Magical Water: ఈ నీళ్లను ప్రతిరోజూ తాగారంటే ఆకలి వేయడం తగ్గుతుంది, కొన్ని రోజుల్లోనే బరువు తగ్గిపోతారు
13 June 2024, 13:00 IST
- Magical Water:బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన పానీయం సోంపు నీళ్లు. వీటిని ప్రతి రోజూ తాగడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది.
సోంపు నీళ్లు
Magical Water: సోంపునీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి సోంపు చేసే మేలు ఇంతా అంతా కాదు. సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఎంతో ఆరోగ్యం లభిస్తుంది. సోంపు గింజలకు శరీరాన్ని చల్లబరిచే శక్తి మాత్రమే కాదు, ఆకలిని తగ్గించి ఆరోగ్యంగా బరువు తగ్గేలా చేసే గుణం కూడా ఉంటుంది. దీన్ని రీఫ్రెష్ పానీయంగా కూడా తాగొచ్చు. ఇది తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. సోంపు నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపణ అయ్యాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
ఆకలిని అణిచివేస్తుంది
కొంతమందికి తెగ ఆకలేస్తుంది. అలాగే పని ఏమీ లేకపోయినా ఏదో ఒక జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. దీనివల్ల వారి బరువు త్వరగా పెరిగిపోతారు. ప్రతిరోజూ ఒక గ్లాసు సోంపు నీళ్ళు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినాలన్న ఆసక్తి వారిలో కలగదు. అల్పాహారం తినడానికి ముందు ఒక గ్లాసు సోంపు నీళ్లు తాగడం వల్ల వారికి ఆకలి తక్కువగా వేస్తుంది. భోజనం చేసేటప్పుడు తక్కువ కేలరీలుండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు.
బాలింతలు కచ్చితంగా తాగాల్సిన వాటిలో ఫెన్నెల్ వాటర్ ఒకటి. ఫెన్నెల్ అంటే సోంపు గింజలు. వీటిలో గెలాక్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి. దీనివల్ల బాలింతల్లో పాలు అధికంగా స్రవిస్తాయి. తల్లీ బిడ్డ ఇద్దరికీ అవసరమైన పోషకాలను సోంపు గింజలు అందిస్తాయి.
శరీరంలో వేడి చేసినప్పుడు శీతలీకరణ ప్రభావం గురించి సోంపు గింజలతో చేసిన నీటిని తాగవచ్చు. ఇది డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడమే కాదు, అలసట రాకుండా అడ్డుకుంటుంది. వేడి సంబంధిత సమస్యలను అడ్డుకోవడంలో సోంపు గింజలు ముందుంటాయి. శరీరానికి ఉపశమనం కలిగించే మంటను తగ్గిస్తాయి. ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
శరీరంలో ఇన్ఫ్లమేషన్ వస్తే అది ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు కారణం అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ను తగ్గించే శక్తి సోంపు గింజలకు ఉంది. దీనిలో విటమిన్ సి ఉండడంతోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ లక్షణాలను తగ్గిస్తాయి. కడుపు ఉబ్బరం అంటే సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
గర్భిణులు సోంపు తినవచ్చా?
ఆరోగ్యమైనా కూడా వాటిని మితంగా తింటేనే ఆరోగ్యం. ఏదైనా అతిగా తింటే అనర్థమే జరుగుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు సోంపు నీళ్లు తాగితే చాలు... అంతకుమించి కావలసిన అవసరం లేదు. ఫెన్నెల్ గింజలు ఈస్ట్రోజన్ హార్మోన్ వంటి బలమైన ఈస్ట్రోజన్ లక్షణాలను కలిగి ఉంటాయి. గర్భిణులు సోంపును తాగకూడదు. ఇది పిండం పెరుగుదల, అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది.
సాధారణంగా సోంపు గింజలను మూడు పూటలా తినకూడదు. రోజులో ఒక్కసారి ఒక స్పూన్ తింటే చాలు జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అతిగా తింటే ఇది అనేక సైడ్ ఎఫెక్టులకు కారణం అవుతుంది. సోంపు గింజలను పూర్తిగా పక్కన పెట్టడమే ఉత్తమం. అయితే ప్రసవం అయ్యాక మాత్రం వారు రోజుకు ఒక గ్లాసు సోంపు నీళ్లు లేదా అర స్పూను సోంపు గింజలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుంది.
సోంపు నీళ్లు ఎలా చేయాలంటే... ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూను సోంపు గింజలు వేసి నానబెట్టాలి. నాలుగైదు గంటల పాటూ నానబెట్టి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేదా కాచిన నీళ్లలో ఒక స్పూను సోంపు గింజలు వేసి కలపాలి. వాటిని వడకట్టి తాగాలి.