Ashu Reddy Earnings: అషూ లగ్జరీ లైఫ్ స్టైల్.. పోస్టు పెడితే ట్రెండ్.. ఫొటో పెడితే కాసుల వర్షం..!-bigg boss beauty ashu reddy earns big money from instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss Beauty Ashu Reddy Earns Big Money From Instagram

Ashu Reddy Earnings: అషూ లగ్జరీ లైఫ్ స్టైల్.. పోస్టు పెడితే ట్రెండ్.. ఫొటో పెడితే కాసుల వర్షం..!

Maragani Govardhan HT Telugu
Mar 02, 2023 02:30 PM IST

Ashu Reddy Earnings: బిగ్‌బాస్ ఫేమ అషూ రెడ్డి తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వివిధ దేశాలకు వెకేషన్‌కు వెళ్లడమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడుకు సంపాదన ఎక్కడ నుంచి వస్తుందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

అషూ రెడ్డి
అషూ రెడ్డి

Ashu Reddy Earnings: సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత బిగ్‌బాస్‌తో అమాంతం క్రేజ్ తెచ్చుకున్న నటి అషూ రెడ్డి. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఏం పోస్టు చేసినా అది ట్రెంట్ అవ్వాల్సిందే. ఫొటో షేర్ చేస్తే ఆమె గ్లామర్‌కు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే. అంతగా అషూ రెడ్డి తన పాపులారిటీని సంపాదించింది. అదిరిపోయే లుక్స్‌కు తోడు ఆమె విలాసవంతమైన లైఫ్‌స్టైల్ అనుభవిస్తుంది. అమెరికా, దుబాయ్, మాల్దీవులు ఒక్కటేమిటి వివిధ దేశాలకు హాలీడే ప్లాన్ చేస్తూ అక్కడ నుంచి ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది ఈ బ్యూటీ.

దీంతో నెటిజన్లు ఆమె లైఫ్ స్టైల్‌ను ఒక్కసారిగా షాకవుతున్నారు. అషూకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? ఇన్ని దేశాలు ఎలా తిరుగుతోంది? ఇంత విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఎలా గడుపుతుంది? అంటూ రకరకాల ప్రశ్నలను గుప్పిస్తున్నారు. ఇంత వరకు ఒక్కసారిగా మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్‌లో కనిపించని అషూ.. తన లైఫ్‌స్టైల్ విషయంలో మాత్రం హీరోయిన్లకు తగ్గకుండా ఎంజాయ్ చేస్తోంది. దీంతో నెటిజన్లే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అయితే అషూ ఇంత లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మెయిన్ కారణం సోషల్ మీడియానే అని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు వస్తుందని, వాటితోనే తన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాలో అషూ తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేయడం వల్ల అవి క్షణాల వ్యవధిలోనే ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాకుండా విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు కురుస్తున్నాయి. ఇంక ఎక్స్‌పోజింగ్ విషయంలో ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గదు. ఫొటో షేర్ చేస్తే ట్రెండ్.. పోస్టు పెడితే వైరల్ అన్నచందంగా అషూకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి కాసుల వర్షం కురుస్తోంది. పైపెచ్చు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షాట్స్, టీవీ షోల్లో గెస్ట్ అప్పియరెన్స్ లాంటివి ఈ ముద్దుగుమ్మ అదనంగా సంపాదించిపెడుతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో అషూకు దాదాపు 20 లక్షలు ఫాలోవర్లు(1.9 మిలియన్ మంది) ఉన్నారు. హీరోయిన్లకు దీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అషూ పోస్ట్ పెడుతుంటే అది ట్రెండ్ అవడం, ప్రజలకు చేరడంతో ప్రైవేట్ ప్రకటనల నుంచి కూడా భారీ మొత్తంలో సంపాదన లభిస్తుంది. దీంతో అషూ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు మెయింటేన్ చేయడమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా వెకేషన్‌కు వెళ్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్