Telugu News  /  Entertainment  /  Ashu Reddy Congrats Rahul Sipligunj For Naatu Naatu Song Won Golden Globe
అషూ-రాహుల్
అషూ-రాహుల్

Ashu Reddy on Rahul Sipligunj: మళ్లీ తెరపైకి వచ్చిన అషూ-రాహుల్ లవ్ స్టోరీ.. ఫొటోలో క్లోజ్‌గా..!

12 January 2023, 16:57 ISTMaragani Govardhan
12 January 2023, 16:57 IST

Ashu Reddy on Rahul Sipligunj: అషూ రెడ్డి.. రాహుల్ సిప్లీగంజ్ మధ్య లవ్ ఎఫైర్ మళ్లీ తెరపైకి వచ్చింది. వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ గతంలో వార్తలు రాగా అనంతరం వాటిని కొట్టిపడేశారు. తాజాగా రాహుల్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోను షేర్ చేసింది అషూ.

Ashu Reddy on Rahul Sipligunj: ఆర్ఆర్ఆర్ సినిమాపై అంతర్జాతీయ వేదికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బుధవారం జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారాన్ని ఎంఎం కీరవాణీ అందుకున్నారు. ఆస్కార్ తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన అవార్డును మన ఇండియన్ మూవీకి రావడం ఇదే తొలిసారి. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రబృందం, దర్శకుడు రాజమౌళి, ఎంఎం కీరవాణిలకు సర్వత్రా అభినందనలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ అవార్డు తీసుకునే సమయంలో కీరవాణీ తనకు ఎంతగానో సహకరించి, పాటలో భాగమైన రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్‌, చంద్రబోస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాట పాడిన రాహుల్ సిప్లీగంజ్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అంతర్జాతీయ వేదికపై కీరవాణీ.. తన పేరును చెప్పడంపై ఆనందోత్సాహంలో మునిగితేలుతున్నాడు. ఈ అవార్డు విన్నింగ్ క్రెడిట్ ఇవ్వడంతో ఆనందంలో తేలిపోతున్నాడు. ఈ సంతోషమైన సందర్భాన్ని రాహుల్ తన స్నేహితులు, సన్నిహితుల మధ్య బుధవారం సాయంత్రం సెలబ్రేట్ చేసుకున్నాడు. అందులో రాహుల్.. గర్ల్ ఫ్రెండ్‌గా చెబుతున్న అషూ రెడ్డి కూడా పాల్గొంది. ఈ పార్టీలో రాహుల్‌తో పాటు క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అతడికి శుభాకాంక్షలు తెలిపింది.

దీంతో అషూ-రాహుల్ మధ్య ఉన్న లవ్ ఎఫైర్ రూమర్లు గురించి మరోసారి వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ బిగ్‌బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్నప్పటికీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత దగ్గరగా ఉన్నారు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో వీరి మధ్య ఏదో ఉందని వార్తలు హల్చల్ చేశాయి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. దీంతో మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోయారని భావించారు. తాజాగా మరోసారి క్లోజ్‌గా కనిపిచండంతో మళ్లీ కలిసిపోయారా అంటూ నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

వీరిద్దరూ తమ రిలేషన్ గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు. ఎప్పుడు అడిగిన తాము స్నేహితులమేనని చెప్పుకొచ్చారు. కానీ వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉండటం చూసి నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.