Lucky plants: ఇంట్లో ఈ మొక్కలు నాటారంటే పాజిటివిటీ, సంతోషం పెరుగుతుంది
Lucky plants: మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి, సానుకూల వాతావరణం పెంచడానికి ఈ 5 మొక్కలు ఉపయోగపడతాయి. ఈ మొక్కలని పెంచడానికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. అవి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఇంటికి అందంతో పాటూ అదృష్టాన్నీ తెస్తాయి.
ఇంట్లో చెట్లు నాటడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఇంటికి కళ తీసుకురావడంలో పచ్చని మొక్కలు సాయపడతాయి. ఆరోగ్యంతో పాటే వీటితో అలంకరణ కూడా పూర్తవుతుంది. అయితే కొన్ని మొక్కలు నాటడం ద్వారా ఇంట్లో నెగటివిటీ తొలిగిపోయి సానుకూల వాతావరణం నెలకొంటుంది. అలాంటి మొక్కలను మీ ఇంటి అలంకరణలో సులువుగా భాగం చేసుకోవచ్చు.
తులసి
హిందూమతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటాలనే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. ఈ మొక్క ఇంటిలోని ప్రతికూలతను తొలగించి, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దీంతో పాటే తులసి మొక్క ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. .
స్నేక్ ప్లాంట్
స్నేక్ ప్లాంట్ మీ ఇంటి అలంకరణలో ఉపయోగించగల మంచి ఇండోర్ మొక్క. ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది కూడా. అంతేకాకుండా గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగించి శుద్ధి చేస్తుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు.
పీస్ లిల్లీ
దాని పేరు మాదిరిగానే, పీస్ లిల్లీ వల్ల ఇళ్ళలో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ మొక్క చూడటానికి అందంగా ఉండటంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది. ఇది గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇది కాకుండా, మీరు దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ వివిధ సంస్కృతులలో చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పెరుగుతూ ఉన్న ఇంట్లో సుఖసంతోషాలకు కొదవ ఉండదని చెబుతారు. ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క పెంచడానికి ఎక్కువగా నిర్వహణ శ్రమ కూడా అక్కర్లేదు. తక్కువ సూర్యరశ్మి, తక్కువ నీటిలో ఈ మొక్కను సులభంగా పెంచవచ్చు.
అలోవెరా
తులసి, మనీ ప్లాంట్ తరువాత, ఇది భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే మొక్క కలబంద లేదా అలోవెరా. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కలబంద ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. తక్కువ సంరక్షణలో సులభంగా పెరిగే ఈ మొక్క చెడు శక్తి నుండి మీ ఇంటిని రక్షిస్తుంది.
టాపిక్