Ganga Vilas cruise : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌ను ప్రారంభించిన మోదీ
PM Modi inaugurates Ganga Vilas cruise : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ‘గంగా విలాస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
PM Modi inaugurates Ganga Vilas cruise : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్'ను శుక్రవారం ఉదయం ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో జరిగిన ఈవెంట్లో వర్చువల్‌గా పాల్గొన్న మోదీ.. గంగా విలాస్‌కు పచ్చజెండా ఊపారు.
"ప్రపంచ రివర్ క్రూయిజ్ చరిత్రలో ఇదొక మర్చిపోలేని రోజు! అతి పొడవైన క్రూయిజ్‌లో.. అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం ప్రారంభమైంది. యూపీ, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్‌లో ప్రయాణించి.. చివరికి అసోంలోని డిబ్రూగఢ్‌కు చేరుకుంటుంది. ఈ ప్రయాణంతో టూరిజంతో పాటు ట్రేడింగ్ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇన్లాండ్ వాటర్‌వేస్ అభివృద్ధిని.. ఇండియా ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో ఈ గంగా విలాస్ చెబుతుంది. గంగా విలాస్‌లో ఉన్న ప్రయాణికులకు ఒక విషయం చెబుతున్నా.. ఇండియా అనేది మీ అంచనాలకు మించి ఉంటుంది. ఇండియాను మాటల్లో వర్ణించలేరు. హృదయం లోతుల్లో నుంచి ఇండియాను అనుభూతి చెందాలి," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అత్యంత విలాసవంతమైన రివర్ క్రూయిజ్ ఇంటీరియర్ ఫొటోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Ganga Vilas cruise route : అంతకుముందు.. వారణాసిలో 'టెంట్ సిటీ'ని కూడా ప్రారంభించారు ప్రధాని మోదీ. టెంట్ సిటీ పేరుతో వారణాసిలో 200కుపైగా టెంట్లు ఏర్పాటు చేశారు. పవిత్రమైన నగరంలోని వివిధ ఘాట్లను తిలకించే విధంగా ఈ టెంట్లను రూపొందించారు. లైవ్ క్లాసికల్ మ్యూజిక్, సాయంత్రం వేళ నిత్యం జరిగే హారతి కార్యక్రమాలు, యోగా క్లాస్‌లను ఈ టెంట్ సిటీ నుంచి వీక్షించవచ్చు.
అదే సమయంలో.. రూ. 1000కోట్లతో కూడిన పలు ఇన్లాండ్ వాటర్‌వేస్ ప్రాజెక్టులను సైతం ప్రారంభించారు ప్రధాని మోదీ.
గంగా విలాస్- ప్రత్యేకతలు.. విశేషాలు..!
గంగా విలాస్ ప్రయాణం 51 రోజుల పాటు ఉంటుంది. ఈ క్రూయిజ్‌లో పర్యాటకులు మొత్తం మీద 3,200 కి.మీలు ప్రయాణిస్తారు.
ఇదొక 5 స్టార్ మూవింగ్ హోటల్ అని గంగా విలాస్ క్రూయిజ్ డైరక్టర్ రాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందులో 18 సూట్లు ఉంటాయి. 36మంది టూరిస్ట్‌లు ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. టూరిస్ట్‌లతో పాటు 40 సిబ్బంది కూడా ఉంటారు.
Ganga Vilas cruise price : ఈ గంగా విలాస్ క్రూయిజ్ పొడవు 62మీటర్లు, వెడల్పు 12మీటర్లు ఉంటుంది. దీని డ్రాఫ్ట్ 1.4మీటర్లు.
ఈ గంగా విలాస్ క్రూయిజ్‌లో స్పా, సెలూన్, జిమ్‌లు కూడా ఉంటాయి. రోజుకు రూ. 25వేలు- రూ.50వేలు ఖర్చు అవుతుంది. మొత్తం మీద 51రోజుల ప్రయాణంలో.. ఒక్కో ప్రయాణికుడికి 20లక్షల వరకు ఖర్చు అవుతుంది.
సంబంధిత కథనం