తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Eat : శివరాత్రి ఉపవాస సమయంలో తినదగిన ఆహారాలు ఇవే

Foods To Eat : శివరాత్రి ఉపవాస సమయంలో తినదగిన ఆహారాలు ఇవే

Anand Sai HT Telugu

08 March 2024, 6:30 IST

    • Maha Shivaratri 2024 : ఈ ఏడాది మహాశివరాత్రి మార్చి 8. ఈ పర్వదినన చాలా మంది ఉపవాసం ఉంటారు. అయితే ఈ సందర్భంగా కొన్ని రకాల ఆహారాలు తినవచ్చు. అవేంటో చూద్దాం..
శివరాత్రికి తినదగిన ఆహారాలు
శివరాత్రికి తినదగిన ఆహారాలు (Unsplash)

శివరాత్రికి తినదగిన ఆహారాలు

భారతదేశంలోని హిందువులందరూ మహా శివరాత్రిని ఘనంగా జరుపుకుంటారు. ఈ మహా శివరాత్రి పండుగ అతి ముఖ్యమైనది. మహా శివరాత్రి అంటే పరమశివుని పరమ పవిత్రమైన రాత్రి. భక్తులు మహా శివరాత్రి నాడు రాత్రంతా జాగారం చేసి శివునికి పూజలు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఉపవాసం ఉంటారు. అయితే ఏదీ పడితే అది మాత్రం తినకూడదు.

ట్రెండింగ్ వార్తలు

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

Curd and Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

శివుని పట్ల తమకున్న భక్తి, ఆరాధనను తెలియజేసేందుకు మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు. పిల్లలు, రోగులు, వృద్ధులు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. అంటే మహా శివరాత్రి నాడు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. చాలా మంది ఈ కఠినమైన ఉపవాసాన్ని పాటించలేరు. కొందరు భక్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు. కానీ అదే సమయంలో తక్కువ మొత్తంలో పండ్లు, పాలు, కూరగాయలు లేదా ధాన్యం కాని ఆహారాలు తీసుకుంటారు. మీరు ఈ సంవత్సరం మహా శివరాత్రి ఉపవాసం ఉంటే ఈ కింది ఆహారాలను తీసుకోవచ్చు.

మహా శివరాత్రి నాడు బంగాళదుంపకు సంబంధించిన ఏదైనా ఆహారాన్ని తినవచ్చు. కానీ ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పసుపు వంటివి ఆ ఆహారపదార్థాల్లో చేర్చకూడదు. బంగాళదుంపలను మెత్తగా చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆలూ టిక్కీ లేదా ఆలూ పకోడా లేదా ఆలూ ఖిచ్డీ లేదా పంచదార కలిపి తినవచ్చు.

దీనితోపాటు కందగడ్డను కూడా ఉడికించి తినవచ్చు. స్వీట్ పొటాటోను తినడం వలన మీకు శక్తి వస్తుంది. ఎక్కువ నీరసం అవ్వరు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు మహాశివరాత్రి సందర్భంగా కందగడ్డను ఉడికించి తింటారు.

మహా శివరాత్రి వ్రతం సమయంలో ధాన్యం కాని ఆహారాలు తినవచ్చు. గోధుమలు, సాబుదానాలాంటి ఆహారాలు తినడానికి అనుమతి ఉంది. కొన్ని ఆహారాలు మహా శివరాత్రి నాడు భక్తులు తింటారు.

పాలు శివునికి ఇష్టమైనవి చెబుతారు. భక్తులు శివలింగంపై పాలు పోసి పూజలు చేస్తారు. మహా శివరాత్రి పర్వదినాల్లో భక్తులు పాలు తాగుతారు. ఈ ఉపవాస సమయంలో ముఖ్యంగా పాలు, పాలతో కూడిన పానీయాలు తీసుకోవచ్చు. బాదం పాలు, సేమియాలాంటివి చేసుకుని తీసుకోవచ్చు.

చిరుతిళ్ల విషయానికొస్తే మహా శివరాత్రి వ్రతంలో బంగాళదుంప పకోడీ, అరటి వడ తీసుకోవచ్చు. కానీ ఉపవాస సమయంలో అనుమతిలేని మసాలా దినుసులతో చేసిన ఆహారాలను తీసుకోకూడదు. మసాలా దినుసుల విషయానికొస్తే జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చి ఏలకులు, దాల్చిన చెక్క, ఓమమ్ మొదలైన మిశ్రమ ఆహారాలను తినవచ్చు. ఈ ఆహారాలకు రాక్ సాల్ట్ కూడా జోడించవచ్చు.

కఠిన ఉపవాసం పాటించలేని భక్తులు పండ్లు, పాలు, నీరు కలిపిన తీసుకోవచ్చు. సాధారణంగా మహా శివరాత్రితో సహా అన్ని పూజలు, ఉపవాసాలలో పండ్లకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్, మిల్క్ ఫ్రూట్ షేక్స్ వంటివి శివరాతి ఉపవాసంలో తినవచ్చు. పండ్లతో పాటు రకరకాల డ్రైఫ్రూట్స్ కూడా తినవచ్చు. మీరు బాదం, వాల్‌నట్‌లు, ఖర్జూరం, పప్పులు, ఎండుద్రాక్ష తినవచ్చు.