తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kova Kobbari Laddu: కోవా కొబ్బరి లడ్డూ రెసిపీ, తినడం మొదలుపెడితే ఇక ఆపలేరు

Kova Kobbari Laddu: కోవా కొబ్బరి లడ్డూ రెసిపీ, తినడం మొదలుపెడితే ఇక ఆపలేరు

Haritha Chappa HT Telugu

22 June 2024, 15:38 IST

google News
    • Kova Kobbari Laddu: కోవా కొబ్బరి లడ్డూ చాలా టేస్టీగా ఉంటుంది. కోవాను, కొబ్బరి లడ్డును వేరు వేరుగా తిని ఉంటారు. ఈ రెండింటినీ కలిపి లడ్డూలా చేసుకుని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.
కోవా కొబ్బరి లడ్డూ
కోవా కొబ్బరి లడ్డూ

కోవా కొబ్బరి లడ్డూ

Kova Kobbari Laddu: సాయంత్రం పూట స్నాక్ గా పిల్లలకి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ కోవా కొబ్బరి లడ్డూ రెసిపీని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం బెల్లాన్ని వినియోగించాం. కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. పిల్లలు దీన్ని తిన్నారంటే చాలా ఇష్టపడతారు. నోట్లో పెడితే నాలికపై కరిగిపోయేలా ఉంటుంది. ఎందుకంటే దీనిలో కోవా ఎక్కువ శాతం ఉంటుంది. ఈ స్వీట్ రెసిపీ ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి.

కోవా కొబ్బరి లడ్డూ రెసిపీ

కొబ్బరి తురుము - రెండు కప్పులు

బెల్లం తురుము - ఒక కప్పు

యాలకుల పొడి - పావు స్పూను

నెయ్యి - ఒక స్పూను

కోవా - పావు కిలో

పంచదార పొడి - నాలుగు స్పూన్లు

కోవా కొబ్బరి లడ్డూ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నెయ్యిని వేయండి.

2. అందులో తురిమిన కొబ్బరిని, తురిమిన బెల్లాన్ని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండండి.

3. బెల్లం కొన్ని నిమిషాలకే కరిగిపోతుంది. ఆ మిశ్రమాన్ని అలా కలుపుతూనే ఉండాలి.

4. అదంతా దగ్గరగా ఇంకిపోయే వరకు కలపాలి. అలా అని మరీ ఎండిపోయేలా అయ్యేవరకు ఉంచకండి.

5. కాస్త తేమవంతంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చల్లబరచాలి.

6. ఇప్పుడు ఆ మిశ్రమంలోంచి కొంతమందిని తీసి లడ్డూల్లా చుట్టుకోండి.

7. మొత్తం మిశ్రమాన్నిచిన్న లడ్డూల్లా చుట్టి పక్కన పెట్టుకోండి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంట పెట్టండి.

9. ఆ కళాయిలో కోవాను వేసి కాస్త వేడి చేయండి.

10. కోవా వేడెక్కినప్పుడే చక్కెర పొడిని కూడా వేసి బాగా కలపండి.

11. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి.

12. ఇప్పుడు ఈ కోవాను చిన్న లడ్డూల్లా గుండ్రంగా ఒత్తుకోండి.

13. మధ్యలో ముందుగా చేసుకున్న కోకోనట్ లడ్డును పెట్టి మళ్ళీ ఈ కోవాను ఆ లడ్డూ చుట్టూ కవర్ చేసేయండి.

14. చేత్తో లడ్డూల్లా చుట్టుకుంటే కోవా బాల్స్ రెడీ అయిపోతాయి.

15. ఈ కోవా లడ్డూ లోపల, కొబ్బరి లడ్డు ఉంటుందన్నమాట.

16. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నింటినీ కంప్లీట్ చేసుకున్నాక పైన కొబ్బరి కోరు, చక్కెర కలిపిన మిశ్రమాన్ని చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.

17. వీటిని రెండు మూడు నుంచి నాలుగు గంటల పాటు బయట వదిలేయాలి.

18. అవి కాస్త పొడిగా అయ్యాక గాలి చొరబడని డబ్బాల్లో వేసుకుంటే మూడు నాలుగు రోజులు తాజాగా ఉంటాయి.

ఈ కోవా కొబ్బరి లడ్డూలు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా నచ్చుతాయి. ఇవి స్వీట్ షాపుల్లో అందుబాటులో ఉంటాయి. కాకపోతే ధర అధికంగా ఉంటుంది. దాని బదులు ఇంట్లో చేసుకుంటే మీకు తక్కువ ధరలోనే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది. ఇందులో బెల్లం వేసాము... కనుక ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. చక్కెరను మాత్రం కాస్త తగ్గించి వేసుకున్నాం కాబట్టి పర్వాలేదు.

తదుపరి వ్యాసం