Twitter Layoff: ట్విట్టర్ మరోసారి.. ఉద్యోగులకు ఉద్వాసన.. పని పూర్తి చేసేందుకు ఆఫీస్‍లోనే నిద్రించిన ఆమెను కూడా..!
Twitter Layoff: ట్విట్టర్ మరోసారి ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సుమారు కంపెనీలో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించింది.
Twitter Layoffs: సోషల్ మీడియా, మైక్రో బ్లాగింగ్ నెట్‍వర్కింగ్ కంపెనీ ట్విట్టర్.. ఉద్యోగుల తీసివేతను కొనసాగిస్తూనే ఉంది. ట్విట్టర్‌ను దక్కించుకున్న తర్వాత గతేడాది నవంబర్‌లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ (Elon Musk).. ఇక తీసివేతలు ఉండవు అని చెప్పినా అది మాత్రం జరగడం లేదు. ఆ తర్వాత కూడా దశల వారీగా ఎంప్లాయిస్‍ను ట్విట్టర్ తీసేస్తోంది (Twitter Layoff). ఈ ఏడాది కూడా తొలగింపు పర్వం కొనసాగింది. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి ఉద్యోగులపై ట్విట్టర్ వేటు వేసింది. మరో 200 మంది ఎంప్లాయిస్‍ను ట్విట్టర్ విధుల నుంచి తొలగించిందని న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఆదివారం వెల్లడించింది. అంటే సుమారు మరో 10 శాతం మంది సిబ్బందిని ఆ సంస్థ తగ్గించుకుంది. ఈ తొలగింపుల్లో ట్విట్టర్ బ్లూ హెడ్ ఎస్తేర్ క్రాఫోర్డ్ (Esther Crawford) కూడా ఉన్నారని తెలుస్తోంది. ట్విట్టర్ బ్లూ ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పని పూర్తి చేసేందుకు ఆమె ఇంటికి కూడా వెళ్లకుండా ట్విట్టర్ ఆఫీస్‍లోనే నిద్రపోయేవారు. ఆమె ఆఫీస్ ఫ్లోర్‌పై ఆమె నిద్రపోతున్న ఫొటో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ విభాగాల్లోని వారిని..
Twitter Layoff: ప్రొడక్టు మేనేజర్లు, డేటా సైంటిస్టులు, ఇంజినీర్లను ట్విట్టర్ తాజాగా తొలగించిందని ఆ రిపోర్టు పేర్కొంది. అయితే ఈ తాజా తొలగింపుపై ట్విట్టర్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు. కాగా ట్విట్టర్ సబ్‍స్క్రిప్షన్ సర్వీస్ ట్విట్టర్ బ్లూ ఇన్‍చార్జ్‌గా ఉన్న ఎస్తేర్ క్రాఫోర్డ్ పేరు కూడా తాజా తొలగింపుల్లో ఉందని సమాచారం.
తమ సంస్థలో ప్రస్తుతం 2,300 మంది యాక్టివ్ ఉద్యోగులు ఉన్నారని గత నెలలో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇక తాజా తొలగింపుతో ఆ సంఖ్య మరింత తగ్గింది.
అప్పటి నుంచి..
Twitter Layoff: గతేడాది అక్టోబర్ చివర్లో ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు చేజిక్కించుకున్నారు టెస్లా బాస్ ఎలాన్ మస్క్. ఇక అప్పటి నుంచి ట్విట్టర్‌లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. గత నవంబర్ ఆరంభంలో ఒకేసారి సుమారు 3,700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు మస్క్. సుమారు 50 శాతానికి పైగా సిబ్బందిని ఒకేసారి తీసేశారు. కంపెనీ ఖర్చులను తగ్గించేందుకు, నష్టాలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఆ తర్వాత కూడా దశల వారీగా ఉద్యోగాలను తగ్గించుకుంటూ వస్తోంది ట్విట్టర్. ఓ దశలో ఇక లేఆఫ్‍లు ఉండవని మస్క్ చెప్పినా.. అది మాత్రం నిజం కాలేదు.
Layoffs Trend: గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ సహా చాలా భారీ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆర్థిక అనిశ్చితి, డిమాండ్ తగ్గుదల, ఆర్థిక మాంద్యం భయాల పేరు చెప్పి ఎంప్లాయిస్‍ను సంస్థలు తొలగిస్తున్నాయి. ముఖ్యంగా టెక్ సంస్థల్లో ఈ లేఆఫ్ ట్రెండ్ విపరీతంగా కనిపిస్తోంది.
సంబంధిత కథనం