తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hyderabadi Mutton Biryani: రంజాన్ స్పెషల్ రెసిపీ హైదరాబాదీ మటన్ బిర్యానీ, దీన్ని చేయడం సులువు

Hyderabadi mutton Biryani: రంజాన్ స్పెషల్ రెసిపీ హైదరాబాదీ మటన్ బిర్యానీ, దీన్ని చేయడం సులువు

Haritha Chappa HT Telugu

10 April 2024, 11:31 IST

google News
    • Hyderabadi mutton Biryani: బిర్యానీలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాదీ మటన్ బిర్యానీ. ఒకసారి తిన్నారంటే ఆ రుచి మర్చిపోలేరు. దీని రెసిపీ ఇదిగో.
Mutton Biryani
Mutton Biryani

Mutton Biryani

Hyderabadi mutton Biryani: బిర్యానీ పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. ఇంకా హైదరాబాద్ మటన్ బిర్యానీ తిన్నారంటే... ఆ రుచిని జీవితంలో మర్చిపోలేరు. దీనికోసం మీరు హైదరాబాద్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే హైదరాబాద్ మటన్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. దీని రెసిపీ చాలా సులువు. హైదరాబాద్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాది మటన్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మటన్ - ఒక కిలో

బాస్మతి బియ్యం - అర కిలో

గరం మసాలా పొడి - రెండు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - ఒక కప్పు

ఉల్లిపాయలు - మూడు

పెరుగు - ఒక కప్పు

పసుపు - చిటికెడు

కుంకుమపువ్వు రేకులు - ఆరు

జీడిపప్పు - గుప్పెడు

కారం - రెండున్నర స్పూన్లు

నూనె - ఒక కప్పు

పాలు - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - అర కప్పు

హైదరాబాద్ మటన్ బిర్యానీ రెసిపి

1. మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి.

2. ఆ గిన్నెలో గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి.

3. దీన్ని నాలుగైదు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టండి.

4. ఇలా ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఇది బాగా మ్యారినేట్ అవుతుంది.

5. తర్వాత బాస్మతి బియ్యాన్ని ముందుగానే శుభ్రంగా కడిగి 50 శాతం ఉడికించాలి.

6. అన్నాన్ని పొడిపొడిగా పక్కన వచ్చేలా పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద బిర్యాని వండి హండీ పెట్టుకొని నూనె వేయాలి.

8. నూనెలో ఉల్లిపాయలు, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

9. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

10. ఇప్పుడు అందులో మరి కొంచెం నూనె వేసి ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్‌ను వేయాలి.

11. తరువాత సగం ఉడికిన అన్నాన్ని వేయాలి.

12. కుంకుమపువ్వును పాలల్లో వేసి నానబెట్టుకోవాలి.

12. ఆ అన్నంపై కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలను, పుదీనా తరుగును, కొత్తిమీర తరుగును, వేయించిన ఉల్లిపాయలను వేసి మూత పెట్టేయాలి.

13. చపాతీ పిండిని కలిపి ఆవిరి బయటకు పోకుండా మూత చుట్టూ చుట్టేయాలి.

14. మంటను చిన్నగా పెట్టి ఆవిరి మీదే అన్నం ఉడికేలా చేయాలి.

15. దాదాపు ఇలా 45 నిమిషాల నుండి గంట పాటు ఉడకనివ్వాలి.

16. తర్వాత స్టవ్ కట్టేయాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి అన్నాన్ని పొరలు పొరలుగా కలపాలి. అంతే హైదరాబాది మటన్ బిర్యానీ రెడీ అయినట్టే.

రంజాన్ లో కచ్చితంగా మటన్ బిర్యానీ ప్రతి ముస్లిం ఇంట్లో కనిపిస్తుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అందుకే రంజాన్ లో కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మటన్ బిర్యానీని ట్రై చేస్తారు. ఒక్కసారి తిన్నారంటే దీన్ని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి హైదరాబాద్ మటన్ బిర్యానీ వండి చూడండి. మీకు కూడా నచ్చడం ఖాయం.

తదుపరి వ్యాసం