తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Food For Kids Memory: పిల్లలకు ఈ ఆహారం ఇవ్వండి మెదడు చురుగ్గా ఉంటుంది

Brain food for kids memory: పిల్లలకు ఈ ఆహారం ఇవ్వండి మెదడు చురుగ్గా ఉంటుంది

HT Telugu Desk HT Telugu

16 February 2023, 10:00 IST

    • Brain food for kids memory: పిల్లల మెదడు ఎదుగుదలకు, వారి మెమొరీ పవర్ పెరగడానికి, చదువుపై ఏకాగ్రతకు పోషకాహారం తప్పనిసరి. ఈ విషయంలో న్యూట్రిషనిస్టులు సూచిస్తున్న పోషకాహారం ఇక్కడ చూడండి.
పిల్లల మెదడు అభివృద్ధికి ఆహారాలు
పిల్లల మెదడు అభివృద్ధికి ఆహారాలు (Photo by Alex Green on Pexels)

పిల్లల మెదడు అభివృద్ధికి ఆహారాలు

పిల్లలు చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలని పేరెంట్స్ కోరుకోవడం సహజం. అయితే పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదలకు, వారి ఫోకస్ పెరిగేందుకు కొన్ని రకాల ఆహారం అవసరం. గుడ్లు, ఫ్యాటీ ఫిష్, కూరగాయలు ఎదిగే పిల్లలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. పోషకాహారం, సమతుల్యమైన ఆహారం చిన్నారుల సాధారణ ఆరోగ్యానికి, అలాగే మెదడు తన విధులు నిర్వర్తించేందుకు దోహదపడుతాయి.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైల్డ్ సైకాలజిస్ట్ డాక్టర్ అచరా వెంకటరామన్ సంబంధిత విషయాలను వివరించారు. చిన్నారుల ఆహారంలో నిర్ధిష్టమైన పదార్థాలు చేర్చడం ద్వారా వారి మెదడు అవసరాలకు తగిన పోషకాలు అందుతాయని వివరించారు. ఇవి వారి మెమొరీ పవర్ పెంచేందుు, షార్ప్‌గా ఉండేందుకు తోడ్పడుతాయని వివరించారు.

1. Eggs: గుడ్లు

పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారంలో గుడ్డు ఒకటి. పిల్లలకు ఇవంటే చాలా ఇష్టం కూడా. మెదడు ఎదుగుదలకు, గ్రహణ శక్తికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. కొలైన్, విటమిన్ బీ 12, ప్రొటీన్, సెలీనియం వంటి పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కు అవసరమైన పోషకాల్లో కొలైన్ కూడా ఒకటి. ఎగ్ సలాడ్ శాండ్‌విచ్, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివాటిని అల్పాహారంలో చిన్నారులు ఎక్కువగా ఇష్టపడుతారు.

2. Yogurt: యోగర్ట్

మెదడు తన విధులు నిర్వర్తించేందుకు కొవ్వు కూడా అవసరం. యోగర్ట్‌లో ఉండే ప్రొటీన్ బ్రెయిన్ సెల్స్ సరైన ఆకృతిలో ఉండేలా చేస్తాయి. అప్పుడే సెల్స్ సమాచారాన్ని గ్రహించడంలో, విడుదల చేయడంలో తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయి. యోగర్ట్‌లో ఉండే పాలీఫెనాల్స్ న్యూట్రియంట్లు మానసికంగా చురుగ్గా ఉండి మెదడుకు రక్త సరఫరాను పెంచుతాయి.

3. Green leafy vegetables: ఆకు కూరలు

పిల్లలను ఆకు కూరలు తినేలా ప్రోత్సహించడం ఒకింత కష్టమైన పనే. అయితే వీటిలో ఉండే పోషకాలు పిల్లల్లో మెదడు ఆరోగ్యానికి చాలా అవసరమని అధ్యనాలు చెబుతున్నాయి. పాలకూర, బచ్చలి కూర వంటి ఆకు కూరలు మెదడుకు రక్షణగా నిలిచే ఫోలేట్, ఫ్లేవనాయిడ్స్, కెరొటెనాయిడ్స్ విటమిన్ ఇ, విటమిన్ కె1 కలిగి ఉంటాయి. పిల్లల్లో గ్రహణ శక్తిని పెంపొందించేందుకు ఈ ఆకు కూరలు ఉపయోగపడతాయి.

4. Seafoods: సీఫుడ్

చేపల్లో విటమిన్ డి, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు గ్రహణ శక్తి, మెమొరీ కోల్పోకుండా చూస్తాయి. సాల్మన్, ట్యూనా, సార్డైన్ చేపల్లో ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.

5. Nuts: నట్స్

గింజలు, విత్తనాల్లో పోషకాలు బోలెడన్ని ఉంటాయి. విటమిన్ ఇ, జింక్, ఫొలెట్, ఐరన్, ప్రొటీన్ గ్రహణ శక్తిని పెంచడంతో ముడివడి ఉంటాయి. గింజలు తినడం వల్ల పిల్లల ఆహార నాణ్యత పెరుగుతుంది. పోషకాల వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ అందుతాయి. అకడమిక్స్‌లో రాణించాలన్నా, గ్రహణ శక్తి పెరగాలన్నా డైట్ బాగుండాలి. వీటిని భోజనంలో, స్నాక్స్‌లో భాగంగా తీసుకోవచ్చు.

6. Oranges: నారింజ

సిట్రస్ పండ్లలో ముఖ్యమైనవి నారింజ పండ్లు. పిల్లలు ఇవంటే ఇష్టపడుతారు కూడా. పిల్లల డైట్‌లో నారింజ పండ్లు ఉంటే వారి సాధారణ ఆరోగ్యంతో పాటు గ్రహణ శక్తి కూడా మెరుగుపడుతుంది. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ విధులకు ఇది చాలా అవసరం. విటమిన్ సి వల్ల వారిలో ఏకాగ్రత, గ్రహణ శక్తి, మెమొరీ, నిర్ణయాల్లో వేగిరం, వేగంగా గుర్తించడం వంటివి పెరుగుతాయి.