వేయించిన శనగలు ప్రతీ రోజు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే

Photo: Unsplash

By Chatakonda Krishna Prakash
Jun 02, 2024

Hindustan Times
Telugu

శనగల్లో ఫైబర్, కాల్షియమ్, ప్రొటీన్, మాగ్నీస్, ఫోలెట్, ఐరన్ లాంటి మరిన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే శనగలను వేయించుకొని తినడం ఉత్తమంగా ఉంటుంది. వేయించిన శనగలను డైలీ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే. 

Photo: Unsplash

వేయించిన శనగలను ప్రతీ రోజు తినడం వల్ల ఎముకల దృఢత్వం మెరుగుపడడంలో తోడ్పడతాయి. కాల్షియమ్ సహా మరిన్ని పోషకాలు ఇందుకు సహాయపడతాయి. 

Photo: Unsplash

ఫైబర్, ప్రొటీన్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గేందుకు కూడా ఫ్రై చేసిన శనగలు చాలా ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ కావాలనుకునే వారు శనగలను రెగ్యులర్‌గా తినడం మంచిది. 

Photo: Unsplash

వేయించిన శనగల్లో గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు కూడా శనగలు తింటే ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Photo: Unsplash

శనగలు ప్రతీ రోజు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. పోషకాలు ఇందుకు సహాయపడతాయి. 

Photo: Unsplash

వేయించిన శనగలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. ఇవి తింటే ఎనర్జీ పెరిగి.. చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి.

Photo: Unsplash

మీ జేబులో ఉండే పర్సు  మీ అదృష్టాన్ని, ఆదాయాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? అవును మీ వ్యాలెట్ రంగును ఫ్యాషన్‌కు తగ్గట్టుగా కాకుండా మీ రాశికి తగ్గట్టుగా ఎంచుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఆదాయం పెరుగుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.

pexel