తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Plants For Students: పిల్లల స్టడీ రూంలో ఈ 5 మొక్కలుంచితే శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది

Plants for Students: పిల్లల స్టడీ రూంలో ఈ 5 మొక్కలుంచితే శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుంది

09 September 2024, 19:00 IST

google News
  • Plants for Students: తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు మీద ఏకాగ్రత లేదని తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. మీ పిల్లల స్టడీ రూమ్ లేదా స్టడీ టేబుల్ పై తప్పనిసరిగా ఈ 5 మొక్కలు ఉంచితే ఏకాగ్రతను పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

పిల్లల ఏకాగ్రత పెంచే మొక్కలు
పిల్లల ఏకాగ్రత పెంచే మొక్కలు (Shutterstock)

పిల్లల ఏకాగ్రత పెంచే మొక్కలు

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చదువు మీద ఆసక్తి, ఏకాగ్రత లేదనీ ఫిర్యాదు చేస్తుంటారు. చాలా సార్లు దీనికి కారణం వాళ్ల స్టడీ రూం వాతావరణం కూడా. కొన్ని రకాల ఇండోర్ ముక్కలను వాళ్ల స్టడీ టేబుల్ మీద, స్టడీ రూం లో ఉంచితే ఒత్తిడి తగ్గించడమే కాకుండా గాలిని శుద్ధి చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల పిల్లల మనసు చదువు మీద నిమగ్నమై ఉంటుంది. వీటిని అలంకరణ మొక్కల్లాగూ వాడొచ్చు.

వెదురు మొక్క

పర్యావరణానికి వెదురు మొక్క చాలా మంచిదని భావిస్తారు. ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. ఈ మొక్క నుంచి వెలువడే పాజిటివ్ ఎనర్జీ మనసును శాంతపరుస్తుంది. ఈ మొక్క పిల్లల స్టడీ రూమ్ లో లేదా స్టడీ టేబుల్ మీద ఉంచితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఈ మొక్క ఇంటికి చాలా పవిత్రమైన మొక్కలా భావిస్తారు.

మల్లె మొక్క

మల్లె మొక్క నుంచి వెలువడే సువాసన మనసుకు ఉపశమనం కలిగించి ఒత్తిడిని దూరం చేస్తుంది. పిల్లల స్టడీ రూమ్ లేదా స్టడీ టేబుల్ పై ఈ మొక్కను ఉంచడం ద్వారా పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే, ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ మొక్కను ఇంటి బాల్కనీలో కూడా అలంకరించుకోవచ్చు.

కార్డిలైన్ ఫ్రుటికోసా

కార్డిలైన్ ఫ్రూటికోసా మొక్కను లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఇండోర్ ప్లాంట్. దీని ఆకులు ఎర్రగా, ఆకుపచ్చ చారలతో ఉంటాయి. దీన్ని పిల్లల స్టడీ టేబుల్ పై ఉంచొచ్చు. ఈ మొక్క ఎయిర్ ప్యూరిఫైయర్ లాగానూ పనిచేస్తుంది. ఈ మొక్కను ఎక్కడ నాటినా గాలి తాజాగా మారుతుంది. మనస్సును శాంతపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.

ఆర్కిడ్ మొక్క

పిల్లల స్టడీ రూమ్స్ లేదా స్టడీ టేబుల్స్ పై ఆర్కిడ్ మొక్క కూడా పెట్టొచ్చు. ఈ రంగురంగుల మొక్కలు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి. ఈ అందమైన మొక్కను స్టడీ రూమ్ లేదా స్టడీ టేబుల్ పై ఉంచడం వల్ల మానసిక ఏకాగ్రత మెరుగుపడుతుంది. చదువుపై దృష్టి పెట్టేలా చేస్తుంది.

పీస్ లిల్లీ ప్లాంట్

ఈ మొక్క నాటడం ద్వారా ఈ మొక్క పేరులో లాగే ప్రశాంతంగా అనిపిస్తుంది. తెల్లని పూలతో ఉండే ఈ మొక్క నాటిన ప్రదేశంలోని వాతావరణాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ మొక్క సువాసన చాలా బాగుంటుంది. ఇది గాలిని శుద్ధి చేసి మనసును శాంతపరుస్తుంది. పిల్లల స్టడీ రూమ్ లో ఈ మొక్కను నాటడం వల్ల పిల్లల మనసు కూడా ప్రశాంతంగా మారి చదువుపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు.

తదుపరి వ్యాసం