చేర్చాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపలు
పిల్లలకు చేపలను తినిపించడం చాలా ముఖ్యం. ఒమేగా ఫ్యాటీ యాసిడ్‌లను సరఫరా చేయడానికి.. పిల్లలకు సాల్మన్, ట్యూనా వంటి చేపలను తినిపించాలి. ఫలితంగా పిల్లలు శారీరకంగా, మానసికంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతారు.
గుడ్లు
పాలు తర్వాత గుడ్లు అత్యంత శక్తివంతమైన ఆహారంగా పరిగణిస్తాము. ప్రొటీన్‌తో కూడిన గుడ్లను తినిపించడం వల్ల పిల్లలకు మంచి తెలివితేటలు వస్తాయి. కాబట్టి వారికి రోజుకో ఉడకబెట్టిన గుడ్లు తినిపించండి.
ఆకుకూరలు
పిల్లలకు ఆకుకూరలు చూసి ఎంత విసుగు వచ్చినా.. వాటిని అస్సలు ఆపకూడదు. ఆకుకూరలు తినిపించే వివిధ మార్గాలను వెతకాలి. బ్రోకలీ, పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలను పిల్లలకు తినిపించాలి. ఆకుకూరల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది.
డ్రైఫ్రూట్స్
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి డ్రైఫ్రూట్స్‌ను మీ పిల్లలకు రోజూ తినిపించండి. మీరు నాన్‌వెజ్ తినకపోతే.. పిల్లలకు డ్రైఫ్రూట్స్ తప్పకుండా ఇవ్వాలి.
ఓట్స్
ఓట్స్ బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మెదడును పెంచడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. పిల్లలకు ఇష్టమైన ఎన్నో వస్తువులను ఓట్స్‌లో మిక్స్ చేసి పిల్లలకు తినిపించవచ్చు.
బెర్రీలు
పిల్లలకు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, ద్రాక్షలు, యామ్స్ వంటి వాటిని కూడా ఇవ్వాలి. ఇది పిల్లల మేధస్సును ప్రేరేపిస్తుంది. అలాగే పిల్లల కంటి చూపు కూడా మెరుగ్గా ఉంటుంది.