తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natural Hair Colour: ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు? ఇంట్లోనే సింపుల్‌గా,ఈజీగా

Natural Hair Colour: ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు? ఇంట్లోనే సింపుల్‌గా,ఈజీగా

Ramya Sri Marka HT Telugu

21 December 2024, 15:30 IST

google News
  • Natural Hair Colour: తెల్ల జుట్టును దాచుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్లను వాడుతున్నారా? ఇది చాలా ప్రమాదకరం దీంట్లోని రసాయనాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. బదులుగా మీరే ఇంట్లో ఎలాంటి రసాయనాలు లేని నేచురల్ హెయిర్ కలర్ తయారు చేసుకోండి. ఈజీగా, సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.

ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు?
ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు? (shutterstock)

ఎలాంటి కెమికల్స్ లేకుండా హెయిర్ కలర్‌ను మీరే తయారు చేసుకోవచ్చు?

ఈ రోజుల్లో తెల్ల వెంట్రుకలు సర్వసాధారణం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. తెల్ల జుట్టును దాచుకునేందుకు మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటిలోని హానికరమైన రసాయనాలు జుట్టును నల్లగా మార్చినప్పటికీ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీర్ఘకాలికంగా జుట్టు రాలడంతో పాటు వెంట్రుకల ఎదుగుదలను కూడా నిలివేస్తాయి. మీ జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా సులభంగా నల్ల రంగులో మారాలంటే మీరే స్వయంగా ఇంట్లో హెయిర్ కలర్ ను తయారు చేసుకోవచ్చు. సహజమైన ఈ హెయిర్ కలర్ ను అప్లై చేసుకోవడం వల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంతో పాటు జుట్టును సిల్కీగా, మృదువుగా, బలంగా చేస్తుంది. ఇది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టును నల్లగా మార్చడానికి నేచురల్ హెయిర్ మాస్క్ లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

హోం మేడ్ హెయిర్ కలర్ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు..

పెరుగు- పావు కప్పు

పసుపు - టీ స్పూన్

ఇండిగో పౌడర్ - ఒక టీ స్పూన్

మెంతులు- రెండు టీ స్పూన్లు(రాత్రంతా నానబెట్టుకుంటే మంచిది)

కాఫీ పొడి- ఒక టీస్పూన్

కలబంద గుజ్జు- ఒక టీస్పూన్

హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారీ విధానం

ముందుగా నానబెట్టిన మెంతులు, పెరుగు, కలబంద గుజ్జు మూడింటినీ బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.

ఇప్పుడు ఇనుప పాన్ లేదా కడాయిలో పసుపును దోరగా వేయించుకోవాలి.

తరువాత అదే ప్యాన్ లో ఇండిగో పౌడర్ వేసి వేయించుకోవాలి. ఇవి రంగు మారగానే స్టవ్ ఆపేయాలి.

ఇప్పుడు తయారు చేసిన పెరుగు, కలబంద గుజ్జులో పసుపు, ఇండిగో పౌడర్ వేసి కలపాలి.

ఈ మిశ్రమం పూర్తిగా కలిసాక దాంట్లోకి ఒక చెంచా కాఫీ పొడిని కూడా కలపండి.

పసుపు, కాఫీ పొడి, ఇండిగో పౌడర్, పెరుగు, కలబంద గుజ్జు అన్నీ కలిసిపోయేలాగా బాగా కలపాలి.

అంతే హోం మేడ్ నేచురల్ హెయిర్ కలర్ తయారయినట్టే..

కలర్ అప్లై చేసుకునే విధానం..

మీరు తయారు చేసుకున్న హెయిర్ కలర్ ను తలకు రాసుకునే ముందు తలను శుభ్రంగా కడుక్కోవాలి లేదా తలస్నానం చేయాలి.

శుభ్రమైన తలకు ఈ మిశ్రమాన్ని వెంట్రుకల మూలల నుంచి మొత్తం తెల్ల వెంట్రుకల వరకూ బాగా అప్లై చేయాలి.

అప్లై చేసిన తర్వాత మూడు నుండి నాలుగు గంటలు పాటు అలాగే ఉంచండి.

తర్వాత జుట్టును చల్లటి నీటితో లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

ఎలాంటి కెమికల్స్ లేకుండానే మీ జుట్టు మొత్తం సులభంగా నల్లగా మారుతుంది.

అంతేకాదు.. వెంట్రుకలు సహజంగా నల్లగా, మెరిసేలా తయారవుతాయి. మృదుత్వం కూడా పెరుగుతుంది.

తదుపరి వ్యాసం