Hug Day 2023 : రకరకాల కౌగిలింతలు, వాటి అర్థాలు.. మీరెలా హగ్ చేసుకుంటారు?
11 February 2023, 15:06 IST
- Valentine's Week 2023 : ప్రేమికుల వారం నడుస్తోంది. ఫిబ్రవరి 12న హగ్ డే. మీ ప్రియమైన వారిని కౌగిలించుకుంటే.. ఎక్కడా లేని సంతోషం. ఏదో చుట్టూ రక్షణ కవచం ఉన్న ఫీల్. మరి హగ్స్ లో రకాలు ఉన్నాయి. అవేంటో వాటి అర్థాలేంటో తెలుసుకుందామా?
కౌగిలింతలు
మాటలు చెప్పలేని భావాలెన్నో కౌగిలింతలు చెబుతాయి. ఒక్క హగ్(Hug) చాలు.. ప్రియమైన వారికి ఉన్న కోపాన్ని, ఒత్తిడిని తగ్గించేయోచ్చు. వాలెంటైన్స్ డే(Valentine's Day)కి ముందు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే ఉంటాయి. ప్రతీ రోజుకో ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 12 హగ్ డే. ప్రియమైన వారిని కౌగిలించుకుని తెగ సంతోషపడిపోతారు.
పదాలు ఒకరి పట్ల మన భావాలను వ్యక్తపరచలేనప్పుడు, భౌతిక స్పర్శ ద్వారా ఇచ్చే భాష అద్భుతాలు చేస్తుంది. కౌగిలింత మీ ప్రియమైనవారు మిమ్మల్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. మనం విచారంగా ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు లేదా 'హలో' అని చెప్పినప్పుడు కౌగిలించుకుంటాం. కౌగిలింతలు మరొక వ్యక్తితో మన సన్నిహిత సంబంధాన్ని గుర్తు చేస్తాయి. 2011లో జరిపిన ఒక పరిశోధనలో సెక్స్ కంటే కౌగిలించుకోవడం ద్వారా.. రిలేషన్ షిప్(Relationship) దృఢత్వానికి మంచి సూచిక అని కూడా తెలిసింది.
ప్రియమైన వారిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో.. లేక వారిని విడిపోడానికి ఇష్టపడనప్పుడు గట్టిగా కౌగిలించుకుంటారు. ఇది బేర్ హగ్. మిమ్మల్ని ఎవరైనా ఇలా హగ్(Hug) చేసుకుంటే.. మీపై చాలా ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీపిల్లలు మధ్య కాకుండా.. స్నేహితులు, బంధువుల నడుమ కూడా ఉంటుంది. నిన్ను వదిలిపెట్టి ఉండలేను అనే చెప్పే సమయంలో ఇలా హగ్ చేసుకుంటారు.
కొంతమంది హగ్ చేసుకున్నాక.. వీపు మీద చేయి వేసి నిమురుతారు. ఇది చాలా మందికి జరిగే ఉంటుంది. ఇలా ఎవరైనా చేస్తే.. వారు మీకు సెక్యూరిటీ(Security)గా ఉన్నారని అర్థం. నీకు తోడుగా సంరక్షకుడిగా ఉన్న అని చెబుతున్నారన్నమాట. చిన్నారులను పెద్దలు ప్రోత్సహిస్తున్న సమయంలో వారిని ఓదార్చుతున్న టైమ్ లో ఇలా కౌగిలించుకుంటారు.
బ్యాక్ నుంచి హగ్ చేసుకుంటే.. మీ రక్షణ గురించి ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం. ప్రేమికులు, భార్యభర్తల్లోనే ఇలాంటి కౌగిలింతలు ఉంటాయి. మాటల్లో చెప్పలేకపోతుంటే.. ఎవరైనా మిమ్మల్ని వెనకాల నుంచి హత్తుకుంటే.. మీపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థం.
ముఖంపై సంతోషం, చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. ఇది పొలైట్ హగ్. స్నేహితులు, పేరెంట్స్-చిన్నారులకు మధ్య ఉంటాయి. నీకు నేను ఉన్నాననే భరోసా ఇస్తున్నారని దీని మీనింగ్.
మీ ప్రియమైన వారు.. మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తు హగ్ చేసుకుంటే.. వాళ్లకి మీపై పిచ్చి ప్రేమ ఉందని అర్థం చేసుకోవాలి. పీకల్లోతు ప్రేమలో ఉన్నవాళ్లు ఇలాంటి హగ్ చేసుకుంటారు. శరీరాలు గాలికి కూడా గ్యాప్ ఇవ్వకుండా.. టైట్ హగ్ చేసుకుంటారు. కళ్లతోనే మాట్లాడుకుంటారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చెబుతుంది.
ఒకవేళ నడుముపై చేతులు వేసి కౌగిలించుకుంటే.. వారితో జాగ్రత్తగా ఉండాలని అంటారు మరి. ప్రేమించాలా? వద్దా? అనే ఆలోచనల్లో ఉండేవారు.. ఇలా హగ్ చేసుకుంటారని అంటుంటారు. ఇలా చేసేవారు.. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే త్వరగా విడిపోతారట.
లండన్ బ్రిడ్జ్ హగ్.. శరీరాలు పెనవేసుకోకుండా.. కేవలం భూజల మీద మరొకరి చేతులు వేస్తూ.. హగ్ చేసుకుంటారు. ఇది స్వచ్ఛమైన స్నేహంలో భాగంగా చేసుకుంటారుని చెబుతారు.
సైడ్ హగ్ అంటే మీరు పూర్తిగా వారితో క్లోజ్ కాదని చెబుతుంది. పరిచయస్తులలో ఇలా చేయడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది చాలా సన్నిహితంగా లేని వ్యక్తులతో చేస్తారు. ఇది మర్యాద, కొంచెం ఫ్రెండ్ షిప్ సూచిస్తుంది. నడుము చుట్టూ కౌగిలించుకోవడం లేదా దగ్గరకు తీసుకోవడం.. శృంగార హగ్ గా చూడొచ్చు. ఇక ముందుకు సాగుదాం అనే అర్థం ఇందులో ఉంటుంది.