తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Tour Cost : వరల్డ్ టూర్.. 3 ఏళ్లు, 135 దేశాలు.. వర్క్ కూడా చేయోచ్చు

World Tour Cost : వరల్డ్ టూర్.. 3 ఏళ్లు, 135 దేశాలు.. వర్క్ కూడా చేయోచ్చు

HT Telugu Desk HT Telugu

07 March 2023, 10:55 IST

    • Life at Sea Cruise : సముద్రం అంటే.. చాలా మందికి ఇష్టం. సముద్రంపై ప్రయాణం చేయడమంటే.. తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే అలా మూడేళ్లపాటు ప్రయాణం చేయోచ్చు. 135 దేశాలు తిరిగేయోచ్చు. ఆ ట్రిప్ ఏంటి? పూర్తి వివరాలు మీ కోసం..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

MV జెమినీ క్రూయిసెస్(MV Gemini Cruise) కంపెనీ 3 సంవత్సరాలలో 135-దేశాలు, 375 పోర్ట్ లగ్జరీ ట్రిప్‌ను అందిస్తుంది. సముద్రం(Sea) మీద వెళ్లాలనుకునేవారు.. లైఫ్ ఎట్ సీ క్రూయిజ్(Life at Sea Cruise) షిప్‌లో జీవితకాల అనుభవాన్ని పొందొచ్చు. 3 సంవత్సరాలలో 135 దేశాలకు తీసుకువెళుతుంది. ఈ క్రూయిజ్ 1 నవంబర్ 2023న ఇస్తాంబుల్ నుండి ప్రారంభమవుతుంది. ఏడు ఖండాల్లోని 375 పోర్టులను కవర్ చేస్తుంది. ఈ ప్రయాణంలో భారతదేశం(India)లోని తాజ్ మహల్(Taj Mahal), గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, రియో ​​డి జనీరోలోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం వంటి ప్రపంచంలోని వింతల సందర్శనలు ఉంటాయి.

ఈ క్రూయిజ్ 103 ద్వీపాలను సందర్శించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. 375లో 208 ఓడరేవుల వద్ద ఆగేందుకు ఏర్పాట్లు చేసింది. కంపెనీ ఓడలో కార్యాలయ విధులను కూడా ఏర్పాటు చేసింది. అంటే మీ ఆఫీస్ వర్క్(Office Work) చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. సముద్రంలో సమావేశ గదులు, కార్యాలయాలు, సహా వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసింది. లైబ్రరీ(library), లాంజ్, కేఫ్ కూడా ఉంటుంది. ఈ నౌకలో కరెన్సీ మార్పిడి, హై-స్పీడ్ ఇంటర్నెట్, లాండ్రీ, ఎన్‌రిచ్‌మెంట్ సెమినార్‌లు, వినోదం వంటి సౌకర్యాలను అందిస్తుంది.

ఎంచుకున్న క్యాబిన్ రకాన్ని బట్టి క్రూయిజ్ ధర సంవత్సరానికి 29,999 డాలర్ల(రూ.24,51,300) నుండి 109,999(రూ.89,88,320) డాలర్ల వరకు ఉంటుంది. ప్యాకేజీలో భోజనం, ఆన్‌బోర్డ్ యాప్, వ్యాపార కేంద్రానికి యాక్సెస్, పోర్ట్ రుసుములు, పన్నులు, హౌస్ కీపింగ్, వినోదం ఉంటాయి. అయితే, మద్యం, శాశ్వత కార్యాలయ గదులు, స్పా సేవలు, వైద్య ఉత్పత్తులు, ఔషధం, కొన్ని ప్రీమియం సేవలు చేర్చలేదు.

'మేం 2 మీటింగ్ రూమ్‌లు, 14 ఆఫీస్‌లు, బిజినెస్ లైబ్రరీ, రిలాక్సింగ్ లాంజ్, ఒక కేఫ్‌తో సముద్రంలో మొదటి వ్యాపార కేంద్రాన్ని అభివృద్ధి చేశాం. స్క్రీన్‌లు, కాన్ఫరెన్స్ ఎక్విప్‌మెంట్, WIFI, ప్రింటర్లు, సహాయం చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.' అని కంపెనీ తెలిపింది.

ఈ క్రూయిజ్‌ను MV జెమినీ క్రూయిజ్ నిర్వహిస్తోంది. 1,074 మంది ప్రయాణీకులకు 400 క్యాబిన్‌లు ఉన్నాయి. ఈ క్రూయిజ్ ప్రపంచంలోని 375 ఓడరేవులను కవర్ చేస్తుందని. 1 నవంబర్ 2023న ఇస్తాంబుల్ నుండి ప్రారంభమవుతుందని కంపెనీ తెలియజేసింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో కొన్నింటిని చూసే అవకాశం ఉన్నందున, ఈ ప్రయాణం ఖచ్చితంగా మరపురని ప్రయాణం అవుతుంది. సాహసం చేయాలనుకునే ప్రయాణికులకు జీవితకాల అనుభవం ఇది.

టాపిక్

తదుపరి వ్యాసం