Beauty tips: అప్పటికప్పుడు ముఖానికి మెరుపునిచ్చే ఫేస్ ప్యాక్ ఇది, పండుగ రోజు ప్రయత్నించండి
Beauty tips: పండుగ సీజన్‌లో ముఖం మెరిసిపోతుంది. ట్యానింగ్ నలుపుదనం కనిపిస్తే ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయడం ప్రారంభించండి. దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కొన్ని నిముషాల్లోనే మీకు మెరుపును ఇస్తుంది.
పండుగల సీజన్ నడుస్తోంది. నవరాత్రుల్లో దాండియా, గర్బా, దుర్గా పూజ, దసరా పండుగలు వరుసగా వస్తున్నాయి. పండుగల సమయంలో అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. కానీ ఎండలు, మురికి, కాలుష్యం వల్ల ముఖం నల్లగా మారిపోతుంది. ట్యాన్ పట్టేస్తుంది. ముఖం డల్‌గా, నీరసంగా కనిపిస్తుంది. పండగ రోజు ఇక్కడ చెప్పిన సింపుల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం వెంటనే మెరుస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న మచ్చలు, నలుపు తొలగిపోవడమే కాదు. ఇది సన్నని గీతలు, ముడతలను కూడా తగ్గిస్తుంది. దీన్ని వేసుకోవడం చాలా సులువు.
ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న నిమ్మకాయ, టమోటా, బంగాళాదుంప, పసుపు, శెనగపిండి ఉంటే చాలు. ముందుగా నిమ్మకాయ, టమోటా, బంగాళాదుంప మిక్సీలో మెత్తని పేస్టుగా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అందులో శెనగపిండి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తగినంత నీళ్లు వేయాలి. చిక్కటి పేస్టులా వేసి కలుపుకోవాలి.
ముఖాన్ని ముందుగా రోజ్ వాటర్ సాయంతో పరిశుభ్రంగా తుడుచుకోవాలి. మురికింతా శుభ్రపడుతుంది. ఇప్పుడు తయారుచేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేయాలి. అలా అరగంట పాటూ వదిలేయాలి. ఇప్పుడు తడి టిష్యూ లేదా తడి టవల్‌తో ముఖాన్ని తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఆ తరువాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.
మొదటిసారి ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేయడంతోనే మీకు మెరుపు కనిపించడం ప్రారంభమవుతుంది. పండుగ సీజన్ లో ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. మీ ముఖం మెరిసిపవడం ఖాయం. ముఖంపై కనిపించే నీరసం, నలుపుదనం తొలగిపోతాయి.
శెనగపిండిలో పసుపు పొడి, నీళ్లు వేసి క్రీమ్ లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచూ ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటూ మంచిది. ఈ ఫేస్ మాస్క్ వేయడం వల్ల చర్మం పై ఉండే బ్యాక్టిరియాలు తొలగిపోతాయి. దీన్ని తరచూ వేసుకోవడం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది.
చందనం పొడితో కూడా చర్మాన్ని మెరిపించుకోవచ్చు. రోజ్ వాటర్ లో చందనం పొడి వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మాన్ని మెరిపించే ఫేస్ ప్యాక్. ఇది ముఖానికి అప్లై చేశాక పావుగంట సేపు ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
టొమాటో మన ముఖాన్ని మెరిపించుకోవచ్చు. మిక్సీలో టొమాటో ముక్కలను వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేయవచ్చు. పావుగంట సేపు అలా వదిలేసి తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. అంతే అందమైన ముఖం సొంతమవుతుంది.