తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Freid Rice: మిగిలిపోయిన అన్నంతో స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసేయండి, ఎంతో రుచిగా ఉంటుంది

Spicy Freid rice: మిగిలిపోయిన అన్నంతో స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసేయండి, ఎంతో రుచిగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

16 September 2024, 11:30 IST

google News
    • Spicy Freid rice: అన్నం తరచూ ఇంట్లో మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నాన్ని పడేసే కన్నా టేస్టీ స్పైసీ ఫ్రైడ్ రైస్ గా మార్చుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి. 
మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ రెసిపీ
మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ రెసిపీ

మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ రెసిపీ

ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం చాలా సహజం. దాన్ని తినడం ఇష్టంలేని వారు పడేస్తూ ఉంటారు. అలా పడేయాల్సిన అవసరం లేకుండానే స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. బయట అమ్మే ఫ్రైడ్ రైస్ లతో పోలిస్తే ఇంట్లో చేసే ఈ వంటకం ఎంతో ఆరోగ్యకరమైనది. దీన్ని చేయడం చాలా సులువు. దీనిలో పనీర్, బీన్స్, క్యారెట్లు వంటి తాజా ఆహారాలను వేస్తాము కాబట్టి… ఈ రెసిపీ హెల్తీయే. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించుకోవచ్చు.

స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీకి కావల్సిన పదార్థాలు:

బియ్యం - రెండు కప్పులు

నూనె - రెండు స్పూన్లు

వెల్లుల్లి రెబ్బలు - ఒక స్పూను

అల్లం తరుగు - అర స్పూను

తరిగిన క్యాబేజీ - అర కప్పు

తరిగిన క్యాప్సికమ్ - పావు కప్పు

ఉల్లిపాయ - ఒకటి

ఫ్రెంచ్ బీన్స్ - రెండు

క్యారెట్ - ఒకటి

ఉల్లికాడలు - ఒకటి

పనీర్ ముక్కలు - ఒక కప్పు

సోయా సాస్ - ఒక స్పూను

వెనిగర్ - ఒక స్పూను

నల్ల మిరియాల పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

కారం - అర స్పూను

పచ్చి మిర్చి - మూడు

స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ

  1. మిగిలిపోయిన అన్నాన్ని చేత్తోనే పొడి పొడిగా కలిపి ఒక ప్లేటులో వేయాలి.
  2. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చి మిర్చి, క్యారెట్లు, బీన్స్, ఉల్లికాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
  4. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం తరుగు వేసి కలుపుకోవాలి.
  5. తరువాత సన్నగా పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి. అలాగే బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  6. ఆ తరువాత పనీర్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  7. వాటిని క్రిస్పీగా వేగేలా చేయడానికి మంట పెంచండి.

8. తర్వాత అందులో వెనిగర్, సోయా సాస్, ఉప్పు, మిరియాలపొడి, కారం వేసి కలపాలి.

9. అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేసి వేగంగా కలపాలి.

10. అన్నం మీద ఉల్లికాడల ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే.

పిల్లలకు, పెద్దలకు నచ్చేలా స్పైసీ పనీర్ ఫ్రైడ్ రైస్ వండవచ్చు. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా వాడవచ్చు. స్పైసీగా చేసుకుంటే పెద్దవాళ్లకు నచ్చుతుంది. కారం తగ్గిస్తే పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ప్రతిరోజూ అన్నం కూర తింటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి ఇలా మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి.

తదుపరి వ్యాసం