World's longest river cruise : ప్రపంచంలోనే పొడవైన రివర్​ క్రూయిజ్​ ఇదే!-worlds longest river cruise of 4 000 km to set sail from varanasi in jan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  World's Longest River Cruise Of 4,000 Km To Set Sail From Varanasi In Jan

World's longest river cruise : ప్రపంచంలోనే పొడవైన రివర్​ క్రూయిజ్​ ఇదే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 01:03 PM IST

World's longest river cruise : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్​ క్రూయిజ్​ ప్రయాణానికి రంగం సిద్ధమవుతోంది. 51రోజుల పాటు.. 4వేల కి.మీల ప్రయాణం ఇందులో ఉంటుంది.

ప్రపంచంలోనే పొడవైన రివర్​ క్రూయిజ్​ ఇదే!
ప్రపంచంలోనే పొడవైన రివర్​ క్రూయిజ్​ ఇదే!

World's longest river cruise : ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్​ క్రూయిజ్​ను లాంచ్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. వచ్చే ఏడాది ఈ క్రూయిజ్​.. వారణాసి నుంచి దిబ్రుగఢ్​కు(వయా బంగ్లాదేశ్​)కు ప్రయాణిస్తుంది. ఈ ప్రాజెక్టుతో దేశంలోని జల రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని కేంద్రం భావిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

50రోజుల క్రూయిజ్ ప్రయాణం.​. జనవర్​ 10న వారణాసిలో మొదలయ్యే అవకాశం ఉంది. ఇది మొత్తం 4వేల కి.మీలు ప్రయాణిస్తుంది. కోల్​కతా, ఢాఖా మార్గంలో ప్రయాణించి.. మార్చ్​ 1న అసోంలోని దిబ్రుగఢ్​కు చేరుకుంటుంది.

"అతి పెద్ద రివర్​ జర్నీగా ఈ గంగా విలాస్​ క్రూయిజ్​ చరిత్ర సృష్టించనుంది. 27 నదీ వ్యవస్థలను దాటుకుంటూ, 50 పర్యాటక ప్రదేశాలను చుడుతూ.. ఈ క్రూయిజ్​ ప్రయాణిస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన నదీ మార్గంలో ప్రయాణించి చరిత్రలో నిలిచిపోతుంది ఈ క్రూయిజ్​. నదీ మార్గాల్లో భారత్​, బంగ్లాదేశ్​ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి," అని పోర్ట్​లు, షిప్పింగ్​, వాటర్​వేస్​ మంత్రి సర్బానంద్​ సోనోవాల్​ తెలిపారు.

Ganga Vilas cruise : తీర, రివర్​ షిప్పింగ్​తో పాటు క్రూయిజ్​ సేవల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నట్టు సోనోవాల్​ తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సర్వీసులను మరిన్ని లాంచ్​ చేస్తామని పేర్కొన్నారు.

"నదీపై రవాణాను ప్రోత్సహిస్తుండటంతో పాటు జల రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ట్రేడ్​ కార్గో సేవలను వృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాము. పర్యాటకానికి ఇది నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తున్నాము," అని సోనోవాల్​ స్పష్టం చేశారు.

ఈ వారణాసి- దిబ్రుగఢ్​ క్రూయిజ్​ పీపీపీ మోడల్​లో ఉండే అవకాశం ఉంది. ఐడబ్ల్యూఏఐ(ఇన్​లాండ్​ వాటర్​వేస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా)- అంటారీ లగ్జరీ రివర్​ క్రూయిజెస్​, జేఎం బాక్సి రివర్​ క్రూయిజెస్​లు ఇప్పటికే మొమొరాండం ఆఫ్​ అండర్​స్టాండింగ్​ పత్రాలపై సంతకాలు చేశాయి.

Ganga Vilas cruise ticket price : అయితే.. క్రూయిజ్​లో ప్రయాణికుల టికెట్​ ధరతో కేంద్రానికి సంబంధం లేదు. ఆపరేటర్లే టికెట్​ ధరలను నిర్ణయిస్తారు.

"క్రూయిజ్​లో.. లగ్జరీ, ఎక్స్​పిడీషన్​ వంటి రకాలు ఉంటాయి. ఒక్కో ప్రయాణికుడిలో ఒక్క మైండ్​సెట్​ ఉంటుంది. కొందరు పూర్తి జర్నీలో ఉందామని అనుకుంటారు. కొందరు మధ్యలోనే దిగిపోతారు. అందుకు తగ్గట్టుగానే.. మేము సిద్ధమయ్యాము. అన్ని రాష్ట్రాల్లో సులభంగా ప్రయాణించే విధంగా చట్టాల్లో మార్పులు చేయడం కలిసి వచ్చే విషయం," అని సోనోవాల్​ తెలిపారు.

వారణాసిలో బయలు దేరి.. బంగ్లాదేశ్​లో 1000కి.మీలు ప్రయాణిస్తుంది ఈ రివర్​ క్రూయిజ్​. ఆ తర్వాత మళ్లీ దేశంలోకి తిరిగి వచ్చి గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇండో- బంగ్లాదేశ్​ ప్రోటోకల్​ రూట్​లోనే ఇది జరుగుతుంది. ట్రేడ్​, రవాణా కోసం ఇప్పటికే దీనిని వినియోగిస్తున్నారు.

రూట్​ మ్యాప్​..

World's longest river cruise from Varanasi to Dibrugarh : వారణాసిలో ప్రయాణాన్ని మొదలుపెట్టే గంగా విలాస్​ క్రూయిజ్​.. బక్సర్​, రామ్​నగర్​, ఘాజిపూర్​ మార్గాల్లో వెళ్లి 8 రోజుల తర్వాత పట్నాకు చేరుకుంటుంది.

20వ రోజున.. కోల్​కతాకు వెళుతుంది. ఒక రోజు హాల్ట్​ తర్వాత.. బంగ్లాదేశ్​కు ప్రయాణం మొదలుపెడుతుంది. బాలీలో బంగ్లాదేశ్​లోకి ఎంట్రీ ఇస్తుంది. 15 రోజుల పాటు బంగ్లాదేశ్​లోనే ప్రయాణిస్తుంది. ఆ తర్వాత.. డిబ్రుగఢ్​లోని బోగిబీల్​కు చేరుకుంటుంది. కోల్​కతా నుంచి ప్రయాణం మొదలుపెట్టిన 31రోజులకు గమ్యస్థానానికి వెళుతుంది ఈ క్రూయిజ్​.

IPL_Entry_Point

సంబంధిత కథనం