తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maha Shivaratri Recipe : శివరాత్రి స్పెషల్.. సాబుదానా కిచ్డీ.. ఇలా చేయండి

Maha Shivaratri Recipe : శివరాత్రి స్పెషల్.. సాబుదానా కిచ్డీ.. ఇలా చేయండి

Anand Sai HT Telugu

07 March 2024, 11:00 IST

    • Maha Shivaratri 2024 Recipe : శివరాత్రికి ఉపవాసం ఉండటం చాలా మందికి అలవాటు. అయితే సాబుదానా కిచ్డీతోపాటుగా కొన్ని ఆహారా పదార్థాలను తినవచ్చు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం..
సాబుదానా కిచ్డీ
సాబుదానా కిచ్డీ (Unsplash)

సాబుదానా కిచ్డీ

శివరాత్రి నాడు ఉపవాసం ఉండేవారు అన్ని రకాల ఆహారపదార్థాలు తినలేరు. ఈ రోజున సాబుదానా కిచ్డీతో సహా కొన్ని ఆహారపదార్థాలు తినవచ్చు. ఈ సాబుదానా కిచ్డీని రుచిగా తయారు చేసుకోవచ్చు. కొందరికి ఉపవాసంతో నీరసం వస్తుంది. అయితే సాబుదానా తింటే యాక్టివ్‌గా అవుతారు. సాబుదానా కిచ్డీని చేయడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఈజీగా తయారు చేయవచ్చు. ఈ రెసిపీ తయారీ విధానం చూద్దాం..

సాబుదానా కిచ్డీకి కావలసిన పదార్థాలు :

సాబుదానా 1 కప్పు, 100 గ్రా వేరుశెనగ, ఉడకబెట్టిన బంగాళాదుంప, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొన్ని కొత్తిమీర ఆకులు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2-3.

సాబుదానా కిచ్డీ తయారీ విధానం :

ఒక కప్పు సాబుదానాను నానబెట్టండి. సాబుదానాను నానబెట్టేటప్పుడు నీటిలో బాగా ముంచాలి. కప్పు సాబుదానా నానబెట్టడానికి రెండున్నర కప్పుల నీరు కలపండి. రాత్రిపూట నానబెట్టడం మంచిది. 2-3 గంటలు నానబెట్టడం వల్ల అది మెత్తబడదు. రాత్రంతా నానబెట్టండి.

తర్వాత సాబుదానాన్ని తాకి చూడాలి. చేతితో పిండినట్లయితే మెత్తగా ఉంటుంది. మధ్యలో కాస్త గట్టిగా ఉంటే మరికొంత నీళ్లు పోసి మళ్లీ 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టాలి. వాటర్ కంటెంట్ ఉండకూడదు. లేకపోతే ముద్దగా ఉంటుంది. ఇప్పుడు బంగాళాదుంపలను ఉడకబెట్టండి. రెండు పెద్ద బంగాళాదుంపలను ఉడకబెట్టి.. చల్లబడిన తర్వాత వాటిని తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి.

ఇప్పుడు వేరుశెనగ వేయించాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసి, ఆ తర్వాత వడకట్టిన సాబుదానా వేయాలి. ఉప్పు వేయాలి. తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు బాణలిలో 2 చెంచాల నెయ్యి వేసి వేడయ్యాక చెంచా జీలకర్ర వేయాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.

ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంప జోడించాలి. తక్కువ మంటలో వేయించాలి. ఆ తర్వాత సాబుదానా, వేరుశెనగ మిశ్రమం వేయాలి. తరువాత బాగా కలపండి, ఆపై 3-5 నిమిషాలు వేయించాలి. తర్వాత ఒక చెంచా నిమ్మరసం వేసి కలపాలి. తరవాత కొన్ని కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

మీరు సాబుదానాను ఎక్కువసేపు నానబెట్టడం చాలా ముఖ్యం. సాబుదానా వండేటప్పుడు మందపాటి పాన్ ఉపయోగించండి. మీడియం మంటలో కిచ్డీని సిద్ధం చేయండి. ఉపవాస సమయంలో సాబుదానా కిచ్డీ చేసేటప్పుడు నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించండి. పైన చెప్పిన విధంగా సాబుదానా కిచ్డీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే తినవచ్చు లేదా పెరుగుతో ఎంజాయ్ చేయవచ్చు.

తదుపరి వ్యాసం