తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wife And Husband | పంతాలకు పోతున్నారు.. తెగిపోయే వరకు లాక్కుంటున్నారు..

Wife and Husband | పంతాలకు పోతున్నారు.. తెగిపోయే వరకు లాక్కుంటున్నారు..

04 March 2022, 17:08 IST

google News
    • ఏ రిలేషన్​లో అయినా మనస్పర్థలు, గొడవలు సహజమే. అలాగే దంపతుల మధ్య కూడా గొడవలు సహజమే. చిన్న చిన్న గొడవలే వారి మధ్య మొదలై.. చినికి చినికి గాలివానగా మారతాయి. వాటి వల్లనే మనస్పర్థలు ఎక్కువై.. తమ బంధాన్ని తెగిపోయే వరకు లాక్కుంటున్నారని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
దంపతుల సమస్యలు
దంపతుల సమస్యలు

దంపతుల సమస్యలు

ప్రతి వివాహం బంధంలో భాగస్వాములు తమ దాంపత్యం ఎలా సాగుతుందనే అనే దానిపై ఆందోళన చెందుతుంటారు. తగాదాలు, వాదనలు పక్కనపెడితే.. వారి మధ్య ఉన్న అపర్థాలతో.. ఒకరికొకరు మంచిగా కూడా మాట్లాడుకోరు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోరు. కనీసం వాటిని పరిగణలోకి కూడా తీసుకోరు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆసక్తిని కోల్పోతారు. ఇలాంటి వివాహం బంధంలోకి ప్రవేశించి.. చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. 

విమర్శలు

మీరు, మీ భాగస్వామి నిరంతరం ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే.. ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపుతున్నప్పుడు వాగ్వాదాలు జరగడం సహజమే. విమర్శించుకోవడమే మీ ఇద్దరి ఆలోచనల్లో మొదటిగా ఉంటుంది. ఇలాంటి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేరు. 

భిన్నంగా వ్యవహిస్తుంటే..

మీ అవసరాలు, కోరికలు రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు దానికి భిన్నంగా మీ భాగస్వామి వ్యవహరించినా.. మీ మధ్య బంధం బీఠలు వారుతున్నట్లు గుర్తించాలి. ఇద్దరు సొంతంగా వ్యక్తిగత నిర్ణయాలపై ఆసక్తి కలిగినవారైతే.. మీ ఇద్దరి మధ్య తగాదాలు తప్పవు. అపార్థాలతో నిండిన సంభాషణలే మీ మధ్య ఉంటాయి.

వ్యంగ్యమైన జోకులు 

జోక్​లు ఒకరిమీద ఒకరు వేసుకోవడం సహజమే కానీ.. అది హెల్తీ అయినంతవరకు బాగానే ఉంటుంది. కానీ మీ జోకు వ్యంగంగా మీ పార్ట్​నర్​కి అనిపిస్తే.. మాత్రం అస్సలు మంచిది కాదు. అసహ్యకరమైన జోకులు వేయడం, వ్యంగ్య సమాధానాలతో పోరాటాలను తిప్పికొట్టడం వంటివి మీ భాగస్వామిని ఫూల్ చేయడం వంటివే. ఇది అస్సలు మంచిది కాదు. మీ భాగస్వామి చాలా బాధపడుతూ ఇబ్బందిగా ఫీల్ అవ్వొచ్చు.

తప్పని తెలిసి కూడా..

మీరు, మీ భాగస్వామి ఒకరి చర్యల గురించి మరొకరు వ్యతిరేకంగా మారడం వివాహం బంధంలో నిత్యం గొడవలు తెస్తుంది. తమ తప్పు తెలిసినప్పటికీ… దానిని అంగీకరించడానికి ఇష్టపడకుండా.. తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ భాగస్వామి ఫీలింగ్స్​ను దెబ్బతీస్తుంది. తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే.. ప్రాబ్లం అక్కడితోనే ముగిసిపోతుంది. 

తదుపరి వ్యాసం