Weight gain: బరువు పెరగాలా? ఈ ఆహారాలు రోజూ తినండి చాలు
07 October 2024, 8:00 IST
Weight gain: తక్కువ బరువుతో ఉండి, ఆరోగ్యకరమైన రీతిలో బరువును పెంచాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు నుండి ఈ 5 ఆహారాలు తినడం ప్రారంభించాల్సిందే.
బరువు పెంచే ఆహారాలు
బరువు తగ్గడానికి ఎంత శ్రమ అవసరమో.. బరువు పెరగడానికి కూడా ఇంచుమించు అంతే శ్రమ అవుతుంది. బరువు పెరగాలనుకునే వారు, వారి బరువును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచాలనుకునే వ్యక్తులు సరైన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం ద్వారా బరువు పెరగడానికి బదులుగా, ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించాలి. బరువు పెరగడానికి 5 ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను నిపుణులు సూచిస్తున్నారు. ఇవి బరువు పెరగడానికి మంచివని భావిస్తారు. ఆ ఆహారాలేమిటో తెలుసుకోండి.
బరువు పెంచే ఆహారాలు:
ఖర్జూరం:
శరీరంలో కొవ్వు పెరగాలంటే కేలరీలు ఎక్కువగా ఉండాలి. ఖర్జూరంలో వంద గ్రాములకు 282 కేలరీలు ఉంటాయి. దీనితో పాటు మంచి మొత్తంలో పిండి పదార్థాలు, పొటాషియం కూడా ఉంటాయి. అదనంగా ఖర్జూరాలు శరీరంలో ఐరన్ పెరుగుదలకు గొప్ప మూలం. కాబట్టి బరువు తక్కువగా ఉన్నవారు ఖర్జూరం తినాలి. తద్వారా ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగవచ్చు.
డ్రై ఫ్రూట్స్:
జీడిపప్పు, బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైన బరువు పెరుగుదలకు ఉత్తమ ఆహారాలు. వీటిలో సంతృప్త కొవ్వుతో పాటు చాలా ఎక్కువ మొత్తంలో కేలరీలను కలిగి ఉంటాయి. ఈ గింజలన్నింటినీ కలిపి మిక్స్ చేసి రోజూ గుప్పెడు తింటే.. ఇది పోషకాలను అందించడమే కాకుండా బరువు కూడా పెరగడానికి సాయపడుతుంది.
మొలకలు:
మొలకెత్తిన గింజలు, శనగలు, పెసరపప్పు వంటి పప్పు దినుసులను నానబెట్టి మొలకెత్తించి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు తగినన్ని కేలరీలు లభిస్తాయి. ఒక కప్పు పచ్చి పెసరపప్పులో 257 కేలరీలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ కె, సి కూడా తగినంత మోతాదులో ఉంటాయి. తక్కువ బరువు ఉన్నవారు రోజూ తింటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఓట్స్:
ఓట్ మీల్, ఓట్స్ సహాయంతో బరువును కూడా సులభంగా పెంచుకోవచ్చు. వంద గ్రాముల ఓట్స్ లో 400 కేలరీలు ఉంటాయి. ఇది 10 గ్రాముల ఫైబర్ మరియు 17 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది. బరువు పెరగాలంటే ఓట్స్ ను ఫుల్ క్రీమ్ మిల్క్, అరటిపండు వంటి పండ్లతో కలిపి తినాలి. ఇది ఆరోగ్యకరమైన మార్గంలో వేగంగా బరువు పెరగడానికి సాయపడతుంది..