తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Repair Your Relationship । పెళ్లయ్యాక కూడా మరొకరికి ఆకర్షితమవుతున్నారంటే.. కారణాలివే!

Repair Your Relationship । పెళ్లయ్యాక కూడా మరొకరికి ఆకర్షితమవుతున్నారంటే.. కారణాలివే!

HT Telugu Desk HT Telugu

28 November 2022, 15:18 IST

    • Repair Your Relationship: వివాహ బంధంతో ఏకమైనా మనసు మరొకరి వైపు ఆకర్షితమవుతుందంటే అందుకు మనస్తత్వవేత్తలు కొన్ని కారణాలు, ఉదాహరణలు పేర్కొన్నారు. బంధం చెడిపోకుండా అన్యోన్యంగా ఎలా మార్చుకోవచ్చో సూచించారు.
Repair Your Relationship:
Repair Your Relationship: (Unsplash)

Repair Your Relationship:

Repair Your Relationship: ఏ సంబంధంలో అయినా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకే రకంగా ఉన్నంత మాత్రానా వారు కలకాలం కలిసి ఉంటారు అనే దానిపై గ్యారెంటీ లేదు. సాధారణంగా పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉండి, ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోయే గుణం కలిగి ఉన్న వారి మధ్యనే బంధాలు చిరకాలం కొనసాగుతాయని మనస్తత్వవేత్తలు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Green Chilli Water Benefits : పచ్చిమిర్చి నానబెట్టిన నీరు తాగండి.. శరీరంలో ఈ అద్భుత మార్పులు చూడండి

Chanakya Niti Telugu : ఈ గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకున్న మగవాడు అదృష్టవంతుడు

Asthma: పాల ఉత్పత్తులు అధికంగా తింటే ఆస్తమా సమస్య పెరుగుతుందా?

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

అన్ని విషయాలు తెలుసుకొని, వివాహబంధంతో ఏకమైన జంటలు కూడా విడిపోయే ఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం. ఇందుకు కారణం ఒక వ్యక్తి గురించి పూర్వాపరాలు తెలిసినా, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి ప్రవర్తన ఎప్పుడు మారుతుందని అంచనా లేకపోవడమె.

ఒకరిని జీవిత భాగస్వామిని కలిగి ఉండి పక్కచూపులు చూసేవారు సమాజంలో చాలా మందే ఉంటారు. అందుకు కారణాలు వారు పుట్టిపెరిగిన నేపథ్యం, వారి తల్లిదండ్రులు, వారు గతంలో అనుభవించిన చేదు ఘటనలు, చిన్ననాటి గాయాలు, అణిచివేసిన భావోద్వేగాలు, ఇష్టంలేని పెళ్లి, నమ్మకద్రోహం ఇలాంటివి ఎన్నో జంటల అనుబంధంలో పాత్ర వహిస్తాయి. అలాంటపుడు భాగస్వామి వారితో సఖ్యతతో మెలిగినా, కోరినవన్నీ తెచ్చిపెట్టి ప్రేమగా చూసుకున్నా వారికి జీవితంలో సంతృప్తి అనేది ఉండదు. ఇదే సమయంలో వారు కోరుకునేది మరొకరి నుంచి లభిస్తుందంటే అప్పుడు కొందరిలో మనసు మాట వినదు. ఎలాంటి సందర్భాలలో జంటలు పక్కచూపులు చూస్తాయో ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి.

క్లిష్టమైన తల్లిదండ్రులు గలవారు

ఒకరి బాల్యంలో వారి తల్లిదండ్రులు తమను ఎప్పుడూ చీదరించుకుంటూ, ఏ పనిచేసినా ప్రశంసించకుండా కేవలం విమర్శలతోనే పెరిగినపుడు వారు అదే లోకంలో ఉంటారు. ఆ తర్వాత పెళ్లయ్యాక వారి భాగస్వామిని తరచూ ప్రశంసిస్తూ ఉంటే దానిని వారు అబద్ధంగా భావిస్తారు. ఇదే సమయంలో ప్రశంసలతోనే పెరిగినవారు, తమ భాగస్వామి కూడా వారిని ప్రశంసించాలని కోరుకుంటారు. అలా లేని పక్షంలో తమపై ప్రేమ లేదని భావిస్తారు. ఇలాంటపుడు సర్దుకుపోయే భాగస్వామి ఉండటం చాలా అవసరం.

భావోద్వేగంతో ఏకం కాలేని భాగస్వాములు

బాల్యంలో తల్లిదండ్రులకు దూరంగా పెరిగిన వారు, ఎలాంటి ప్రేమలకు నోచుకోకుండా పెరిగిన వారు స్వేచ్ఛను, ఏకాంతంను ఎక్కువగా కోరుకుంటారు. వీరికి పెద్దగా ఎవరిపై అటాచ్మెంట్ అనేది ఉండదు. తమ జీవిత భాగస్వామి నుంచి ఈ స్వేచ్ఛా, ఏకాంతాలు కరువైనపుడు వారి నుంచి దూరంగా ఉండాలని ఆలోచనలు చేస్తారు. కాబట్టి భాగస్వామి ఇలా ఉంటే వారికి తగిన స్వేచ్ఛని ఇస్తూ, ప్రేమను పంచుతూ దగ్గర కావాలి.

విశ్వసనీయత లేనివారు

గతంలో ప్రేమ విషయంలో, బంధాల విషయంలో ఎదురుదెబ్బలు తిన్నవారికి ఎవరిపైనా నమ్మకం, విశ్వసనీయత ఉండదు. ప్రతి చిన్నవిషయానికి అనుమానాన్ని కలిగి ఉంటారు. ఇదే వారి భాగస్వామిపై చూపించవచ్చు. అయితే అందరూ గత జ్ఞాపకాలలో గడపరు, కొత్త భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ ఆ విశ్వాసం భాగస్వామి ఇవ్వలేకపోతే, అది అనర్థాలకు దారితీస్తుంది.

ద్రోహం చేసే భాగస్వాములు

ఇక ఇది పూర్తిగా వేరే కోణం. వీరి ప్రవర్తన, ధోరణిలోనే ద్రోహం చేసే ధోరణి కనిపిస్తుంది. తమ బంధంపై విశ్వాసం నమ్మకం లేనివారు, ఎదుటి వారు నిబద్ధత చూపినా వీరికి అవేమి పట్టవు, వీరికి వీరి జీవితమే ముఖ్యం. వీరి సుఖసంతోషాలు ముఖ్యం అనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగిన వారు ఎప్పుడూ అవకాశం దొరికినా కొత్త బాంధాలను ఏర్పర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీరి జీవితంలో ఏదైనా బలమైన సంఘటన జరిగినపుడు వీరిలో మార్పు వస్తుంది.

ఇద్దరు వ్యక్తులు రెండు విభిన్న ప్రాంతాలు, వాతావరణంలో పుట్టి పెరిగినపుడు వారి మనస్తత్వాలు, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారిరువురూ వివాహ బంధంతో ఏకమైనపుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇద్దరి మధ్య భావోద్వేగపూరితమైన బంధం అనేది ఏర్పడాలి. అప్పుడు ఏ జంట అయినా కడదాకా అన్యోన్యంగా కలిసి ఉంటుంది.