Holiday | అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తెలంగాణలో మహిళా ఉద్యోగులకు సెలవు-telangana govt declares holiday to womens on international women s day ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Holiday | అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తెలంగాణలో మహిళా ఉద్యోగులకు సెలవు

Holiday | అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తెలంగాణలో మహిళా ఉద్యోగులకు సెలవు

HT Telugu Desk HT Telugu
Mar 08, 2022 10:49 AM IST

మహిళా ఉద్యోగులకు కేసీఆర్ సర్కారు తెలంగాణ సర్కార్ ఇవాళ సెలవు ప్రకటించింది. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

<p>ప్రతీకాత్మక చిత్రం</p>
ప్రతీకాత్మక చిత్రం (unplash)

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి ఏటా సెలవు ఇస్తోంది. ఈసారి కూడా మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవాలు జరుపుకొంటున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మ‌హిళ‌ల‌ది స‌మాన పాత్ర ఉంటుంది చెప్పారు. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర త్యాగ‌పూరిత‌మైన‌ద‌ని పేర్కొన్నారు. మహిళలు ఎదిగేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.

మహిళలు.. అన్నీ తానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా.. తల్లిలా ముందుకు సాగుతుందన్నారు. మ‌హిళాభ్యుద‌యానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నామని.. కేసీఆర్ అన్నారు. మ‌హిళ‌ల అభివృద్ధి, సంక్షేమం కోసం ప‌థ‌కాలు అమ‌లు చేస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ.. 10 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్లకు సాయం చేశామన్నారు. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించినట్టు తెలిపారు.

మహిళా పోలీస్ అధికారికి కీలక బాధ్యతలు

ఉమెన్స్ డే.. రోజున రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. సిటీ పోలీస్ విభాగంలో మహిళ ఇన్ స్పెక్టర్ ను శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్ కు ఎస్ హెచ్ ఓ నియమించనున్నారు. ఇవాళ.. హోంమంత్రి మహమూద్‌అలీ, సీవీ ఆనంద్ సమక్షంలో ఆ అధికారిణి బాధ్యతలు తీసుకోనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం