Egg Masala Sandwich Recipe : సాయంత్రం స్నాక్ కోసం.. స్ట్రీట్ స్టైల్ ఎగ్ మసాలా శాండ్‌విచ్
Street Style Egg Masala Sandwich Recipe : మీరు సాయంత్రం కాస్త టేస్టీగా.. ఈజీ పీజీ ఫీల్‌తో స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటే మీరు స్ట్రీట్ స్టైల్ ఎగ్ మసాలా శాండ్‌విచ్ ట్రై చేయవచ్చు. దీనికోసం బయటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.

Street Style Egg Masala Sandwich Recipe : సాయంత్రం బయటకు వెళ్లి హ్యాపీగా, టేస్టీగా ఏమైనా తినాలని అనుకుంటే.. దానికోసం మీరు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్ట్రీట్ స్టైల్ లాంటి ఫుడ్‌ను మీరు ఇంట్లోనే తయారుచేసుకుని.. మంచి ఛాయ్‌తో.. సినిమా చూస్తూ లాగించేయవచ్చు. అదే ఎగ్ మసాలా శాండ్‌విచ్. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఉడికించిన గుడ్లు - 5 (తరిగినవి)
* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి)
* టొమాటో - 1 (సన్నగా తరిగినవి)
* జీలకర్ర - 1 tsp
* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
* నూనె - 1 టేబుల్ స్పూన్
* కారం - 1 టేబుల్ స్పూన్
* పెప్పర్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్
* కొత్తిమీర పొడి - 1 tsp
* జీలకర్ర పొడి - 1 tsp
* ఉప్పు - రుచికి తగినంత
* గ్రీన్ చట్నీ - 2 tbsp
* రెడ్ చట్నీ - 2 tbsp
తయారీ విధానం
ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాలి. దానిలో టమాటా వేసి కాసేపు ఫ్రై చేయాలి. దానిలో పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఎండుమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడకబెట్టి.. తరిగిన గుడ్లు వేసి మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేయండి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని.. రెండు ముక్కలపై బటర్, గ్రీన్ చట్నీ వేయండి. రెడ్ చట్నీ వేసి.. దానిపై గుడ్డు మిశ్రమాన్ని ఉంచండి. దానిపై మరొక బ్రెడ్ ఉంచండి. ఇప్పుడు పాన్‌ను వేడి చేసి దానిలో వెన్న వేయండి. ఈ బ్రెడ్‌ను క్రిస్పీగా అయ్యే వరకు రెండు వైపులా వేయించండి.
సంబంధిత కథనం