తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alia Bhatt's Skincare Routine: ఆలియా భట్ చర్మ రహస్యం ఇదే..! మెరిసే చర్మం కావాలంటే మీరూ ట్రై చేయండి

Alia Bhatt's Skincare Routine: ఆలియా భట్ చర్మ రహస్యం ఇదే..! మెరిసే చర్మం కావాలంటే మీరూ ట్రై చేయండి

Ramya Sri Marka HT Telugu

20 December 2024, 17:30 IST

google News
  • Alia Bhatt's Skincare Routine: అలియా తన అందమైన చర్మం కోసం ముల్తానీ మట్టిని వాడుతుందట. ముల్తానీ మట్టి ముఖంలోని అదనపు నూనెను తొలగించి ముఖ వాపు, మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తొలగించడం ద్వారా స్కిన్ టోన్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

alia bhatt homemade multani mitti face pack
alia bhatt homemade multani mitti face pack (aliaabhatt instagram)

alia bhatt homemade multani mitti face pack

కొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారా.. లేదా మరేదైనా గ్రాండ్ ఫంక్షన్ కు రెడీ కావాలా..? అయితే ఒక పని చేయండి. ఈలోగా మీరు మీ ముఖాన్ని కాంతివంతంగా, అచ్చం అలియాభట్ చర్మంలా మెరిసిపోయేలా ఉంచుకునేందుకు ఇలా చేయండి. ఇందుకోసం మీరు కూడా అలియా భట్ ఉపయోగించే ముల్తానీ మట్టిని వినియోగించండి. అలా చేయడం వల్ల ముఖంపై అదనపు నూనె, జిడ్డు ఉండదట. వాటితో పాటుగా ముఖం వాపు, మొటిమలు, మచ్ఛలు వంటి చర్మ సమస్యలను తొలగించుకోవచ్చట. వీటితోపాటుగా స్కిన్ టోన్ కూడా మెరుగుపరుడుతుంది. ముల్తానీ మట్టి ముఖం చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా ముఖంపై సెబమ్ ఏర్పడుతుంది. వీటితో పాటుగా ముల్తానీ మట్టి వల్ల చర్మానికి కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. దాని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ తయారీకి కావలసిన పదార్థాలు

- 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి

- 1/2 టేబుల్ స్పూన్ గంధం పొడి

- 1/4 టేబుల్ స్పూన్ పసుపు

- 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

- 1 టేబుల్ స్పూన్ పాలు.

ముల్తానీ మట్టితో ఫైస్ ప్యాక్ వేసుకోవడం ఎలా?

  • ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మట్టి, గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్, పాలు తీసుకోవాలి.
  • అన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
  • తరువాత, ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం, మెడకు సమానంగా అప్లై చేయాలి.
  • ఇది పూర్తిగా ఆరిపోయే వరకు అంటే దాదాపు 15-20 నిమిషాలు ఉంచండి.
  • నిర్ణీత సమయం తర్వాత చల్లటి లేదా గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగి ఆరబెట్టాలి.

ముల్తానీ మట్టితో ఫైస్ ప్యాక్ లాభాలు:

  • ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన అదనపు ఆయిల్ తొలగిపోతుంది. ఫలితంగా పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది.
  • ముల్తానీ మట్టి ఒక నేచురల్ క్లెన్సర్, ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడం ద్వారా మొటిమలు రాకుండా ఉంటాయి.
  • ముల్తానీ మట్టిలో మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో హైడ్రేటెడ్ అల్యూమినియం సిలికేట్ లు , మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం బెంటోనైట్ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా తయారుచేస్తాయి.
  • ముల్తానీ మట్టిలో ప్రత్యేక లక్షణాలు చర్మాన్ని మృదువు, మెరిసేలా తయారు చేస్తాయి.
  • వదులు చర్మం, ముడతలు ఉన్నవారికి ఈ ప్యాక్ చాలా బాగ సహాయపడుతుంది. ఎందుకంటే ముల్తానీ మట్టి చర్మాన్ని చక్కగా టోన్ చేస్తుంది. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
  • చర్మకాలుష్యాన్ని తొలగించడంలో ముల్తానీ మట్టి చాలా బాగా సహాయపడుతుంది. ముఖంపై మట్టి, బ్యాక్టీరియాతో పాటు కనిపించని సూక్ష్మజీవులతో పోరాడే లక్షణాలు ఇందులో మెండుగా ఉంటాయి.
  • ముఖ్యంగా చలికాలంలో పొడిబారిన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుకునేందుకు వారానికి ఒకసారి ఈ ప్యాక్ రాసుకోవడం మంచిది.

ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి హాని లేకపోయినా, ముఖానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. కొందరికి కొన్ని ప్యాక్ లు వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.

తదుపరి వ్యాసం