Silky Hair: మీ జుట్టు సిల్క్‌లా మెరవాలంటే తులసి, కలబందతో ఇలా చేయండి, జుట్టు చిక్కు కూడా పడదు
Silky Hair: జుట్టును మృదువుగా, సిల్కీగా మార్చడానికి మేము ఇక్కడిచ్చిన హోం రెమెడీస్ పాటించండి. ఇక్కడ మేము తులసి, కలబందతో షాంపూ తయారుచేసుకోండి. దాన్ని వెంట్రుకలకు పట్టిస్తే జుట్టు సిల్కీగా మారుతుంది.
చలికాలంలో జుట్టు పొడిబారి నిర్జీవంగా మారిపోతుంది. జుట్టు పొడిబారడం వల్ల వెంట్రుకలు చిక్కు పడుతుంటాయి. జుట్టు మెరిసేలా చేయడానికి షాంపూ చేశాక, కండిషనర్ వాడుతూ ఉంటారు. అయితే రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు, కండిషనర్ వాడడం వల్ల దీర్ఘకాలంగా వాడడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఎండిపోయిన జుట్టును మెరిసేలా, స్మూత్ గా మార్చుకోవడానికి చాలా మంది అమ్మాయిలు పార్లర్ కు వెళుతుంటారు. వివిధ రకాల ట్రీట్ మెంట్లు చేయించుకుంటారు. నిజానికి ఇంట్లోనే మీ జుట్టును స్మూత్ గా, షైనీగా మార్చుకోవచ్చు. ఎలాంటి డబ్బులు ఖర్చు లేకుండా ఈ హోం మేడ్ షాంపూను తయారు చేసుకోండి. దీన్ని వారానికి మూడు నాలుగు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టులో మెరుపు, మృదుత్వం కనిపిస్తుంది.
మార్కెట్లో దొరికే షాంపూలను తరచూ అప్లై చేయడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి ఇంట్లోనే ఇన్ స్టంట్ షాంపూ తయారు చేసుకుని జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను పెంచడమే కాకుండా మెరిసేలా చేయడానికి ,మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. ఇంట్లో షాంపూ తయారు చేయడానికి, మీకు ఈ మూడు పదార్థాలు అవసరం.
షాంపూ తయారీ
ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో ఒక చెంచా బియ్యపు గింజలు వేయాలి. అలాగే పది నుంచి పదిహేను తులసి ఆకులు, సగం కలబంద ఆకులను కట్ చేసి వేయాలి. వీటన్నింటినీ నీరు సగానికి తగ్గే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక చెంచా షాంపూ కలిపి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ షాంపూతో వారానికి మూడు నాలుగు సార్లు తలస్నానం చేస్తే కొన్ని వారాల్లోనే జుట్టులో మార్పు వస్తుంది. జుట్టు మెరుస్తూ, మృదువుగా మారి జుట్టు పెరుగుదల కూడా పెరుగుతుంది. వెంట్రుకలు మెరుస్తూ ఉంటాయి. వెంట్రుకలు పట్టుకుచ్చులా మారుతాయి. జుట్టు దువ్వుతూ ఉంటే చిక్కు పడకుండా ఉంటాయి. ఎప్పుడైతే చిక్కు పడదో అప్పుడు వెంట్రుకలు రాలకుండా ఉంటాయి.
తులసి ఆకుల్లో పోషకాలు మన జుట్టును కాపాడతాయి. చర్మవ్యాధుల చికిత్సలో తులసిని వినియోగిస్తారు. తులసిలో ఉండే పోషకాలు జుట్టును కాపాడతాయి. తులసి ఆకుల రసాన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు సులువుగా తొలగిపోతుంది. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మాడును కాపాడుతుంది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలను పెరిగేలా ప్రోత్సహిస్తారు. తులసి రసాన్ని తరచూ మాడుకు పట్టిస్తూ ఉండండి.
మీ జుట్టు జిడ్డుగా అనిపిస్తే కలబందతో జుట్టును మెరిపించుకోవచ్చు. అలోవెరా జెల్ సేకరించి జుట్టుకు పట్టించండి. తరచూ ఇలా జుట్టు కలబంద రసాన్ని పట్టిస్తుంటే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. జుట్టు రాలిపోయే ప్రక్రియను నెమ్మదించేలా చేస్తాయి. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలను పెంచుతాయి.