తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Look Younger । వయసును స్టాప్ చేసి, యవ్వనాన్ని లాక్ చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి!

Tips to Look Younger । వయసును స్టాప్ చేసి, యవ్వనాన్ని లాక్ చేయాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి!

HT Telugu Desk HT Telugu

22 November 2022, 12:11 IST

    • Tips to Look Younger- ఎంత వయసు పెరిగినా అసలు పెరగనట్లు ఎల్లప్పుడూ నవయవ్వనంగా కనిపించాలంటే మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక్కడ సూచించిన సింపుల్ టిప్స్ పాటిస్తే మీరెప్పటికీ యూతే!
Tips to Look Younger
Tips to Look Younger (Facebook MB)

Tips to Look Younger

వయసు మీద పడుతున్న కొద్దీ దాని ప్రభావం బయటకి కనిపిస్తుంది. వృద్ధాప్య సంకేతాలు రావడం మొదలవుతుంది. వయసు 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మంపై ముడతలు, చారలు కనిపించడం గమనించవచ్చు. అయితే కొంతమంది వయసు ఎంత పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు. వారిలో వయసు యవ్వనంతోనే ఆగిపోయిందా, లేదా ఏళ్లు గడిచేకొద్దీ వయసు తగ్గిపోతూ వస్తుందా? అనే భావన మనకు కలుగుతుంది. మరి అలాంటి వారిలో కూడా వయసు ఏమి పెరగకుండా ఆగిపోదు కదా? కానీ వారి వయసును దాచేశారు. యవ్వనంగా కనిపించేలా తమని తాము మార్చుకున్నారు. మీరు కూడా యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే చదవండి.

మహిళలు ప్రధానంగా తమ అందం గురించి, శరీరాకృతిలో మార్పుల గురించి, పెరిగే వయసు గురించి ఎక్కువగా చింతిస్తారు. తమ చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా బిగుతుగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు.

Tips to Look Younger- యవ్వనంగా కనిపించేందుకు చిట్కాలు

తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మం బిగుతుగా మార్చే ప్రయత్నాలు చేస్తే చర్మంపై ముడతలను నివారించవచ్చు. ఈ కింద పేర్కొన్న అంశాలపై శ్రద్ధ చూపండి, వృద్ధాప్య ఛాయలను దాచిపెట్టవచ్చు.

కనుబొమ్మలు

మీ కనుబొమ్మలను చూసి మీ వయసును అంచనా వేయవచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా మీ ముఖం ఆకారానికి అనుగుణంగా కనుబొమ్మలను సెట్ చేసుకోండి. మందపాటి, దట్టమైన కనుబొమ్మలు తక్కువ వయస్సును చూపించడంలో సహాయపడతాయి. కాబట్టి థ్రెడింగ్, ప్లకర్ కాకుండా, కొన్ని రోజుల పాటు కనుబొమ్మలను పెంచండి, ఆపై నిపుణుల సహాయంతో వాటిని సెట్ చేయండి. తద్వారా మీ వయస్సు తక్కువగా కనిపిస్తుంది.

చర్మానికి సరిపడే పరిపూర్ణ ఉత్పత్తి

ముఖానికి మేకప్ వేయడంతో పాటు, చాలా స్మార్ట్‌నెస్‌తో చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయండి. మీ ముఖం అవసరాలకు అనుగుణంగా, మీ ముఖానికి సరిపడే ఉత్పత్తిని కొనుగోలు చేయండి. తద్వారా అది చర్మంలో మెరుపును నిలిపి ఉంచుతుంది.

ఫౌండేషన్ ప్రధానం

వయసు తక్కువగా చేసేందుకు మీ మేకప్ లో ఫౌండేషన్ ముఖ్యం. వయసు ఎక్కువ ఉన్నపుడు పూర్తి కవరేజ్ ఫౌండేషన్‌ని ఉపయోగించకుండా, మీడియం లేదా లైట్ కవరేజ్ ఫౌండేషన్‌ను అప్లై చేయండి. అప్పుడు ముఖం చాలా బరువుగా, కృత్రిమంగా కనిపించదు. ముఖం సహజంగా అందంగా కనిపించడానికి లైట్ ఫౌండేషన్స్ సహాయపడతాయి.

పెదాలను హైడ్రేట్ చేయండి

చర్మంతో పాటు పెదాలను ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. మీరు ముఖానికి మేకప్ వేయకపోయినా, లిప్ గ్లాస్ సహాయంతో పెదాలను నిగనిగలాడేలా, జ్యూసీగా ఉంచండి.

మెడ- చేతులు

చాలా మంది ముఖంపై చూపించే శ్రద్ధ మిగతా భాగాలకు చూపించరు. వయసు దాచాలంటే మెడ కోసం ప్రత్యేక సంరక్షణ తీసుకోవాలి. అలాగే చేతులను గమనించి కూడా వయసు అంచనా వేయవచ్చు. కానీ చేతులకు కూడా సరైన కేర్ తీసుకొని ముడతలు నివారించాలి.

పైన పేర్కొన్న చిట్కాలు మీరు తాత్కాలికంగా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కానీ, నిత్యయవ్వనంగా కనిపించాలంటే ముందుగా మన శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు మన నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్యమైన పోషకాహారం, ఎలాంటి ఒత్తిడి, ఆందోళనలు లేని జీవనశైలిని అనుసరించడం ద్వారా యవ్వనంగా ఉంటారు, ఎక్కువ కాలం బ్రతుకుతారు.

టాపిక్