తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wife And Husband Relationship | భార్య తరచూ భర్తతో గొడవ పడుతుందంటే కారణం ఇదే!

Wife and Husband Relationship | భార్య తరచూ భర్తతో గొడవ పడుతుందంటే కారణం ఇదే!

Manda Vikas HT Telugu

27 October 2022, 21:30 IST

google News
    • Wife and Husband Relationship: భార్య తరచూ భర్తతో గొడవ పడుతుందంటే అందుకు కారణాలు లేకపోలేదు. భర్త నుంచి ఏదైతే ఆశిస్తుందో అది లభించలేకపోవడం ఒక కారణం. ఇంకా నమ్మశక్యం కానీ కారణాలు చాలా ఉన్నాయి. భర్తలు మీ భార్యల విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఈ స్టోరీ చదవండి.
Wife and Husband Relationship
Wife and Husband Relationship (Unsplash)

Wife and Husband Relationship

Wife and Husband Relationship: భార్యాభర్తల మధ్య బంధం అనేది జీవితాంతం ఉండాల్సినది. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని గోడలు అడ్డుగా ఉన్నా, ఒకరికొకరు తోడూనీడగా జీవించాలి. ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటే వారిని విడదీసే శక్తి ఏదీ లేదు. కానీ ఈ మధ్య చాలా జంటల వివాహ బంధం మూన్నాళ్ల ముచ్చటే అవుతుంది. చిన్నచిన్నవిగా భావించే గొడవలే, ఒక్కోసారి పెనుతుఫానుగా మారి ఇద్దరి మధ్య చీలిక తెస్తున్నాయి. ఒక భార్య తన భర్తతో తరచూ గొడవ పడుతుందంటే, తన భర్తపై కోపం చిరాకు ప్రదర్శిస్తుందంటే దానికి కారణాలు లేకపోలేదు.

చిన్న విషయాలకే భార్యలు వాగ్వాదానికి దిగటం చాలా మంది భర్తలకు అనుభవం అయ్యే ఉంటుంది. మీ భార్యకు ఎందుకు అంత కోపం వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మీరు చిన్న విషయంగా భావించేవి మీ భార్యకు చిన్నవి కావు. మీరు ఏదో సరదాగా మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుంది, కానీ వారి ఆలోచనా విధానం వేరే ఉంటుంది. మీ భార్య మీపై కోపంగా ఉంటూ, మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వటం లేదంటే దానికి కారణాలు ఇవి అయి ఉండవచ్చు.

భార్య ముందు మరొక స్త్రీని ప్రశంసించడం

ఏ స్త్రీ కూడా తన ముందు మరో స్త్రీని పొగిడితే ఇష్టపడదు. అలాంటిది మీ భార్య ముందు మరొకరి భార్యను కానీ, పరాయి స్త్రీని పొగిడితే ఇంకేమైనా ఉంటుందా? మీరు ఎక్కువగా పరాయి స్త్రీలపై శ్రద్ధ వహిస్తుంటే అది మీ భార్యకు నచ్చదు. ఇలా చేయటం వలన తన మనసులో కోపం పెంచుకుంటుంది. అది అనుమానాలకు తావిచ్చినట్లు అవుతుంది. ఇదే కోపం సందర్భం వచ్చిన ప్రతీసారి భర్తపై ప్రదర్శిస్తుంది.

పరాయి స్త్రీలపై వ్యామోహం

పెళ్లితో ముడివేసిన బంధం మోజు తీరగానే వదిలేసేది కాదు. పెళ్లితో ముడివేసిన బంధం మోజు తీరగానే వదిలేసేది కాదు. తన భర్త వేరొకరిని ఇష్టపడుతున్నాడని తెలిసినా లేదా అలాంటి అనుమానం కలిగినా, భార్య మనసు గాయపడుతుంది. తనకు తెలిసిన విషయం పైకి చెప్పకపోయినా కోపంతో రగిలిపోతుంది. అప్పుడు భర్తను దగ్గరకు కూడా రానివ్వదు.

భార్య రూపంపై తప్పుగా మాట్లాడటం

ఏ భార్య అయినా తన భర్తకు తానే హీరోయిన్ అని భావిస్తుంది. అయితే ఎప్పుడూ వారిని ప్రశంసించాలని కాదు. వారు అందంగా తయారైనపుడు పొగడకపోయినా పర్వాలేదు. కానీ భార్య శరీరాకృతి గురించి నెగెటివ్ కమెంట్స్ చేయడం. తన ఎత్తు, బరువు, రూపం, కలర్ గురించి తక్కువ చేసి మాట్లాడటం వలన భార్యకు అసహనం, కోపం రెండూ పెరుగుతాయి.

భార్య కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం

మీరు ఎల్లప్పుడూ మీ భార్య కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం, ఆమె కుటుంబ సభ్యులను ఎగతాళి చేయడం చేస్తే ఇది మీ భార్యకు ఇది అస్సలు నచ్చదు. తిరిగి ఆమె మీ కుటుంబం గురించి మాట్లాడుతుంది. అది ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది.

భార్యను చులకనగా చూడటం

అందరూ అన్ని విషయాలలో పరిపూర్ణులు కాదు. మీ భార్య చేసే ఏ పనీ మీకు సరిగ్గా అనిపించకపోతే, అది చెప్పే విధానం సరిగ్గా ఉండాలి. నీకు ఏ పని రాదు, ఎందుకూ పనికి రావు అంటూ పదేపదే అంటూ ఉంటే ఎప్పుడో ఒకరోజు బరస్ట్ అవుతారు.

చివరగా చెప్పేదేమిటంటే.. ది రిలేషన్‌షిప్ బిట్విన్ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ బీ లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్.. బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్ అని అన్నాడొక మ్యాన్. ఇక, మీ ఇష్టం!

తదుపరి వ్యాసం