తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Day 2023 : మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు?

Women's Day 2023 : మార్చి 8న మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు?

HT Telugu Desk HT Telugu

03 March 2023, 11:00 IST

    • International Women's Day : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8న మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటారు. అయితే ఆ రోజున ఎందుకు నిర్వహిస్తారు? చరిత్ర ఏంటి?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకొంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడం కోసం ఇది విస్తృతంగా నిర్వహిస్తారు. ఈ రోజు లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింస, మహిళలకు సమాన హక్కులు మొదలైన ముఖ్యమైన సమస్యలపై ఎక్కువగా మాట్లాడుతారు.

ట్రెండింగ్ వార్తలు

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (IWD) ప్రతి సంవత్సరం విభిన్న థీమ్‌తో జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023 యొక్క థీమ్ ఇప్పటికే నిర్ణయించారు. DigitALL: Innovation and technology for gender equality(ఆవిష్కరణ మరియు సాంకేతికతలో లింగ సమానత్వం)గా పెట్టారు. తమ హక్కుల కోసం పోరాడిన ముఖ్యమైన మహిళలందరినీ ఈ రోజు స్మరించుకోవాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శతాబ్దానికి పైగా నిర్వహిస్తున్నారు. 1908లో 15,000 మంది మహిళలు ఇతర కొన్ని విషయాలతోపాటు మెరుగైన వేతనం, ఓటు హక్కును డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరం గుండా కవాతు చేశారు. 1910లో, జర్మనీలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 'మహిళా కార్యాలయం' నాయకురాలిగా ఉన్న క్లారా జెట్‌కిన్ అనే మహిళ, మహిళల డిమాండ్‌ల కోసం ఒత్తిడి చేసేందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆలోచనను ప్రవేశపెట్టింది.

17 దేశాల నుండి 100 మందికి పైగా మహిళలతో జరిగిన సమావేశం ఏకగ్రీవ ఆమోదంతో జెట్‌కిన్ సూచనను ఆమోదించింది. 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. 1913లో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీని మార్చి 8కి మార్చారు. ప్రతి సంవత్సరం అదే రోజున నిర్వహిస్తున్నారు.

మహిళా దినోత్సవాన్ని పర్పుల్, గ్రీన్, వైట్ కలర్స్ లో రిప్రజెంట్ చేస్తారు. పర్పుల్ న్యాయానికి, హుందాతనానికి గుర్తు, పచ్చదనం ఆశావాదానికి, తెలుపు స్వచ్ఛతకు గుర్తు. ఈ రంగులను ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ ప్రతిపాదించిన మీదట యునైటెడ్ కింగ్ డమ్ కేటాయించింది.

టాపిక్